AP Liquor: పండుగ పూట మందుబాబులకు గుడ్ న్యూస్. కొన్ని రకాల బ్రాండ్ల మద్యం ధరలు( branded liquor ) తగ్గుముఖం పట్టాయి. కొత్త మద్యం పాలసీలో భాగంగా ప్రభుత్వం చాలావరకు బ్రాండ్ల మద్యం ధరలు తగ్గించింది. 99 రూపాయలకే క్వార్టర్ మద్యం అందుతోంది. దీంతో మరికొన్ని బ్రాండ్లు తగ్గించాలన్న ప్రతిపాదనకు కంపెనీలు సమ్మతించాయి. ఇప్పటికే 10 కంపెనీలు తమ ఉత్పత్తుల ధరను తగ్గించగా.. తాజాగా మరో ఆరు కంపెనీలు ముందుకు రావడంతో మద్యం ధరలు తగ్గించనున్నాయి. ప్రముఖ బీర్ల ధరలు కూడా తగ్గించారు. దీంతో మందుబాబులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే మద్యం ధరలు తగ్గిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అందుకే అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రైవేట్ మద్యం దుకాణాలు ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 3336 దుకాణాలు ఏర్పాటయ్యాయి. అలాగే కొన్ని రకాల బ్రాండెడ్ మద్యం ధరలు కూడా తగ్గించి విక్రయిస్తున్నారు.
* కొత్త మద్యం పాలసీ
మద్యం పాలసీకి( liquor policy) సంబంధించి పక్క రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాన్ని అధ్యయనం చేశారు. అందుకు తగ్గట్టుగా ధరలు తగ్గించి విక్రయించాలని నిర్ణయించారు. అందులో భాగంగా చాలా రకాల బ్రాండ్ల మద్యం ధర తగ్గింది. ముఖ్యంగా 99 రూపాయలకే క్వార్టర్ మద్యం అందుతుండడం మందుబాబులకు ఉపశమనం కలిగింది. అయితే ఆ బ్రాండ్ మద్యానికి విపరీతమైన డిమాండ్ ఉంది. అయితే అన్ని బ్రాండ్ల మధ్య తగ్గించాలన్న డిమాండ్ ఉంది. ఏపీలో ప్రస్తుతం 16 కంపెనీలకు చెందిన మద్యం ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో పది బ్రాండ్ల ధరలు తగ్గించారు. ఇప్పుడు మిగతా 6 కంపెనీలు సైతం ధర తగ్గించేందుకు ముందుకు రావడం విశేషం. సంక్రాంతి పూట తగ్గించిన ధరలతోనే మద్యం సరఫరా చేస్తున్నారు.
* రూ.99 మద్యానికి డిమాండ్
ప్రధానంగా 99 రూపాయల మద్యానికి భారీ డిమాండ్ ఉంది. ఇప్పుడు జరుగుతున్న అమ్మకాల్లో 30% ఆ బ్రాండ్ దే. అందుకే ప్రధాన కంపెనీలన్నీ 99 రూపాయలకే మద్యం అందించేందుకు సిద్ధపడుతున్నాయి. ఈ బ్రాండ్ మద్యం( branded liquor ) అమ్మకాలు గణనీయంగా పెరగడంతో.. తాము సైతం అందించేందుకు ఆ కంపెనీలు ముందుకు రావడం విశేషం. ప్రముఖ కంపెనీలన్నీ ధర తగ్గిస్తుండడంతో ఇతర కంపెనీల పై ఒత్తిడి పెరుగుతోంది. దీంతో తాము సైతం మద్యం ధరలు తగ్గిస్తామని ప్రభుత్వానికి విన్నవించాయి సదరు కంపెనీలు. ప్రభుత్వం ఆమోదముద్ర వేయడంతో సరఫరాను ప్రారంభించాయి కూడా. మరోవైపు బెల్ట్ షాపులు లేకుండా ప్రభుత్వం కట్టడి చేస్తోంది. మద్యం విక్రయాలపై నిఘా కూడా పెరిగింది. దీంతో ధరలు తగ్గించి అమ్మకాలు పెంచుకోవడమే ఉత్తమమని కంపెనీలు ఒక నిర్ణయానికి వచ్చాయి.
* ఇప్పటికే ధర తగ్గుదల
కంపెనీలు ధరలు తగ్గించడంతో.. క్వార్టర్ మద్యం 20 రూపాయల నుంచి 80 రూపాయల వరకు ధర తగ్గినట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే మాన్షన్ హౌస్( Mansion house ) క్వార్టర్ ధర 30 రూపాయలు తగ్గించారు. అరిస్ట్రో కాట్ ప్రీమియం సుపీరియర్ విస్కీ ధర ఏకంగా 50 రూపాయలకు తగ్గింది. కింగ్ ఫిషర్ బీర్ పై పది రూపాయల ధర తగ్గింది. బ్యాక్ పేపర్ గోల్డ్ రిసర్వ్ విస్కీ ఒకేసారి 80 రూపాయలు తగ్గించుకునేందుకు దరఖాస్తు చేసుకుంది సదర్ కంపెనీ. అయితే కంపెనీలు ధర తగ్గించుకోవడం మూలంగా ప్రభుత్వానికి పన్నుల ద్వారా ఆదాయం తగ్గే అవకాశం ఉంది. అయినా సరే ప్రభుత్వం మాత్రం ఇచ్చిన హామీ మాదిరిగా మద్యం ధరలు తగ్గించడానికి ప్రయత్నిస్తోంది.