National crush hot comments: హీరోయిన్ కావాలంటే ఆ నొప్పిని భరించాలి.. నేషనల్ క్రష్ హాట్ కామెంట్స్..

నేషనల్ క్రష్ అనగానే యూత్ లో ఎక్కడా లేని ఉత్సాహం నెలకొంటుంది. ఎందుకంటే ఆ బిరుదు తెచ్చుకు అందాల భామ ఎవరో కాదు.. రష్మికా మందానా..కన్నడ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ తరువాత పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు, తమిళం, హిందీ అని తేడా లేకుండా వరుస సినిమాలు చేస్తుంది

Written By: Srinivas, Updated On : October 18, 2024 11:51 am

National-Crush

Follow us on

National crush hot comments: నేషనల్ క్రష్ అనగానే యూత్ లో ఎక్కడా లేని ఉత్సాహం నెలకొంటుంది. ఎందుకంటే ఆ బిరుదు తెచ్చుకు అందాల భామ ఎవరో కాదు.. రష్మికా మందానా..కన్నడ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ తరువాత పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు, తమిళం, హిందీ అని తేడా లేకుండా వరుస సినిమాలు చేస్తుంది. రష్మికా మందానా సినిమాల్లో మాత్రమే కాకుండా పలు యాడ్స్ లో కనిపించి అలరిస్తుంది. ఈ నేపథ్యంలో ఆమె రియల్ లైఫ్ లో ప్రేక్షకులకు కనిపించి ఆకట్టుకుంటుంది. వీటితో పాటు సోషల్ మీడియాలోనూ ఈ క్రష్ హాట్ కామెంట్స్ చేయడంలో ముందు ఉంటుంది. తాజాగా సినిమా లైఫ్ గురించి ఆమె చేసిన కామెంట్స్ రచ్చ చేస్తున్నాయి. ఇంతకీ ఆమె ఈ కామెంట్స్ ఎందుకు చేసిందంటే?

‘కిట్టి పార్టీ’ అనే సినిమతో ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టన రష్మికా మందానాను మొదట్లో ఎవరూ పట్టించుకోలేదు.. ఆ తరువాత తెలుగులో ‘ఛలో’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా యావరేజ్ గా ఉన్నా.. ప్రేక్షకులకు ఈ బ్యూటీ పరిచయం అయింది. అయితే ఆ తరువాత ‘గీత గోవిందం’ సినిమాతో రష్మికా స్టార్ డం తెచ్చుకుంది. ఈ మూవీ తరువాత పలు సినిమాల్లో నటంచడంతో ఆమె గుర్తింపు వచ్చింది. ఇక పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’ సినిమాతో రష్మికాకు పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు వచ్చింది. దీంతో ఆమెకు బాలీవుడ్ నుంచి కూడా ఆఫర్లు వచ్చాయి. హిందీలో ‘యానిమల్’ సినిమాలో నటించిన తరువాత ఆమెను ‘నేషనల్ క్రష్’అని పిలుస్తున్నారు.

ప్రస్తుతం ఈ యంగ్ లేడీ ‘పుష్ప 2’ సినిమా కోసం పనిచేస్తుంది. ఆ పనుల్లోనే బిజీగా కనిపిస్తుంది. పుష్ప పార్ట్ 1లో రష్మికా యాక్టింగ్ తో అదరగొట్టింది. ఇందులో ఆమె డీ గ్లామర్ గా కనిపించింది. ఇప్పుడు పుష్ప 2 లో మరింత బ్లాక్ కలర్లో రష్మిక కనిపించే అవకాశం ఉంది. దీని కోసం రష్మిక ప్రత్యేకంగా మేకప్ వేసుకుంటుందట. ప్రతిరోజూ మేకప్ వేసుకొని తీసివేయడానికి చాలా సమయం పడుతుందట. అందువల్ల మధ్యాహ్న సమయంలో మేకప్ ను అలాగే ఉంచి ఓన్లీ జ్యూస్ మాత్రమే తీసుకుంటుందట. అయితే రాత్రి సమయంలో మేకప్ తీసినప్పుడు తీవ్రంగా నొప్పి ఉంటుందట.

ఈ నేపథ్యంలో రష్మిక తన పుష్ప 2 కు సంబంధించిన ఫొటోలను షేర్ చేస్తూ ‘నొప్పి భరిస్తేనే హీరోయిన్ అవుతాం’ అంటూ క్యాప్షన్ పెట్టింది. ముందుగా ఈ కామెంట్ ను చూసి కుర్రకారు షాక్ తిన్నారు. కానీ అసలు విషయం తెలిశాక సర్దుకున్నారు. హీరోయిన్ కావాలంటే ఎన్నో కష్టాలు పడాలి… ఊరికే స్టార్లు కాలేరు… అంటూ రష్మిక చేసిన మెసేజ్ పై చాలా మంది లైక్ చేస్తున్నారు. దీంతో రష్మిక కామెంట్స్ తో పాటు ఆమె పిక్ష్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

రష్మిక ఇటీవల సైబర్ క్రైంకు బ్రాండ్ అంబాసిడర్ గా నియమితులయ్యారు. సైబర్ నేరాలపై అవగాహన కల్పించేందకు ఆమె ప్రత్యేక వీడియోలో కనిపించారు. గతంలో ఆమె పిక్స్ ను మార్పింగ్ చేసి కొందరు వీడియోలు తయారు చేసిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో ఆమె చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.