Hyundai I20 Vs Baleno: హ్యుందాయ్ ఐ20 వర్సెస్ బాలెనో… రెండింటిలో ఏది బెస్ట్?

ఇండియన్ మార్కెట్లో హ్యుందాయ్ దూసుకుపోతుంది. తాజాగా ఈ కంపెనీ ఐ20ని వినియోగదారుల ముందు ఉంచింది. ఐ 20 ఫేస్ లిఫ్ట్ లో స్కల్ఫ్ టెడ్ బానెట్, ఇంటి గ్రేటెడ్ డీఆర్ఎల్స్ ను కలిగి ఉంది.

Written By: Chai Muchhata, Updated On : September 11, 2023 8:08 am

Hyundai I20 Vs Baleno

Follow us on

Hyundai I20 Vs Baleno: కార్ల వినియోగదారులు రోజురోజుకు పెరిగిపోతున్నారు. దీంతో కంపెనీలు కొత్త కొత్త ఉత్పత్తులు చేపడుతూ మార్కెట్లోకి విడుదల చేస్తుున్నారు. ఒకదానితో పోటీ పడి మరొకటి అప్డేట్ పీచర్స్ తో వచ్చి ఆకట్టుకుంటున్నారు. తాజాగా హ్యుందాయ్ కంపెనీ ఐ20ని లాంచ్ చేసింది. ఇది మారుతి బాలెనోతో పోటీ పడుతోంది. ఫీచర్స్ తో పాటు ధర విషయంలోనూ వినియోగదారులను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. దీంతో ఈ రెండు కార్ల గురించి కార్ల వినియోగదారులు తెగ సెర్చ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండు కార్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

ఇండియన్ మార్కెట్లో హ్యుందాయ్ దూసుకుపోతుంది. తాజాగా ఈ కంపెనీ ఐ20ని వినియోగదారుల ముందు ఉంచింది. ఐ 20 ఫేస్ లిఫ్ట్ లో స్కల్ఫ్ టెడ్ బానెట్, ఇంటి గ్రేటెడ్ డీఆర్ఎల్స్ ను కలిగి ఉంది. ఎల్ ఈడీ లైట్లు, 16 అంగుళాల డిజైనర్ అలాయ్ వీల్స్ ఉన్నాయి. వీటికి సిల్వర్ ప్లేట్స్ తో కూడిన రివైజ్డ్ బంపర్స్ ను అమర్చారు.

ఇందులో 5 సీటర్ కేబిన్ లో సెమీ లెథరెట్ సీట్స్, యాంబియెంట్ లైటింగ్, 10.25 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ ప్యానెల్ ఉన్నాయి. వాయిస్ కంట్రోల్ ఎలక్ట్రికల్ సన్ రూప్ కలిగి ఉన్నాయి. ఈ మోడల్ లో 1.2 లీటర్ పెట్రోల్, 5 స్పీడ్ మ్యాన్యువల్ వేరింట్ ను కలిగి ఉంది. 87 హెచ్ పీ పవర్ ను ఉత్పత్తి చేస్తూ 115 ఎన్ఎం టార్క్ ను జనరేట్ చేస్తుంది. ఈ కారును ఎక్స్ షోరూం ధర రూ.6.99 లక్షల నుంచి రూ.11.1 లక్షల వరకు విక్రయిస్తున్నారు.

మారుతి బాలెనో 1.2 లీటర్ డ్యూయెల్ వీవీటీ, కే సీరిస్ పెట్రోల్ ఇంజిన్ కలిగి ఉంది. 89 హెచ్ పీ పవర్ తో 113 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. 5 స్పీడ్ మాన్యువల్, 5 స్పీడ్ ఏఎంటీ గేర్ బాక్స్ ఆప్షన్స్ ఉన్నాయి. 5 సీటర్ కేబినెట్ లో డ్యూయెల్ టోన్ డాష్ బోర్డు ఆర్కెమిస్ సౌండ్ సిస్టమ్, 9.0 అంగుళాల స్మార్ట్ ప్లే ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ను అమర్చారు. మారుతి బాలెనో ను ఎక్స్ షో రూం ధర రూ.6.61 లక్షల నుంచి రూ.9.88 లక్షల వరకు విక్రయిస్తున్నారు.

ఈ రెండు మోడళ్లలోని పీచర్లు దాదాపు సమానమే అయినా హ్యుందాయ్ ఐ 20లో వాయిస్ కంట్రోల్ ఎలక్ట్రికల్ సన్ రూప్ ఆకట్టుకుంటుంది. అలాగే ఇంటి గ్రేటేడ్ డీఆర్ఎల్ష్ తో పాటు 16 ఇంచెస్ అలాయ్ వీల్స్ ఉపయోగం అని అంటున్నారు. అయితే ధర మాత్రం బాలెనో కంటే ఐ 20 గరిష్ట ధర ఎక్కువగా పలుకుతోంది. వినియోగదారులు తమ అవసరాల మేరకు ఈ కార్లను ఎంచుకోవచ్చు.