
Zodiac Signs: మన జాతకంలో రాహువు ప్రభావం ఎంతో ఉంటుంది. మనకు రాహువు అశుభ స్థానంలో ఉంటే ప్రతికూల ప్రభావాలు కనిపిస్తాయి. మనం అనుకున్న పనులు వాయిదా పడటమో లేక ఆగిపోవడమో జరుగుతుంది. సమస్యలు చుట్టుముట్టి ఇబ్బందులు పెడతాయి. రాహువును అపవిత్ర గ్రహంగా భావిస్తారు. జూదం, కోపం, చర్మవ్యాధులు, చెడు పనులు, దొంగతనాలు వంటివి వాటికి కారణంగా నిలుస్తుంది. ఏ వ్యక్తి జాతకంలో అయినా రాహువు అశుభ స్థానంలో ఉంటే పనులు మందకొడిగ సాగుతాయి. పనులు ఆగిపోవడమో లేక వాయిదా పడటమో అవుతుంటాయి. సమస్యల సుడి గుండంలో ఉన్న ఫీలింగ్ కలుగుతుంది.
మూడు రాశులకు..
రాహువు దాదాపు 18 నెలల తరువాత తన స్థానాన్ని మార్చుకుంటున్నాడు. దీని ప్రభావం మూడు రాశులపై పడుతుంది. దీంతో వారు జాగ్రత్తగా ఉండాల్సిందే. దీని ప్రభావం అన్ని రాశులపై ఉంటున్నా మూడు రాశులకు మాత్రం ఇబ్బందులే కలిగిస్తుంది. అక్టోబర్ 30న రాహువు మేష రాశిలోకి ప్రవేశించనున్నాడు. దీంతో మూడు రాశులకు గడ్డు కాలమే కానుంది. జీవితంలో ప్రశాంతత కరువు అవుతుంది. దీంతో ఈ మూడు రాశులు వివాదాలకు దూరంగా ఉండటమే శ్రేయస్కరం.
మేష రాశి వారికి..
మేష రాశి వారికి చెడు రోజులు వస్తాయి. సమస్యలు పెరుగుతాయి. డబ్బు విషయంలో సమస్యలు చుట్టు ముడతాయి. వివాదాల్లో తల దూర్చడం అంత మంచిది కాదు. మానసిక ఒత్తిడికి గురవుతారు. రాహువు ప్రభావం వల్ల వృషభ రాశికి కూడా కష్టాలు పెరుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉంది. చేతిలో డబ్బులు నిలవవు. ఆలోచనా సామర్థ్యం దెబ్బతింటుంది. గౌరవం అందకుండా పోతుంది. డబ్బు ఖర్చు విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. విచ్చలవిడిగా ఖర్చు చేస్తే తరువాత ఆలోచించాల్సి వస్తుంది.

వృత్తి, వ్యాపారాల్లో ఆటంకాలు
రాహువు రాశి మారడం వల్ల మకర రాశి వారికి కూడా ఇబ్బందులేర్పడతాయి. ఏ పనిచేయాలన్నా చేయబుద్ధి కాదు. మీరు చేసే ఉద్యోగంలో, కార్యాలయంలో చెడు అభిప్రాయాలు పెరుగుతాయి. చేస్తున్న వ్యాపారంలో లాభాలకంటే నష్టాలే ఎక్కువగా వస్తాయి. ఇంట్లో వారికి వ్యాధులు ప్రబలే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మూడు రాశుల వారు ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఇలా రాహువు ప్రభావం వల్ల మనకు కలిగే బాధల నుంచి విముక్తం కావాలంటే మనం అప్రమత్తంగా ఉండటమే శ్రేయస్కరం.