Goddess Lakshmi : ఈ ఏడాది భోగి పండగ చాలా శుభ యోగంలో వచ్చింది. అంతేకాదు ఈ రోజు చాలా అరుదుగా వస్తుంది. 110 ఏళ్ల తర్వాత పుష్య మాసం పౌర్ణమి తిధి, సోమవారం ఆరుద్ర నక్షత్రం కలిసి వచ్చాయి అంటున్నారు నిపుణులు. అంతేకాదు ఈ పౌర్ణమి శుక్ల పక్షం చివరి తిధి. ఈ రోజున నదీ స్నానం చేయడమే కాదు కొన్ని ప్రత్యేక వస్తువులను దానం చేయడం వల్ల కూడా చాలా మంచి జరుగుతుంది. పౌర్ణమి రోజున శ్రీమహావిష్ణువును, లక్ష్మీదేవిని పూజించడం వల్ల ధనలాభం కలుగుతుంది అంటున్నారు పండితులు.
పుష్య పూర్ణిమ నాడు ఓ 3 పనులు చేయండి లక్ష్మి దేవి ఆనందాన్ని పొందే అవకాశం ఉంటుంది అంటున్నారు పండితులు. పుష్య మాసంలోని శుక్ల పక్ష పౌర్ణమి రోజు మతపరమైన దృక్కోణంలో చాలా ముఖ్యమైనదిగా ఈ రోజును పరిగణిస్తారు. పుష్య పూర్ణిమ నాడు లక్ష్మీదేవిని, శ్రీ హరివిష్ణువును పూర్ణ క్రతువులతో పూజించడం ద్వారా ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.
పుష్య మాసం పౌర్ణమి రోజు లక్ష్మీదేవికి అంకితం చేశారు. ఈ సంవత్సరం, జనవరి 13 పుష్య మాసం పౌర్ణమి రోజు, ఇది మతపరమైన దృక్కోణం నుంచి చాలా ముఖ్యమైనదిగా చెబుతున్నారు. పుష్య పూర్ణిమ నాడు లక్ష్మీదేవిని, శ్రీ హరివిష్ణువును పూర్తి ఆచారాలతో పూజించడం వలన అదే సమయంలో, పుష్య పౌర్ణమిపై కొన్ని చర్యలు కూడా మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తాయి అంటున్నారు పండితులు. పుష్య పూర్ణిమ రోజున లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునే మార్గాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మత విశ్వాసాల ప్రకారం, మోదుగ పువ్వులతో లక్ష్మీ దేవిని పూజించాలి. ఈ పూలు ఆ తల్లికి చాలా ప్రియమైనవి. ఇక పుష్ప పౌర్ణమి రోజున పూజించేటప్పుడు, లక్ష్మీదేవికి మోదుగ పుష్పాన్ని సమర్పించండి. అదే సమయంలో ఇంట్లో మొదుగ పూల మొక్కను నాటడం ద్వారా లక్ష్మీదేవి ఇంట్లోనే తిష్టవేస్తుంది. ఇంటి నుంచి దారిద్ర్యం తొలగిపోతుంది.
మీ ఇంటి నుంచి పేదరికం తొలగిపోవాలంటే, పుష్య పౌర్ణమి రోజున లక్ష్మీదేవికి ఒక్క కొబ్బరికాయను సమర్పించండి. పుష్య పూర్ణిమ రోజున లక్ష్మీదేవికి ఒక్క కొబ్బరికాయను నైవేద్యంగా పెడితే ఇంట్లో సుఖసంతోషాలు, శ్రేయస్సు పెరుగుతాయని నమ్ముతారు. పుష్య పూర్ణిమ రోజున, అమ్మవారికి ఒక్క కొబ్బరికాయను సమర్పించి, మరుసటి రోజు ఈ కొబ్బరికాయను భద్రంగా డబ్బు స్థానంలో ఉంచండి. దీనివల్ల ఇంటికి శుభాలు కలుగుతాయి.
బంగారం, వెండి
పుష్య పౌర్ణమి రోజున బంగారం, వెండి కొనుగోలు చేయడం శుభప్రదంగా పరిగణిస్తారు. అటువంటి పరిస్థితిలో, లక్ష్మీ దేవి అపారమైన ఆశీర్వాదం పొందడానికి, ఇంట్లో ఆనందం, శ్రేయస్సును పెంచడానికి అవకాశం ఉంటుంది. మీరు పుష్య పూర్ణిమ రోజున బంగారం లేదా వెండిని కొనుగోలు చేయడం మర్చిపోకండి.