Home Loan: ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇల్లు కట్టడం గగనమే. గతంలో డబ్బులన్నీ కూడబెట్టి ఇల్లు నిర్మించుకునేవారు. కానీ ఇప్పుడు డబ్బలు ఆదా అయ్యేవరకు వయసు అయిపోతుంది. దీంతో చాలా బ్యాంకులు ఇల్లు కట్టుకోవడానికి Home Loan రూపంలో సాయం చేస్తున్నాయి. నెలనెలా వచ్చే ఆదాయంలో కొంత పేమేంట్ చేస్తూ చాలా మంది సొంతిల్లు కట్టుకుంటున్నారు. అయితే Home Loan తీసుకున్న వారు అది త్వరగా పూర్తి కావాలని ఆరాటపడుతుంటారు. ఈ క్రమంలో లోన్ తీసుకున్న తరువాత కొన్ని రోజులకు డబ్బలు ఇతర మార్గాల నుంచి వస్తే అది చెల్లించి ప్రీ క్లోజ్ చేసుకోవాలనుకుంటారు. కానీ ఇక్కడ కాస్త ఆలోచిస్తే రూ.8 లక్షలు సేవ్ చేసుకున్నవారవుతారు. అదెలాగో చూద్దాం..
ఉద్యోగస్తులైతే Home Loan చాలా ఉపయోగపడుతుంది. నెలానెలా జీతం వస్తుంది. దీంతో ఈఎంఐ రూపంలో Home Loan కట్టుకోవచ్చు. అయితే కొన్ని బ్యాంకులు తక్కువ వడ్డీకే Home Loan ఇస్తుండడంతో వ్యాపారస్తులు సైతం ఆసక్తి చూపుతున్నారు. అయితే ఉద్యోగులు లేదా వ్యాపారస్తులకు ఒక్కోసారి ఎల్ఐసీ లేదా ఇతర పెట్టుబడుల ద్వారా పెద్ద మొత్తంలో ఆదాయం వస్తుంటుంది. దీంతో వడ్డీ భారం తగ్గించుకోవడానికి ప్రీక్లోజ్ చేయాలని చూస్తారు. వాస్తవానికి ఇలా చేయడం వల్ల డబ్బులు సేఫ్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఒక పద్ధతి ద్వారా ఫ్రీ క్లోజ్ చేయడం వల్ల ఎక్కువ డబ్బలు ఆదా చేయొచ్చు.
సొంతిల్లు నిర్మించుకోవాడనికి ఉదాహరణకు రూ.30 లక్షల లోన్ తీసుకున్నారనుకుందాం.. నెల నెలా రూ.25,000 చెల్లిస్తున్నారు. లోన్ మొత్తానికి 8శాతంగా వడ్డీని నిర్ణయించి 25 సంవత్సరాల టెన్యూర్ (కాల పరిమితి) పెట్టుకున్నారు. అయితే 5 సంవత్సరాల వరకు రూ. 15,00,000 లక్షలు చెల్లిస్తారు. అయితే ఈ సమయంలో కొన్ని మార్గాల ద్వారా రూ.5 లక్షల మొత్తం వచ్చింది. వీటితో ప్రీ క్లోజ్ చేసుకోవాలని అనుకుంటారు. మిగతా మొత్తం అంటే రూ.25000×15=45,00,000 చెల్లించాల్సి ఉంటుంది. ఈ సమయంలో రూ.5 లక్షల చెల్లిస్తే రీమేనింగ్ రూ.40 లక్షలు బ్యాలెన్స్ ఉంటుంది.
ఈ మొత్తానికి అప్పటి వరకు ఉన్న రూ.25వేల ఈఎంఐ నుంచి రూ.20,000 తగ్గించుకుంటే మొత్తంగా రూ.36,00,000 మాత్రమే చెల్లించాలి. దీని ద్వారా రూ. 4 లక్షలు సేవ్ అవుతాయి. అదే ఈఎంఐ కాకుండా టెన్యూర్ తగ్గించారనుకోండి. అంటే నెల నెలా రూ.25,000తో 15 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలకు తగ్గించుకుంటే (25,000×10 సంవత్సరాలు=30,00,000)రూ.10 లక్షలు సేవ్ అవుతాయి. అందువల్ల ఇతర మార్గాల ద్వారా డబ్బులు వచ్చినప్పుడు సాధ్యమైనంత వరకు టెన్యూర్ ను తగ్గించుకునే ప్రయత్నం చేయండి.. ఇలా చేయడం వల్ల చాలా వరకు డబ్బులు సేఫ్ అవుతాయి.