Spoon : ఉప్పు మితంగా వాడితే పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ నేటి కాలంలో రుచి కోసం ఉప్పును వాడటం అధికమైపోయింది. పైగా రకరకాల టెస్టింగ్ సాల్ట్ లు అందుబాటులోకి వచ్చిన తర్వాత జనం విరివిగా వాడుతున్నారు. చైనీస్ ఫుడ్ లో ప్రమాదకరమైన టేస్టింగ్ సాల్ట్ వాడుతుంటారు. అది క్యాన్సర్ వ్యాధికి దారితీస్తుంది. ఇక ఉప్పు అధికంగా వాడితే రక్తపోటు సమస్య ఎదురవుతుందని వైద్యులు చెబుతుంటారు. అందువల్లే 30 సంవత్సరాల వయసు దాటినవారు ఉప్పు వాడకాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించుకోవడమే మంచిదని వైద్యులు సూచిస్తుంటారు. ఉప్పు రక్తపోటును పెంచుతుందని.. అది అంతిమంగా గుండె పనితీరును ప్రభావితం చేస్తుందని వైద్యులు వివరిస్తున్నారు. అందువల్లే ఆరోగ్యవంతమైన మనిషి ప్రతిరోజు 5 గ్రాముల కంటే తక్కువ ఉప్పును తీసుకోవాలని సూచిస్తుంటారు. అయితే కొంతమంది ఉప్పు మీద ఉన్న మమకారాన్ని తగ్గించుకోలేక.. ఇష్టానుసారంగా వాడుతుంటారు. రోగాల బారిన పడుతుంటారు. అయితే ఈ ఉప్పు ముప్పును దూరం చేయడానికి జపాన్ శాస్త్రవేత్తలు ఒక కొత్త పరికరాన్ని కనుగొన్నారు.
ముప్పును దూరం చేస్తుందట
ఉప్పు ముప్పును దూరం చేయడానికి జపాన్ శాస్త్రవేత్తలు ఎలక్ట్రిక్ సాల్ట్ స్పూన్ ను అభివృద్ధి చేశారు.. ఇది ఆహారంలో ఉప్పు వేయకపోయినప్పటికీ ఆ రుచిని మీకు అందిస్తుంది. ఈ పరికరం తేలికపాటి విద్యుత్ ప్రవాహాన్ని పంపిస్తుంది. నాలుకలో ఉన్న టెస్టింగ్ బడ్స్ ను ఉత్తేజితం చేస్తుంది. దానివల్ల నాలుకకు ఉప్పు రుచి తగులుతుంది. దీనిని ఉపయోగించడం వల్ల అధిక రక్తపోటు ప్రమాదం తగ్గుతుంది. అంతేకాదు గుండె పనితీరు కూడా మెరుగుపడుతుంది. రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోకుండా చేస్తుంది. అయితే ఇది అభివృద్ధి దశలోనే ఉందని.. ఇక పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడానికి సమయం పడుతుందని జపాన్ శాస్త్రవేత్తలు అంటున్నారు. ” రోజురోజుకు ఉప్పు వినియోగం పెరిగిపోతోంది. దేశాలతో సంబంధం లేకుండా ఈ సమస్య అధికమవుతోంది. అధికంగా ఉప్పు వినియోగించడం వల్ల రక్తపోటు సమస్య ఎదురవుతోంది. దీనివల్ల అకాల మరణాలు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని సందర్భాల్లో అయితే గుండె వైఫల్యాలు కూడా సంభవిస్తున్నాయి. అలాంటప్పుడు సాధ్యమైనంతవరకు ఉప్పు వాడకాన్ని తగ్గించాలి. అయితే కొంతమంది ఉప్పును వాడకుండా ఉండలేరు. అందువల్ల ఈ పరికరాన్ని తయారు చేశాం. అభివృద్ధి కూడా చేశాం. ఇంకా కొన్ని స్వల్ప మార్పులు ఉన్నాయి. త్వరలోనే అందుబాటులోకి తెచ్చి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజల ఆరోగ్యాలను మెరుగుపరుస్తాం. ప్రస్తుతం ఈ పరికరం అభివృద్ధి దశలో ఉంది. మరి కొద్ది రోజుల్లో పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుంది.. అప్పుడు ఒప్పుకు బదులుగా దీనిని వాడితే సరిపోతుంది. అయితే దీని వాడకం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. పూర్తి విద్యుత్ ద్వారా పనిచేస్తుంది కాబట్టి పెద్దగా ఇబ్బంది ఉండదని” జపాన్ శాస్త్రవేత్తలు అంటున్నారు.