True Happiness: ప్రతి ఒక్క వ్యక్తి తన జీవితం బాగుండాలని కోరుకుంటాడు. అందుకోసం ముందుగా డబ్బు సంపాదిస్తాడు. డబ్బు సంపాదన కోసం ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి మారాల్సి వస్తుంది. ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవారు పట్టణ ప్రాంతాలకు లేదా నగరాలకు వలస వెళ్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉండడంతోపాటు ఉద్యోగాలు, వ్యాపారాలు అందుబాటులో ఉంటాయి. అయితే నగరాల్లో జనం పెరుగుతున్న కొద్దీ జనజీవనం కష్టంగా మారుతుంది. ట్రాఫిక్ పొల్యూషన్ తో పాటు.. ప్రశాంతమైన జీవితం కష్టమవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ కేవలం డబ్బు మాత్రమే లభిస్తుంది. మరి ఆదాయంతో పాటు ఆహ్లాదం, ఆనందం కూడా లభించే ప్రదేశాలు ఉన్నాయి. అవి ఎక్కడో తెలుసా?
ఢిల్లీకి చెందిన గీత దంపతులు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసేవారు. వీరికి ఇద్దరికీ కలిపి 5 లక్షల వరకు ఆదాయం వచ్చేది. కానీ వారి జీవితంలో ఎలాంటి సంతృప్తి లేదు. ఎందుకంటే ప్రతిరోజు కార్యాలయానికి వెళ్లి తిరిగి రావడానికి నరకంలా ఉండేది. అంతేకాకుండా నివాస స్థలాల్లో ఎప్పుడూ శబ్దాలు రావడంతో పాటు.. ఇతరులతో కమ్యూనికేషన్ ఎక్కువగా ఉండేది కాదు. దీంతో ఒంటరి లైఫ్ అని భావించేవారు. అయితే కొన్నాళ్ల తర్వాత వారికి ఒక ఆలోచన వచ్చింది. ఢిల్లీకి పక్కనే ఉన్న హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఒక చిన్న గ్రామంలో వారు ఒక గుట్టపై ఒక గుడిసెను వేసుకున్నారు. ఇక్కడ ఇంటర్నెట్ ను ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఇది గ్రామం కనుక చుట్టుపక్కల ఎవరూ లేరు. కానీ మీరు ప్రతిరోజు ఒక సమయంలో దగ్గర్లోని మరో గ్రామంలోకి వెళ్లి అక్కడి గ్రామస్తులతో కలిసి మెలిసి ఉండేవారు. వారి ఆచారాలను నేర్చుకొని పాటించేవారు. వారి పిల్లలను నగరాల్లో చదివిస్తూ అప్పుడప్పుడు వెళ్లేవారు. ఇంకా వారంలో ఒకరోజు pub, restuarant వంటి ప్రదేశాలకు వెళ్లి తిరిగి గ్రామానికి వచ్చేవారు.
వీరు ఇంట్లోనే ఉంటూ వర్క్ ఫ్రొం హోమ్ చేస్తూ ఒకవైపు ఆదాయాన్ని పొందుతున్నారు.. చుట్టూ పచ్చని చెట్లు ఉండడంతో పాటు ఎలాంటి అలజడి లేకుండా ఉండడం వల్ల ఆహ్లదమైన వాతావరణాన్ని పొందుతున్నారు.. ఈ రెండు ఉండడం వల్ల వారు నిత్యం సంతోషంగా ఉండగలుగుతున్నారు. అంటే వారు ఆదాయంతో పాటు ఆహ్లాదం, ఆనందాన్ని కూడా పొందుతున్నారు. ఇలా ప్రతి ఒక్కరూ కేవలం సిటీలోనే జీవించాలని కోరుకోకుండా.. సమీప గ్రామాల్లోనూ.. దూరపు ప్రాంతాల్లోనూ జీవనాన్ని కొనసాగిస్తూ హ్యాపీగా ఉండవచ్చు. అయితే అందరికీ వర్క్ ఫ్రం హోం ఉండకపోవచ్చు. ఒకవేళ ఈ సౌకర్యం ఉన్నవారికి మాత్రమే సాధ్యమవుతుంది. అయితే కేవలం సాఫ్ట్వేర్ జాబ్ అని మాత్రమే కాకుండా మిగతా వ్యాపారాలు చేసే వారు కూడా ఇలాంటి ప్రదేశాల్లో ఉంటూ ప్రయాణాలు చేయవచ్చు. దీంతో వారి ఆరోగ్యం కూడా బాగుంటుంది.