Ravi Teja: రవితేజతో పాటు ఇండస్ట్రీకి వచ్చిన వీళ్లిద్దరూ ఎందుకు హీరోలు కాలేకపోయారంటే..?

ముగ్గురు ఒకేసారి సినిమా కెరియర్ ని స్టార్ట్ చేసినప్పటికీ రవితేజ కంటే ముందే వీళ్లకు సినిమాల్లో మంచి అవకాశాలు వచ్చాయి. అయినప్పటికీ వాటిని వాడుకోవడంలో వీళ్ళు చాలా వరకు ఫెయిల్ అయ్యారనే చెప్పాలి.

Written By: Gopi, Updated On : April 8, 2024 5:02 pm

Why these two who came to the industry along with Ravi Teja could not become heroes

Follow us on

Ravi Teja: సినిమా ఇండస్ట్రీలో తనదైన రీతిలో వరుస సినిమాలు చేస్తూ ‘మాస్ మహారాజా’ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న నటుడు రవితేజ.. ఈయన సోలోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు. ఇక ఈయనతో పాటు ఇండస్ట్రీ లోకి ఎంట్రీ చేసిన కొంతమంది నటులు హీరోలుగా సక్సెస్ కాలేక, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారిపోయారు. ఇక వాళ్ళు ఎవరు అంటే బ్రహ్మాజీ, రాజా రవీంద్ర…

ముగ్గురు ఒకేసారి సినిమా కెరియర్ ని స్టార్ట్ చేసినప్పటికీ రవితేజ కంటే ముందే వీళ్లకు సినిమాల్లో మంచి అవకాశాలు వచ్చాయి. అయినప్పటికీ వాటిని వాడుకోవడంలో వీళ్ళు చాలా వరకు ఫెయిల్ అయ్యారనే చెప్పాలి. ఇక బ్రహ్మాజీ మెయిన్ హీరోగా, రవితేజ సెకండ్ హీరోగా కృష్ణవంశీ డైరెక్షన్ లో చేసిన సింధూరం సినిమా మంచి విజయాన్ని సాధించింది. అయినప్పటికీ బ్రహ్మాజీకి హీరోగా సరైన గుర్తింపు అయితే రాలేదనే చెప్పాలి.

ఇక ఆ సినిమా తర్వాత చేసిన కొన్ని సినిమాలు ప్లాప్ అవ్వడం తో హీరోగా తనకు అవకాశాలు లేకుండా పోయాయి. దానివల్ల బ్రాహ్మజీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మిగిలిపోయాడు. కానీ రవితేజ మాత్రం ఒక్కొక్క స్టెప్ పైకి ఎక్కుతూ హీరోగా తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు. ఇక ప్రస్తుతం హరీష్ శంకర్ డైరెక్షన్ లో ‘మిస్టర్ బచ్చన్’ అనే సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమాతో తను సూపర్ డూపర్ సక్సెస్ అందుకొని హిట్ ట్రాక్ ఎక్కాలని భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ధమాకా సినిమా తర్వాత రవితేజకు సరైన సక్సెస్ అయితే లేదు.

ఆ సినిమా తర్వాత వచ్చిన మూడు సినిమాలు వరుస డిజాస్టర్లు అవ్వడంతో ఇప్పుడు ఈ సినిమా మీదనే ఆయన భారీ అంచనాలు పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక దీంతో పాటుగా జాతి రత్నాలు ఫేం అనుదీప్ తో ఒక సినిమా కమిట్ అయినట్టుగా తెలుస్తుంది. మరి వీళ్ళ కాంబినేషన్ లో సినిమా ఎప్పుడు సెట్స్ మీదికి వెళుతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది…