T20 World Cup 2022- India: టి20 మెన్స్ వరల్డ్ కప్ సిరీస్ లో భారత జట్టు గ్రూప్2 లో అగ్రస్థానంలో కొనసాగుతోంది. జింబాబ్వేతో ఆదివారం జరిగే మ్యాచ్లో గెలిస్తే నేరుగా సెమిస్లోకి వెళ్తుంది. ఇప్పటికే న్యూజిలాండ్ గ్రూప్1 జాబితాలో సెమీస్ బెర్త్ ఖాయం చేసుకుంది. సరే ఇవన్నీ పక్కన పెడితే ఈ సిరీస్ లో టీం ఇండియా అంచనాలకు మేరకు రాణించలేకపోతోంది అనేది స్పష్టమవుతోంది.. ఇప్పటివరకు గెలిచిన మ్యాచ్ ల్లో ఒక నెదర్లాండ్స్ తో మినహాయిస్తే అన్నింట్లోనూ విరాట్ కోహ్లీ ఆర్థిక శతకాలు భాగాలు. వచ్చిన ఆటగాళ్లు వచ్చినట్టే వెళ్తుంటే కడదాకా క్రీజ్ లో నిలబడి జట్టును గెలిపించాడు. ఉత్కంఠ భరితంగా జరిగిన మ్యాచ్ ల్లో భారత్ విజయం సాధించింది అంటే దానికి కారణం కోహ్లీనే. అయితే ఈ మ్యాచ్ల్లో భారత్ ఆద్యంతం పట్టు చూపించలేదని అర్థమవుతుంది.

భారత జట్టు టి20 ప్రపంచ కప్ సాధించేందుకు ఇంకా మూడు మ్యాచ్ ల దూరంలో ఉంది.. ఇండియా ఆటగాళ్ల ఘనమైన రికార్డులతో జట్టు పేపర్ పై బలంగానే కనిపిస్తోంది. కానీ ఇప్పటివరకు జరిగిన నాలుగు మ్యాచ్లో ఒక్క నెదర్లాండ్స్ మినహా భారత్ రెండు మ్యాచ్లను చివరి నిమిషంలో గెలుచుకుంది. బలమైన సౌత్ ఆఫ్రికా జట్టుపై తేలిపోయింది. ఛాంపియన్ స్థాయిలో మ్యాచ్ ఫలితాలను నియంత్రించే స్థాయిలో భారత జట్టు ప్రదర్శన చేయడం లేదని చెప్పాలి. ఇక ఇప్పటివరకు పవర్ ప్లే లో 50 కి మించి పరుగులు చేయలేకపోయింది.. ది ముమ్మాటికి బ్యాట్స్మెన్ నిర్లక్ష్యమనే చెప్పాలి. పాకిస్తాన్ పై 33, నెదర్లాండ్స్ ప్రైమ్ 32, దక్షిణాఫ్రికా పై 33, బంగ్లాదేశ్ పై 37 పరుగులు మాత్రమే చేసింది.. ఫీల్డింగ్ నిబంధనలు వినియోగించుకుని భారీ షాట్లతో స్కోరుబోర్డును 10 రన్ రేట్తో పరుగులు పెట్టించాల్సిన సమయంలో రక్షణాత్మక వైఖరితో భారత్ ఆడుతోంది. టి20 లో మ్యాచ్ గమనం వేగంగా మారిపోతూ ఉంటుంది. ఇలాంటి సమయంలో భారత్ భారీ షాట్లు కొట్టే అవకాశాలను చేజేతులా వదులుకుంటుంది.
ఇలా వచ్చి అలా వెళ్తున్నారు
ఇక ఈ సిరీస్ లో భారత జట్టును వేధిస్తున్న ప్రధాన సమస్య ఓపెనింగ్.. రాహుల్, రోహిత్ ద్వయం ఇంతవరకు చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. ఈ జోడి ఇప్పటివరకు ఒక అర్థ శతక భాగస్వామ్యాన్ని కూడా నెలకొల్పలేదు. రోహిత్ వ్యక్తిగతంగా నెదర్లాండ్స్ పై అర్థ శతకం బాదాడు.. రాహుల్ బంగ్లాదేశ్ పై 50 పరుగులు సాధించాడు. ఈ జోడి పాకిస్తాన్ పై 7, నెదర్లాండ్స్ పై 11, దక్షిణాఫ్రికా పై 23, బంగ్లాదేశ్ పై 11 పరుగుల భాగస్వామ్యాలు మాత్రమే నెలకొల్పింది. టి20 క్రికెట్లో ప్రధాన శత్రువు ఒత్తిడి. ఒత్తిడికి గురైతే బ్యాట్స్మెన్ నిలకడ కోల్పోతాడు. ఫలితంగా పెవీలియన్ చేరుతాడు. ఇక మొన్న బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో ఆ దేశ క్రీడాకారుడు లిటన్ దాస్ వీర విహారం చేశాడు. అలాంటి దూకుడు భారత జట్టు ఓపెనర్లు చూపించలేకపోతున్నారు. పాతిక పరుగులు పూర్తి కాకుండానే పెవిలియన్ చేరుకోవడం మిగతా ఆటగాళ్లపై ప్రభావం చూపిస్తోంది.. ఓపెనర్లు నిలకడగా ఆడితేనే మిడిల్ ఆర్డర్ స్వేచ్ఛగా ఆడే అవకాశం లభిస్తుందని పలువురు మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.. బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో రాహుల్ పుంజుకున్నట్టు కనిపించడంతో టీం ఇండియాకు కొంతమేర ఉపశమనం లభించింది..
