Vasthu Tips
Vasthu Tips : ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని అందరూ కోరుకుంటారు. ముఖ్యంగా హిందూ సంప్రదాయాలు కొన్నింటిని పాటిస్తుంటారు. ఇంటికి కొన్ని వస్తువులు తీసుకొస్తే మంచి జరుగుతుందని, కొన్నింటిని తీసుకురావడం వల్ల అశుభం జరుగుందని నమ్ముతుంటారు. కొందరి ఇంట్లో ఎల్లప్పుడూ సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి వారు ఇతరులు ఎవరైనా ఇలా చెబితే వింటారు. హిందూ సంప్రదాయం ప్రకారం ఇలాంటివి ఎక్కువగా పాటిస్తుంటారు. చాలా మంది ఇలాంటివి నమ్ముతారు. ఇలా మన హిందువులు చాలా విషయాలనే నమ్ముతుంటారు. ఇంట్లో ఎలాంటి శారీరక, ఆర్థిక సమస్యలు రాకుండా కుటుంబం సంతోషంగా ఉండాలంటే తప్పకుండా వాస్తు నియమాలు పాటిస్తుంటారు. ఈ క్రమంలో కొందరు ఇంటిని కూడా వాస్తు శాస్త్రం ప్రకారమే నిర్మించుకుంటారు. వాస్తు శాస్త్రం కరెక్ట్‌గా ఉంటే అన్ని పనులు కూడా సక్రమంగా అవుతాయని ఇంట్లో డబ్బు ఉంటుందని నమ్ముతారు. అయితే వాస్తుశాస్త్రం ప్రకారం కొన్ని రకాల జంతువులను ఇంటికి తీసుకొస్తే అంతా మంచే జరుగుతుందని, ఇంట్లో డబ్బు ఉంటుందని పండితులు అంటున్నారు. మరి ఇంట్లో ఉంచాల్సిన ఆ జీవులు ఏంటో చూద్దాం.
కుందేలు
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో కుందేలు పెట్టడం వల్ల అంతా మంచే జరుగుతుందని పండితులు అంటున్నారు. కొందరు కుందేలును అదృష్టంగా భావిస్తారు. కుందేలు ఇంటికి రావడం వల్ల శుభానికి సంకేతంగా ఫీల్ అవుతారు. అందుకే చాలా మంది ఇంట్లో తెల్ల కుందేలును పెంచుతుంటారు. ఇంట్లో ఎల్లప్పుడూ సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. ప్రతీ విషయంలోనూ అనుకూలంగా ఉంటుందని పండితులు అంటున్నారు. అలాగే ఆర్థిక సమస్యలు అన్ని కూడా క్లియర్ అవుతాయని పండితులు చెబుతున్నారు.
చేపలు
ఇంట్లో చేపలు ఉండటాన్ని చాలా మంది శుభ సూచికంగా భావిస్తారు. అందుకే ఇంట్లో చాలా మంది ఎక్వేరియం పెట్టుకుంటారు. ఇంట్లో చేపల వల్ల సుఖసంతోషాలు ఉంటాయని అంటుంటారు. ఎలాంటి గొడవలు లేకుండా ఆనందం, శాంతి అన్ని ఉంటాయని నమ్ముతారు. సంపదకు చిహ్నంగా చేపలను చూస్తారు. ఇవి ఇంట్లో ఉంటే డబ్బు ఉంటుందని చాలా మంది నమ్ముతారు. ఈ కారణాల వల్లే చాలా మంది వారి ఇంట్లో ఎక్వేరియం పెట్టుకుంటారు. చిన్న లేదా పెద్దది అయిన కూడా తప్పకుండా ఇంట్లో ఎక్వేరియం పెట్టుకుంటారు.
తాబేలు
ఇంట్లో తాబేలు ఉంచుకుంటే శుభప్రదమని పండితులు అంటున్నారు. ఇంటి ద్వారం దగ్గర తాబేలు ఉంటే ఆర్థిక సమస్యలు అన్ని కూడా క్లియర్ అవుతాయి. తాబేలును ఇంట్లో ఉంచడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. దీంతో ఎప్పుడూ కూడా మీకు డబ్బుకు లోటు ఉండదు. ఇంటికి అకస్మాత్తుగా తాబేలు వస్తే మీ ఇంటికి ఊహించని ఆర్థిక లాభం వస్తుందని పండితులు అంటున్నారు. అందుకే చాలా స్టోర్‌లు, బట్టలు షాపుల్లో తాబేలు బొమ్మను పెట్టుకుంటారు. మరికొందరు ఇంట్లోనే తాబేలును పెంచుకుంటారు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలన్నీ కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. సూచనలు, సలహాల కోసం పండితులను సంప్రదించగలరు.