https://oktelugu.com/

WhatsApp: మీ చాట్ లిస్ట్ డిలీట్ కాకుండా.. వాట్సాప్ నెంబర్ మార్చాలా.. అయితే ఇలా చేయండి!

WhatsApp: మీరు కొత్త వాట్సాప్ నెంబర్ కి మారాలని భావిస్తున్నారా. అయితే ఇలా కొత్త నెంబర్ కి మారే సమయంలో కొన్నిసార్లు మన చాట్ డిలీట్ అవుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే ఎంతో విలువైన సమాచారాన్ని కొన్నిసార్లు కోల్పోవలసి వస్తుంది.ఈ విధంగా మన చాట్ లిస్ట్ డిలీట్ కాకుండా కొత్త వాట్సాప్ నెంబర్ కి మారే అద్భుతమైన ఫీచర్ ప్రస్తుతం అందుబాటులో ఉంది. మరి చాట్ లిఫ్ట్ డిలీట్ కాకుండా కొత్త వాట్సాప్ నెంబర్ కు ఎలా […]

Written By: , Updated On : December 20, 2021 / 03:59 PM IST
Follow us on

WhatsApp: మీరు కొత్త వాట్సాప్ నెంబర్ కి మారాలని భావిస్తున్నారా. అయితే ఇలా కొత్త నెంబర్ కి మారే సమయంలో కొన్నిసార్లు మన చాట్ డిలీట్ అవుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే ఎంతో విలువైన సమాచారాన్ని కొన్నిసార్లు కోల్పోవలసి వస్తుంది.ఈ విధంగా మన చాట్ లిస్ట్ డిలీట్ కాకుండా కొత్త వాట్సాప్ నెంబర్ కి మారే అద్భుతమైన ఫీచర్ ప్రస్తుతం అందుబాటులో ఉంది. మరి చాట్ లిఫ్ట్ డిలీట్ కాకుండా కొత్త వాట్సాప్ నెంబర్ కు ఎలా మారాలి? ఆ ఫీచర్ ఏంటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం…

WhatsApp

WhatsApp

ఈ ఫీచర్ ని ఉపయోగించే వారు ముందుగా మీరు మార్చాలనుకున్న నెంబర్ పనిచేస్తుందో లేదో చెక్ చేసుకోవాలి.పని చేస్తున్నప్పుడు మాత్రమే ఇలా మార్చుకోవడానికి అనుగుణంగా ఉంటుంది. అయితే ఈ ఫీచర్ కేవలం కొత్త వాట్సాప్ నెంబర్ కి మారినప్పుడు మాత్రమే ఉపయోగపడుతుంది కానీ ఓకే నెంబర్ తో మరొక ఫోన్ కి పనిచేయదు మరి మన పాత ఫోన్ లో ఉన్నటువంటి చాట్ లిస్ట్ డిలీట్ కాకుండా ఎలా చేయాలి అనే విషయానికి వస్తే..

ముందుగా మన ఆండ్రాయిడ్ ఫోన్ లో వాట్సాప్ ఓపెన్ చేయాలి. ఆ తర్వాత సెట్టింగ్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేయాలి. ఆ తర్వాత చేంజ్ ఆప్షన్ అనే బటన్ పై క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ బటన్ పై క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ పాత వాట్సాప్ నెంబర్ అలాగే కొత్త వాట్సాప్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇలాంటి నెంబర్స్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ బటన్ క్లిక్ చేసినప్పుడు మీరు మీ వాట్సాప్ నెంబర్ మారుతున్నట్లు, మీ కాంటాక్ట్స్ కి నోటిఫై చేయాలా వద్దా అని అడుగుతుంది. అలాంటప్పుడు అక్కడ వచ్చే మూడు ఆప్షన్లలో మీరు దేనినైనా ఎంపిక చేసుకోవచ్చు.

Also Read: Dating: డేటింగ్ కల్చర్ కు కేరాఫ్ గా మారుతోన్న హైదరాబాద్?

ఇలా ఆప్షన్ ఎంచుకోగానే డన్ అనే బటన్ పై క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేయగానే వాట్సాప్ కొత్త మొబైల్ నంబర్‌తో అకౌంట్ రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా అడుగుతుంది ఆ తర్వాత ఆరు సంఖ్యల ఓటిపిని ఎంటర్ చేసి రిజిస్టర్ చేసుకోవాలి.ఇలా రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీ వాట్సాప్ నెంబర్ మారడమే కాకుండా మీ పాత వాట్సాప్ లో ఉన్నటువంటి కాల్ లిస్ట్ డిలీట్ కాకుండా కొత్త వాట్సాప్ లోకి ఎంటర్ అవుతుంది.

Also Read: Google Year in Search 2021: ఈ ఏడాది గూగుల్‌లో ఎక్కువ మంది వీరి కోసమే వెతికారు..వారు ఎవరంటే?