Torn Currency Notes: బ్యాంకులో చినిగిన నోట్లు తీసుకోవడం లేదా? అయితే ఇలా చేయండి..

ప్రతి ఒక్క వినియోగదారుడు చిరిగిన నోట్లు బ్యాంకులో మార్పిడి చేసుకోవచ్చు. అయితే వాటికి కొన్ని నిబంధనలు ఉంటాయి. ఒక నోటు చివరకు డ్యామేజ్ అయి 80 శాతం బాగుంటే దానికి 100 శాతం కొత్త నోటు ఇస్తారు.

Written By: Chai Muchhata, Updated On : December 18, 2023 10:33 am
Follow us on

Torn Currency Notes: నగదు మార్పిడి ప్రక్రియలో ప్రతి ఒక్కరూ పాల్గొంటారు. కొన్ని అవసరాల నిమిత్తం వ్యక్తులు తమ దగ్గర ఉన్న నోట్లు కిరాణం షాపుల్లో లేదా ఇతర వస్తువులు కొనుగోలుకు ఉపయోగిస్తూ ఉంటారు. ఇలా కోట్ల మంది చేతులు మారే నోట్లు ఎక్కడో ఒక చోట డ్యామేజ్ అవుతూ ఉంటాయి. కొందరు ఈ డ్యామేజీని పెద్దగా పట్టించుకోకుండా తీసుకుంటారు. ఆ తరువాత తాము నష్టపోయామని ఫీలవుతూ ఉంటారు. ఇలా డ్యామేజ్ అయిన నోట్లు చిన్నవి అయితే పర్వాలేదు. కానీ పెద్ద నోట్లు అయితే ఇబ్బందిగా ఉంటుంది. అయితే ఇలా చిరిగిన నోట్లను బ్యాంకులో మార్పిడి చేసుకోవచ్చు. అయితే కొన్ని నిబంధనలు ఉంటాయి. అయినా కొన్ని బ్యాంకులు చిరిగిన నోట్లు తీసుకోరు. ఈ తరుణంలో ఏం చేయాలో తెలుసా?

ప్రతి ఒక్క వినియోగదారుడు చిరిగిన నోట్లు బ్యాంకులో మార్పిడి చేసుకోవచ్చు. అయితే వాటికి కొన్ని నిబంధనలు ఉంటాయి. ఒక నోటు చివరకు డ్యామేజ్ అయి 80 శాతం బాగుంటే దానికి 100 శాతం కొత్త నోటు ఇస్తారు. అలా కాని పక్షంలో నోటు మధ్యలో చిరిగి రెండు ముక్కలు అయితే దానికి 50 శాతం మాత్రమే నగదు ఇస్తారు. అంటే ఉదాహరణకు ఒక వంద రూపాయల నోటు మధ్యలో చినిగితే దానికి రూ.50 మాత్రమే ఇస్తారు. ఇక నోటుపై మతపరమైన రాతలు, పిచ్చి పిచ్చి కామెంట్లు ఉంటే అలాంటి నోట్లకు ఎట్టి పరిస్థితుల్లో మార్పిడి చేయరు.

అయితే వినియోగదారుల వద్ద కేవలం 20 శాతం మాత్రమే డ్యామేజ్ అయిన నోట్లు ఉన్నా.. వాటిని బ్యాంకులు మార్పిడి చేయకపోతే దానికో మార్గం ఉంది. బ్యాంకు వాళ్లు నోట్లు మార్పిడి చేయకపోతే అంబుడ్స్ మెన్ లో ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. అయినా వినకపోతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకు నుంచి రూ.10 వేల వరకు ఫైన్ కట్టిస్తుంది. అందువల్ల మీ వద్ద ఎటువంటి చినిగిని నోటు ఉన్నా.. దానిని బ్యాంకులో మార్చుకోవచ్చు. అయితే నిబంధనల ప్రకారమే మార్చుకోవడానికి వీలుంటుంది.