Relationship: ఇలాంటి వారు మీ లైఫ్ లో ఉంటే వదిలివేయడమే బెటర్..

కొందరు రోజు గొడవ పడతారు. కానీ అందులో ప్రేమ ఉంటుంది. ఇలా ప్రేమగా ఉండే వారి గురించి టెన్షన్ ఉండదు. కానీ శారీరక, మానసిక హింస చేస్తూ కొన్ని సార్లు దూరం అవుతారు.

Written By: Swathi Chilukuri, Updated On : April 13, 2024 6:04 pm

Relationship

Follow us on

Relationship: ప్రేమ అంటే చాలా గొప్పది. దీని గురించి వివరించడానికి ఏ కవికి కూడా సాధ్యం కాదు. కానీ కొన్ని బంధాలు ఇప్పుడు మరీ విషపూరితంగా మారుతున్నాయి. ప్రేమ, నమ్మకం, ఆప్యాయతలు లేని బంధం తో కష్టంగా గడపడం కంటే విడిపోయి సంతోషంగా ఉండటం మంచిది కదా. బంధం అంటే స్వచ్ఛంగా ఉండాలి. ఏ బంధం బాగుండాలన్నా ఒకరిని ఒకరు అర్థం చేసుకోవాలి. కానీ కొన్ని బంధాలలో మోసం ఎక్కువగా ఉండటంతో మనశ్శాంతి కరువు అవుతుంది. అందుకే ఇలాంటి వారితో కలిసి ఉండటం కంటే విడిపోవటమే ఉత్తమం.

కొందరు రోజు గొడవ పడతారు. కానీ అందులో ప్రేమ ఉంటుంది. ఇలా ప్రేమగా ఉండే వారి గురించి టెన్షన్ ఉండదు. కానీ శారీరక, మానసిక హింస చేస్తూ కొన్ని సార్లు దూరం అవుతారు. కానీ తిరిగి మళ్ళీ మన లైఫ్ లోకి వస్తారు. కథ సేమ్ రిపీట్ అవుతుంటుంది. ఇలాంటి రిలేషన్ లు చాలా ప్రమాదకరమైనవి. సంతోషంగా ఉండనివ్వరు. ఆనందంగా గడపనివ్వరు. అందుకే ఇలాంటి వారు మీ లైఫ్ లో ఉంటే వదిలివేయండి. ఎన్ని కష్టాలు ఉన్న కలిసి మెలిసి ఉండాలి కానీ విడిపోవడం, కలవడం, మళ్లీ విడిపోవడం అంటే ఆలోచించాల్సిందే.

ప్రేమ కోసం ఆస్తులు, హోదాను త్యాగం చేస్తారు. మీరు కూడా అలా త్యాగం చేసినా లాభం లేకపోతే వారికి దూరంగా ఉండటమే మంచిది. ఒక వ్యక్తి కోసం ఎన్ని త్యాగాలు చేసినా వారి నుంచి గౌరవం, ప్రేమ లేకపోతే త్యాగానికి అర్థం ఉండదు. కాబట్టి లైట్ తీసుకోవడం బెటర్. మీ ఆలోచనల్లో బ్రేకప్ అని పదే పదే అనిపిస్తే కూడా వారిని లైట్ తీసుకోండి. ఇలా మీకు ఆలోచనలు వస్తే తను మీకు దగ్గర కాలేదని.. రిలేషన్ సరైనది కాదని అర్థం. మీరు ప్రేమిస్తున్న వ్యక్తి ఒక తప్పు చేసి క్షమించమని అడిగి, మళ్లీ అదే తప్పును రిపీట్ చేస్తే వారిని కూడా వదిలిపెట్టండి అంటారు నిపుణులు.

ప్రేమిస్తే భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. కానీ మీరు ప్రేమించే వ్యక్తికి ఎలాంటి ప్రణాళికలు లేకపోతే వారి గురించి ఆలోచించడం మానేయండి. మీతో భవిష్యత్తు గురించి ఆలోచించడం లేదంటే మిమ్మల్ని మోసం చేసే అవకాశం కూడా ఎక్కువే ఉంటుంది. మీ వృత్తిని ఇష్టపడకపోతే కూడా వారి గురించి ఆలోచించాల్సిందే. లేదంటే లైఫ్ లో చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే అన్ని విషయాల గురించి ఆలోచించి అడుగులు వేయండి.