https://oktelugu.com/

Vijaysai Reddy: అనవసరంగా మీడియాని కెలికిన విజయసాయి.. టీవీ ఛానల్ ఉంటే తప్పు ఒప్పు అవుతుందా?

జయసాయిరెడ్డి అనుమానం వ్యక్తం చేస్తూ మాట్లాడిన జర్నలిస్టులు ఇప్పుడు సవాల్ చేయడం ప్రారంభించారు. చూసుకుందాం అంటూ ఆయా ఛానల్ లో సవాల్ విసిరి .. ఇప్పుడు గొడవ గురించి కాకుండా విజయసాయి రెడ్డి చిట్టా మొత్తం విప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. విశాఖలో విజయ్ సాయి రెడ్డి చేసిన భూదందాలతో పాటు అన్ని అక్రమాలకు సంబంధించి ఆధారాలు తెప్పించుకుంటున్నారు. డిబేట్లు కొనసాగిస్తున్నారు.

Written By:
  • Dharma
  • , Updated On : July 16, 2024 / 06:25 PM IST

    Vijaysai Reddy

    Follow us on

    Vijaysai Reddy: రాజకీయంగా చాలా రకాల ఆరోపణలు వస్తుంటాయి.అయితే కొన్నింటికి మాత్రమే స్పందించాలి. కొన్నింటి విషయంలో చూసీచూడనట్లుగా వెళ్లాలి. లేదంటే తూతూ మంత్రంగా ఖండించాలి. అదే మంచి ఆప్షన్. అలాకాకుండా సై అంటే సై అంటూ మీడియా ముందుకు వెళ్లి సవాల్ చేస్తే.. ఆ సమస్య మరింత జఠిలం కావడం ఖాయం. మొదటికే మోసం వస్తుంది. వైసీపీ అగ్ర నేత విజయసాయిరెడ్డి విషయంలో కూడా ఇప్పుడు అలానే పరిస్థితి ఉంది. ఆయనపై ఇప్పటివరకు వచ్చినవి అవినీతి ఆరోపణలు. కానీ ఈసారి వచ్చింది ఆయన వ్యక్తిగత జీవితంపై. అందుకే దీనికి రాజకీయాలతో ముడిపెట్టి బయటపడాలనుకోవడం కుదరని పని. విజయసాయి రెడ్డి పై ఆరోపణలు చేసింది ఒక ప్రైవేటు వ్యక్తి. ఆయన ఏ రాజకీయ పార్టీకి చెందినవారు కాదు. పైగా బాధితుడు. తన భార్యకు పుట్టిన బిడ్డకు తాను తండ్రి కాదంటూ.. భార్య మాతృ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. విజయసాయి రెడ్డి పై అనుమానం మాత్రం వ్యక్తం చేశారు.

    లేటు వయసులో విజయసాయి రెడ్డి పై ఈ తరహా ఆరోపణలు రావడం ఆయన వ్యక్తిగత జీవితానికి ఇబ్బందికరమే. కానీ ఆరోపించింది ఒక భర్త అన్న విషయాన్ని గ్రహించుకోవాలి. ఆ విషయాన్ని మరిచిపోయి మీడియా మీద పడ్డారు విజయసాయిరెడ్డి. ఏకంగా ఇదే విషయంపై ప్రెస్ మీట్ పెట్టారు. మీడియాలో డిబేట్లు నిర్వహించిన జర్నలిస్టుల గురించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వాళ్లందరినీ ఒరేయ్ అంటూ సంబోధించడమే కాక.. మీ తండ్రులకు డీఎన్ఏ టెస్టులు చేయాలి.. నీ పుట్టుక మీద అనుమానాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యవహారం ఇప్పుడు పెనం మీద నుంచి పొయ్యి మీద పడినట్లు అయ్యింది.

    విజయసాయిరెడ్డి అనుమానం వ్యక్తం చేస్తూ మాట్లాడిన జర్నలిస్టులు ఇప్పుడు సవాల్ చేయడం ప్రారంభించారు. చూసుకుందాం అంటూ ఆయా ఛానల్ లో సవాల్ విసిరి .. ఇప్పుడు గొడవ గురించి కాకుండా విజయసాయి రెడ్డి చిట్టా మొత్తం విప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. విశాఖలో విజయ్ సాయి రెడ్డి చేసిన భూదందాలతో పాటు అన్ని అక్రమాలకు సంబంధించి ఆధారాలు తెప్పించుకుంటున్నారు. డిబేట్లు కొనసాగిస్తున్నారు. అదే సమయంలో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త మదన్ మోహన్ విజయసాయి రెడ్డికి సంబంధించి కీలక విషయాలను బయట పెడుతున్నారు. ఏకంగా ఆయనను టీవీ డిబేట్లకు ఆహ్వానిస్తున్నారు. చర్చలకు పిలుస్తున్నారు. శాంతికి సాయి రెడ్డి నాలుగు కోట్ల విల్లా కొనిచ్చిన విషయాన్ని ఆయన బయటపెట్టారు. అంతేకాకుండా విశాఖ ప్రేమ సమాజం భూముల వ్యవహారాన్ని తెర మీదకు తెచ్చారు. దీంతో సాయి రెడ్డి అక్రమాలపైనే రాష్ట్రవ్యాప్తంగా చర్చి నడుస్తోంది. జనాల అటెన్షన్ అంతా ఇప్పుడు సాయిరెడ్డి మీదే పడింది. కేవలం శాంతి వ్యవహారమే కాక భూ దందాలు, ఇతర అక్రమాల గురించి తెలుసుకుని ప్రజలు నూరెళ్లబెడుతున్నారు. సాయి రెడ్డి అనవసరంగా ప్రెస్ మీట్ పెట్టి మీడియా వాళ్లను రెచ్చగొట్టారని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.

    తనపై వచ్చిన ఆరోపణను నెమ్మదిగా నివృత్తి చేయాల్సింది పోయి లేనిపోని సమస్యలను తెచ్చుకున్నారు విజయసాయి. మీడియా వారికి హెచ్చరించే క్రమంలో.. తాను ఒక మీడియా ఛానల్ పెడతానని.. అందరి లెక్కలు తేల్చుతానని హెచ్చరికలు పంపారు. గతంలో ఇదే మాదిరిగా ఈనాడు రామోజీరావును హెచ్చరిస్తూ.. తాను మీడియా రంగంలోకి అడుగు పెడతానని వార్నింగ్ ఇచ్చారు. తరువాత దాని గురించి మరిచిపోయారు. ఇప్పుడు విజయసాయి పై వచ్చిన ఆరోపణలు మీడియా సృష్టి అన్నట్టు మాట్లాడారు. తాను మీడియా ఛానల్ ను పెడతానని హెచ్చరించడం ద్వారా వారిని కట్టడి చేసే ప్రయత్నం చేశారు. కానీ చేతిలో మీడియా ఉన్నా.. ఆరోపణలు వస్తే నివృత్తి చేయాల్సిన అవసరం తమపై ఉందన్న విషయాన్ని మరిచిపోయారు. అనవసరంగా మీడియా ని కెలికి తప్పు చేశారు. ఇప్పుడు మూల్యం చెల్లించుకుంటున్నారు.