Alcohol Effect: ఈ లక్షణాలు కనిపిస్తే మద్యం మానేయండి.. !

మద్యం రోగ నిరోధక శక్తిని దెబ్బతీస్తుంది. దీంతో చిన్నచిన్న వాటికే అనారోగ్యానికి గురవుతారు. పలు ప్రమాదకరమైన సమస్యలు వచ్చే అవకాశాలు పెరుగతాయి.

Written By: Raj Shekar, Updated On : February 4, 2024 9:30 am

Alcohol Effect

Follow us on

Alcohol Effect: మద్యపాన.. ఈ రోజుల్లో కామన్‌ అయిపోయింది. బాధ కలిగినా.. సంతోషం వచ్చినా.. ఫ్రెండ్స్‌ వచ్చినా.. బంధువులు వచ్చినా.. బోర్‌ కొట్టినా.. పెగ్గేయడం సాధారణం అయింది. కొందరు నిత్యం కొద్ది మొత్తంలో మద్యం తాగితే… మరికొందరు మాత్రం పీపాలకు పీపాలు తాగేస్తున్నారు. మద్యం ఆరోగ్యానికి హానికరమని వైద్యులు హెచ్చరిస్తున్నా మానేయడం లేదు. పలు అధ్యయనాల్లో మద్యంతో చాలా సమస్యలు వస్తాయని వ్లెడైంది. అయినా చాలా మంది మద్యం మానడం లేదు. అయితే మద్యం తాగేవారిలో ఈ లక్షణాలు కనిపిస్తే మాత్రం వెంటనే మానేయాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం.

– తెల్లవారుజామున నిద్రలేవగానే మగతగా, నీరసంగా ఉంటే మద్యం మానేయడం మంచిది.

– మద్యం రోగ నిరోధక శక్తిని దెబ్బతీస్తుంది. దీంతో చిన్నచిన్న వాటికే అనారోగ్యానికి గురవుతారు. పలు ప్రమాదకరమైన సమస్యలు వచ్చే అవకాశాలు పెరుగతాయి.

– దగ్గు, కడుపులో ఉబ్బరంగా ఉంటే మద్యమే కారణమని గుర్తించాలి.

– దంతాలు, చిగుళ్లసమస్యలు ఏర్పడితే అది మద్యం వల్లనే కావొచ్చు. డాక్టర్లను సంప్రదించాలి. వాళ్ల సూచనలు పాటించాలి.