https://oktelugu.com/

Devotional Tips: లక్ష్మీదేవి ఎప్పటికీ స్థిరంగా మీ ఇంట్లో ఉండి పోవాలంటే ఈ చిన్న చిట్కాలు పాటించాల్సిందే!

Devotional Tips: సాధారణంగా ప్రతి ఒక్కరు వారి జీవితంలో సంతోషంగా గడపాలని భావిస్తారు.ఈ క్రమంలోని జీవితంలో ఉన్నతమైన స్థానాల్లో ఉండడం కోసం ఎంతో కష్టపడి పనులు చేసి సంపాదిస్తున్నా డబ్బు మాత్రం చేతిలో నిలవదు. ఏదో ఒక రూపంలో డబ్బు మొత్తం ఖర్చు అవుతుంది.అయితే లక్ష్మీదేవి Vastu tips Telugu మన ఇంట్లో స్థిరంగా ఉండాలంటే మనం సంపాదించినది మన చేతిలో నిలబడాలన్నా కొన్ని చిట్కాలను పాటిస్తే లక్ష్మీ దేవి ఎప్పటికి మన ఇంట్లోనే ఉంటుందని వాస్తు […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : February 10, 2022 6:26 pm
    Follow us on

    Devotional Tips: సాధారణంగా ప్రతి ఒక్కరు వారి జీవితంలో సంతోషంగా గడపాలని భావిస్తారు.ఈ క్రమంలోని జీవితంలో ఉన్నతమైన స్థానాల్లో ఉండడం కోసం ఎంతో కష్టపడి పనులు చేసి సంపాదిస్తున్నా డబ్బు మాత్రం చేతిలో నిలవదు. ఏదో ఒక రూపంలో డబ్బు మొత్తం ఖర్చు అవుతుంది.అయితే లక్ష్మీదేవి Vastu tips Telugu మన ఇంట్లో స్థిరంగా ఉండాలంటే మనం సంపాదించినది మన చేతిలో నిలబడాలన్నా కొన్ని చిట్కాలను పాటిస్తే లక్ష్మీ దేవి ఎప్పటికి మన ఇంట్లోనే ఉంటుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. మరి ఆ చిట్కాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం….

    Devotional Tips

    vastu tips in telugu

    లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగు పెట్టాలంటే ముందు మన ఇంటిలో ఇంటి బయట పరిశుభ్రంగా ఉండాలి. అందుకే ఉదయమే నిద్రలేచి ఇల్లు మొత్తం శుభ్రం చేసుకుని ఇంటి ముందు ముగ్గు పెట్టడం ఎంతో ముఖ్యం. అయితే ప్రస్తుత కాలంలో చాలా మంది ఇంటి ముందు ముగ్గు వేయడానికి ముగ్గు పిండి కాకుండా చాక్ పీస్ ఉపయోగిస్తుంటారు. ఇది చాలా పెద్ద పొరపాటు. లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉండి ఆమె మన ఇంట్లోకి అడుగు పెట్టాలంటే ఇంటి ముందు ముగ్గు పొడితో చక్కగా ముగ్గులు వేయాలి. ఇలా ముగ్గు పిండితో ముగ్గు వేయడం వల్ల ఇంటికి ఒక కళ వస్తుంది. తద్వారా మన ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది.

    Also Read: తెలంగాణలో పదో తరగతి విద్యార్థులకు ఇది గొప్ప శుభవార్త

    Devotional Tips

    Devotional Tips

    అదేవిధంగా చాలామంది ఉదయం ఎంతో ఆలస్యంగా నిద్ర లేస్తుంటారు. ఇలా ఆలస్యంగా లేవడం మంచిది కాదు ఇలాంటి అలవాటు ఉన్నవారికి లక్ష్మీదేవి అనుగ్రహం కలగదు. అదేవిధంగా స్నానాలు చాలా ఆలస్యంగా చేయడం. ఇలాంటి అలవాట్లు కూడా మానుకోవాలి. ఉదయమే నిద్రలేచి మన పరిసరాలను శుభ్రం చేసుకుని స్నానం చేసి ఆ భగవంతుడిని స్మరించుకుని అనంతరం మన రోజువారి కార్యక్రమాలను ప్రారంభించాలి. ఇలాంటి పద్ధతులను పాటించినప్పుడే ఆ లక్ష్మీదేవి కరుణాకటాక్షాలు మనపై ఉంటాయి.

    Also Read: టీచర్లకు షాకిచ్చిన ఏపీ సర్కార్.. రాజీనామాలతో ఉద్యమానికి కార్యాచరణ

    Director SS Rajamouli Superb Words About Chiranjeevi | AP Movie Ticket Prices Issue

    Director SS Rajamouli Superb Words About Chiranjeevi || AP Movie Ticket Prices Issue || OkTelugu