పేక మేడను తలపిస్తోంది
అత మిడిల్ ఆర్డర్లో సూర్య, హార్దిక్ మినహా 30 పరుగులు దాటి స్కోర్ చేసిన బ్యాటర్ లేడు.. అక్షర్ పటేల్ (2,7), దినేష్ కార్తీక్ (1,6,7), హుడా (0) ఈ టోర్నీలో ఒక ఇన్నింగ్స్ లో కూడా పది పరుగులు చేయలేదంటే వారి ఆట తీరు ఎంత అధ్వానంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.. హార్దిక్ కూడా పాకిస్తాన్ పై చేసిన 40 పరుగుల కీలక ఇన్నించిన మిగిలిన మ్యాచ్ల్లో బ్యాట్స్మెన్ గా పెద్దగా ప్రభావం చూపలేదు.. దక్షిణాఫ్రికా పై రెండు, బంగ్లాదేశ్ పై ఐదు పరుగులు మాత్రమే చేశాడు. ఇక పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ పై సూర్యకుమార్ యాదవ్ చెప్పుకోదగ్గ ఆట తీరు కనబరిచాడు.
మెరిపించలేకపోతున్నారు
భారత బౌలర్లో ఆర్ష్ దీప్ సింగ్ నిలకడగా వికెట్లు సాధిస్తున్నాడు. ఈ టోరిలో టాప్ బౌలర్ గా నిలిచాడు. మిడిల్ ఓవర్లో పాండ్యా కూడా వికెట్లు సాధిస్తూ మ్యాచ్ ఫలితాలను శాసించాడు.. పాకిస్తాన్ పై తొలి మ్యాచ్లో అక్షర్, అశ్విన్ 4 ఓవర్లు వేసి 44 పరుగులు ఇచ్చి ఒక వికెట్ కూడా తీయలేదు.. ఈ జోడి నెదర్లాండ్స్ పై నాలుగు వికెట్లు సాధించింది.. దక్షిణాఫ్రికా పై అశ్విన్ 10.80 ఎకానమీ తో 43 పరుగులు ఇచ్చి ఒక వికెట్ సాధించాడు.

ఇక బంగ్లాదేశ్ మ్యాచ్ లో మూడు ఓవర్లకు 25 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు.. మిడిల్ ఓవర్లలో ఫీల్డింగ్ నిబంధనలు ఉండవు.. అటువంటి సమయంలో అశ్విన్ పరుగులు ఇవ్వడం ఆందోళనకరంగా మారింది.. ఆస్ట్రేలియాలో పెర్త్, మెల్బోర్న్ వంటి మైదానాలు బ్యాటర్లను కుదురుకొనివ్వవు. అటువంటిచోట్ల నాలుగో సీమర్ తో బరిలోకి దిగితే ప్రయోజనకరంగా ఉంటుంది. ముగ్గురు సీమర్లతో భారత జట్టుపై ఆడిన పాకిస్తాన్ ఓడిపోయింది.. ఇది సమయంలో దక్షిణాఫ్రికా పై నలుగురు సీమర్లతో దిగి విజయం సాధించింది. దీని ఆధారంగా ఆస్ట్రేలియాలో సీమర్లకు ఎంత ప్రాధాన్యత ఉందో అర్థం చేసుకోవచ్చు. చాహల్ ను రిజర్వ్ బెంచికే పరిమితం చేయకుండా అవకాశాలు ఇవ్వాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.. ఇక టి20 ఫార్మేట్ లో ఒకే ఓవర్ లో రెండు వికెట్లు పడిపోయినా లేదా రెండు సిక్సర్లు కొట్టినా మ్యాచ్ ఫలితమే మారిపోతుంది.. బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో దాస్ రన్ అవుట్ ఇందుకు మంచి ఉదాహరణ.. ఒత్తిడిలో జట్టు రాణించడం మంచిదే. కానీ జట్టు ఒత్తిడికి గురయ్యే దాకా తెచ్చుకోకపోవడం చాలా మంచిది. ఇప్పటివరకు ఆడిన మ్యాచుల్లో ఒక్క నెదర్లాండ్స్ మినహా… ఏ జట్టు పై కూడా భారత్ పూర్తి స్థాయిలో పట్టు బిగించలేదు. ఇకనుంచి ఆడే మూడు మ్యాచ్ల్లో చేయాల్సింది అదే. అది చేస్తేనే 2011 పునరావృతం అవుతుంది.