https://oktelugu.com/

RRR: ఆర్​ఆర్​ఆర్​లో ఆ ఒక్క సీన్​ అరుపులే అంటున్న రాజమౌళి

RRR: టాలీవుడ్​తో పాటు ఇండియన్​ ఆడియన్స్ మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ఆర్​ఆర్​ఆర్​. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మెగా పవర్​స్టార్ రామ్​చరణ్​, యంగ్​ టైగర్​ ఎన్టీఆర్​ ప్రధాన పాత్రలు పోషించారు. అలియా భట్, ఓలివియా మోరిస్​, శ్రియా శరణ్​, అజయ్​ దేవగణ్​, సముద్రఖని ప్రధాన పాత్రలు పోషించారు. సంక్రాంతి కానుకగా జనవరి 7న ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్​లు, టీజర్లు, గలింప్స్​, పాటలు అభిమానులను […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 20, 2021 / 04:24 PM IST
    Follow us on

    RRR: టాలీవుడ్​తో పాటు ఇండియన్​ ఆడియన్స్ మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ఆర్​ఆర్​ఆర్​. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మెగా పవర్​స్టార్ రామ్​చరణ్​, యంగ్​ టైగర్​ ఎన్టీఆర్​ ప్రధాన పాత్రలు పోషించారు. అలియా భట్, ఓలివియా మోరిస్​, శ్రియా శరణ్​, అజయ్​ దేవగణ్​, సముద్రఖని ప్రధాన పాత్రలు పోషించారు. సంక్రాంతి కానుకగా జనవరి 7న ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్​లు, టీజర్లు, గలింప్స్​, పాటలు అభిమానులను ఎంతగానో ఆక్టుకున్నాయి. ఇటీవలే విడుదలైన ట్రైలర్​ అయితే యూట్యూబ్​నే షేక్ ఆడిస్తోంది.

    కాగా, ఇదే స్పీడ్​తో ప్రమోషన్స్​లో జోరు పెంచారు రాజమౌళి. ఇప్పటికే ట్రైలర్ విడుదల చేసిన తర్వాత ప్రెస్​ మీట్​ నిర్వహించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తాజాగా, ముంబయి వేదికగా ప్రీ రిలీజ్​ ఈవెంట్​ను నిర్వహించారు రాజమౌళి. ఈ కార్యక్రమం ప్రత్యక్షప్రసారం కాకపోయినప్పటికీ.. ఇందుకు సంబంధించిన అప్​డేట్స్ వస్తూనే ఉన్నాయి. కాగా, ఈ సినిమాలో గూస్​బంప్స్ తెప్పించే ఎమోషనల్​ సీన్​ ఒకటుందని హింట్ ఇచ్చారు.

    Also Read: ‘ఆర్​ఆర్​ఆర్’ వచ్చాక ఓ 4 నెలలు ఏ సినిమా విడుదల చేయకుంటే బెటర్​- సల్మాన్

    ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆర్​ఆర్​ఆర్​లో ఒక ప్రత్యేకమైన సీన్​ ఉంది. అది మీ అందర్నీ థియేటర్లలో సీట్లమీద అసలు కూర్చోనివ్వదు. దాన్ని సీక్రెట్​గా ఉంచాం. కచ్చితంగా ఆ సీన్​ను థియేటర్లలోనే చూడాలి. ప్రస్తుతానికైతే దాని గురించి ఎలాంటి రివీల్​ చేయాలనుకోవట్లేదు. అంటూ వివరించారు. దీన్ని బట్టి చూస్తుంటే సెకండ్ ఆఫ్​లో వచ్చే సీన్​ గురించే జక్కన్న చెప్పినట్లు తెలుస్తోంది.

    Also Read: ‘ఆర్ఆర్ఆర్’కు అంతర్జాతీయ స్థాయి అవార్డు.. వస్తోందా ?