Relationship: హెల్దీ రిలేషన్ మెయింటెన్ చేయాలంటే అంటే చాలా గొప్ప మనసు ఉండాలి. ప్రస్తుతం చాలా రిలేషన్స్ అవసరాన్ని బట్టి మాత్రమే ఉంటున్నాయి. అవసరం తీరిన తర్వాత రిలేషన్ ను కాదనుకొని వెళ్లిపోతున్నారు. లేదంటే చీటింగ్, మోసం చేస్తుంటారు. అందుకే ఏ రిలేషన్ అయినా సరే విడిపోవడానికి ఎన్నో రోజులు పట్టడం లేదు. ఏ రిలేషన్‌షిప్ మొదలుపెట్టినా సరే ఒకరికొకరు నమ్మడం చాలా ముఖ్యం. ఆ విధంగా ముందుకెళ్తుండటం కూడా చాలా ముఖ్యం. కానీ, కొంతమంది పక్కదారులు పడుతూ ఉన్న రిలేషన్ ను నాశనం చేసుకుంటున్నారు.
ఎదుటి వారితో రిలేషన్ పెట్టుకొని ఉన్న రిలేషన్ ను పాడు చేసుకునే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. దీంతో పార్టనర్‌ని చీట్ చేయడం మొదలు పెడతారు. దీంతో చాలా సమస్యలు వస్తాయి. వారికి వారే శిక్ష అనుభవించే సమయం కూడా వస్తుంది. వీటన్నింటిని ముందుగానే గుర్తిస్తే ఇలాంటి సమస్య రాదు. మరి మీరు మీ పార్టనర్ ను మోసం చేయడం వల్ల కలిగే నష్టాలు ఏంటో ఓ సారి చూసేద్దామా?
మీరు ఏదైనా రిలేషన్‌ని అట్రాక్షన్‌తోనే మొదలుపెడుతుంటారు. కానీ, దీని వల్ల మీరు ప్రతిసారి గిల్టీగా ఫీల్ అవ్వాల్సి వస్తుంది. ఎఫైర్ పెట్టుకున్నవారితో టైమ్ గడిపినప్పుడల్లా ఏదో తప్పు చేస్తున్నారనే భావనం వెంటాడుతుంటుంది. కాబట్టి, అలాంటి టెన్షన్స్ కు దూరంగా ఉండటమే బెటర్ కదా. ఇదెలా ఉంటే చీటింగ్ చేశారని మీ పార్టనర్‌కి తెలిస్తే మీ మీద నమ్మకం ఉండదు. మీ రిలేషన్ కూడా కంటిన్యూ అవకపోవచ్చు. ఏ రిలేషన్ కోసం అయితే మీ రిలేషన్ పాడు చేసుకున్నారో? ఆ ర మనిషి కూడా మిమ్మల్ని వద్దు అనుకోవచ్చు. సో దిక్కు తోచని పక్షిలా మిగలాల్సి వస్తుంది.
చీటింగ్ అనేది మీ రిలేషన్‌లో కల్లోలం సృష్టించే పెద్ద భూతం. అప్పటివరకూ అందమైన ప్రయాణంలో సాగుతున్న మీ జర్నీ తలకిందులుగా మారి ఇబ్బంది పెడుతుంది. కాబట్టి, ఏ పని చేసినా జాగ్రత్త. ఇతరుల మత్తులో పడి మీ పార్టనర్‌ని మోసం చేస్తే దాని వల్ల మీరు గందరగోళాన్ని అనుభవించాల్సి వస్తుంది జాగ్రత్త. పార్టనర్‌పై కోపం, ఆందోళన, యాంగ్జైటీ, డిప్రెషన్, కన్ఫ్యూజన్ వంటి భావాలు మిమ్మల్ని చాలా ఇబ్బందికి గురి చేస్తాయి జాగ్రత్త.
ఇన్ని సమస్యలు ఫేస్ చేసే బదులు ముందునుంచే జాగ్రత్త పడటం అవసరం. అంటే మోసం చేయకుండా ఉండటం బెటర్ కదా. వేరేవారితో రిలేషన్ అనే ఆలోచన వచ్చినప్పుడు ఎందుకు ఆ ఆలోచన వస్తుందో మీకు మీరే క్వశ్చన్ చేసుకోని సమస్యను పరిష్కరించుకుంటే ఫ్యూచర్ కూడా బాగుంటుంది. మీ పార్టనర్‌తో సమస్య ఉంటే కూర్చుని మాట్లాడి పరిష్కరించుకోండి. ఏ సమస్య మిమ్మల్ని తప్పు దారి పట్టిస్తుందో ఆలోచించి మారండి. సమస్యని మీరు సాల్వ్ చేసుకోలేకపోతే కౌన్సెలింగ్ తీసుకోండి కానీ పక్కదారులు మాత్రం వద్దు. అంతేకానీ, అనవసరపు ఆరాటం చేయవద్దు. మీ పార్టనర్‌కి ఏ సమస్య వచ్చినా, బాధలున్నా దానికి మీరే కారణం అవుతారు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు..