Tips for Children: ఒకప్పుడు పిల్లలు ఒకవైపు స్కూలుకు వెళ్తూ.. మరోవైపు తల్లిదండ్రులతో కలిసి పనులు చేసేవాళ్లు. దీంతో వారు శారీరకంగా.. మానసికంగా ఎదిగి అన్ని రకాలుగా అభివృద్ధి చెందేవారు. కానీ నేటి కాలంలో ఎక్కువగా పట్టణాలు, నగరాల్లో ఉండడం వలన పిల్లల్లో శారీరక శ్రమ తగ్గిపోతుంది. దీంతో వారు ఆరోగ్యంగా ఉండడం లేదు. ఫలితంగా మెదడు పనితీరు కూడా దెబ్బతింటుంది. ఈ క్రమంలో కొన్ని పాఠశాలలు పిల్లలకు చదువుతోపాటు ప్రాజెక్టు వర్కులను కూడా ఇస్తుంటారు. అయితే ఈ ప్రాజెక్టు వర్కులు కేవలం వారి చదువుల ఉత్తీర్ణతకు మాత్రమే పనిచేస్తాయి. వారి జీవితానికి సంబంధించిన ప్రాజెక్టు వర్క్ లను కూడా ఇవ్వాలి. అలా ఈ దేశంలో పిల్లలతో ప్రాజెక్టు వర్క్ ఇచ్చి కొన్ని పనులు చేయిస్తారు. అవి ఏంటంటే?
మన తెలుగు రాష్ట్రాల్లో కొన్ని స్కూళ్లలో పిల్లలతో కొన్ని పనులు చేయిస్తారు. అయితే ఈ పనులు చేయించడం వల్ల కొందరు పాఠశాలలపై ఆరోపణలు చేస్తూ ఉంటారు. వాస్తవానికి పిల్లలకు చదువుతోపాటు అన్ని రకాల పనులు తెలియాల్సిన అవసరం ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకొని చైనా దేశంలో పిల్లలకు చదువుతోపాటు ఇంట్లో పనులను కచ్చితంగా చేయాలని ఆర్డర్ వేస్తుంటారు. వారు స్కూలుకు వెళ్లి వచ్చిన తర్వాత ఆడపిల్లలు అయితే ఇంట్లోని పనులన్నీ వారితో చేయిస్తారు. ఈ పనులు పాత్రను శుభ్రం చేయించడం.. ఇల్లు క్లీన్ చేయించడం.. ఆహార పదార్థాలను క్లీన్ చేయించడం.. వంటివి ఉంటాయి. మగ పిల్లలు అయితే తండ్రితో పాటు కొన్ని పనులను చేయిస్తారు. ఉదాహరణకు తండ్రి వ్యవసాయ దారుడు అయితే వ్యవసాయానికి సంబంధించిన పనులను పిల్లలతో చేయిస్తారు.
పిల్లలకు చిన్నప్పటి నుంచే ఇలాంటి పనులు చేయించడం వల్ల వారికి చదువుతోపాటు ఇంట్లో ఏ విధంగా ఉండాలి? సమాజ పరిస్థితులు ఏంటి? అనేవి అర్థమవుతూ ఉంటాయి. అలాగే ఒక విద్యార్థికి ఆహారం ఎలా ఉత్పత్తి అవుతుంది? దానిని ఎలా సేకరిస్తారు? అది పండడానికి ఎవరు కష్టపడతారు? అనే విషయాలను కూడా వారికి తెలియజేయాలి. అప్పుడే వారికి ప్రతి ఆహార పదార్థం పై అవగాహన ఉండి.. భవిష్యత్తులో ఆహారాన్ని వృధా చేయకుండా ఉంటారు. అలాగే తండ్రితో పాటు శారీరకంగా కష్టపడడం వల్ల వారికి కష్టం విలువ తెలుస్తుంది. ఇక ఆడపిల్లలు ఇంట్లో తల్లితో పాటు పనిచేయడం వల్ల ఇంటి అవసరాలు ఎలా ఉంటాయో తెలుసుకోగలుగుతుంది. దీంతో భవిష్యత్తులో కుటుంబ వ్యవస్థను కాపాడగలుగుతారు.
ప్రస్తుత కాలంలో మన దేశంలో చాలామంది పిల్లలకు చదువును నేర్పిస్తున్నారు.. కానీ సమాజంపై అవగాహన ఉంచడం లేదు. దీంతో వారు ఆహారాన్ని వృధా చేస్తున్నారు. తల్లిదండ్రులను గౌరవించడం లేదు. అందువల్ల ప్రతి పిల్లవాడికి చదువుతోపాటు మిగతా పనులను కూడా కచ్చితంగా చేపించాలని కొందరు నిపుణులు అంటున్నారు. వీటిని కూడా ఒక ప్రాజెక్టు వర్క్ లా ఏర్పాటు చేసి వారిలో చైతన్యం నింపాలని తెలుపుతున్నారు.