Husband And Wife Relation: శృంగారం విషయంలో దేశంలో ఎన్నో రహస్యాలు ఉన్నాయి. అదే మన దేశంలో ఈ విషయంలో ఎన్నో అపోహలున్న సంగతి తెలిసిందే. దీని గురించి చర్చించడంలో మహిళలైతే వెనుకే ఉంటారు. కానీ పురుషులు కొన్ని సందర్భాల్లో బయటపడినా స్ర్తీలు మాత్రం సెక్స్ గురించి బహిరంగంగా చర్చించరనే విషయం మనకు విధితమే. వాత్సాయనుడు ఎన్నో విషయాలు కామసూత్రలో చెప్పారు. కానీ వాటిని బహిరంగంగా మాత్రం చర్చించే వెసులుబాటు కలగడం లేదు. దీంతోనే శృంగారం విషయంలో బయట చర్చించడం తప్పుగానే భావిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే భార్యాభర్తల మధ్య ఎన్నో మనస్పర్దలు వస్తున్నట్లు తెలిసిందే. దీనికి మన సమాజమే సంప్రదాయాల పేరుతో అడ్డుకట్ట వేస్తున్నాయనే తెలుస్తోంది.

శృంగారం విషయంలో భార్యాభర్తలకే ఆ అవకాశం ఉంటుంది. వారికి తమ ఇష్టాయిష్టాలు పంచుకునే వీలుంది. అందుకే పడక గదిలో ఆలుమగలు తమ కోరికల గురించి మనసు విప్పి మాట్లాడుకోవాలి. శృంగారం లో ఉన్న అపోహల్ని తొలగించుకోవాలి. మనసు విప్పి మాట్లాడుకోవాలి. అప్పుడే శృంగారాన్ని ఎంజాయ్ చేస్తారు. శృంగారానికి ముందే తమ అభిప్రాయాలు పంచుకుంటేనే అందులో ఎలాంటి పొరపాట్లు లేకుండా ఉంటాయని గుర్తంచుకోవాలి. సుఖం కోసం వారు చేయాల్సిన చర్యలపై చర్చించుకోవాలి.
Also Read: TS Planning Department: పేద నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. సబ్సిడీతో పోటీ పరీక్షల పుస్తకం
ఇష్టాలను పరస్పరం గౌరవించాలి. తమ జీవితభాగస్వామి కోరికలను ఎప్పుడు తీరుస్తుండాలి. ఈ విషయంలో ఆలుమగల మధ్య అపార్థాలకు తావుండరాదు. ఎలాంటి రహస్యాలు కూడా ఉండటం మంచిది కాదు. అందుకే మనసు విప్పి ప్రశాంతంగా మాట్లాడుకోవాలి. అప్పుడే మన సుఖం కోసం జీవితభాగస్వామిని మన వైపు తిప్పుకునే వీలుంటుంది దీని కోసం ఏవో త్యాగాలు చేయాల్సిన పని లేదు. ఒకరి ఇష్టాలను మరొకరు గౌరవిస్తూ ముందుకు పోవడమే.

శృంగారంలో చొరవ కూడా ప్రధానమే. జీవిత భాగస్వామి అనుకూలంగా లేకపోతే మూడ్ అవుటవుతుంది. అందుకే పడక గదిలో ఎప్పుడు పురుషుడే చొరవ చూపాల్సిన అవసరం లేదు. అప్పుడప్పుడు భార్య కూడా చొరవ చూపితేనే భర్తకు మంచి రొమాంటిక్ గా అనిపిస్తుంది. దీనికి ఇద్దరు పరస్పరం అంగీకారంతోనే పడక గది ఓ నందన వనంలా మారుతుంది. మనసు విప్పి మాట్లాడుకుంటేనే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. ఇందులో ఎలాంటి అనుమానం లేదు.
శృంగారానికి అందంతో పని లేదు. మనసుతోనే అవసరం. మనస్పూర్తిగా జీవితభాగస్వామితో మాట్లాడితే చాలు. ఇద్దరి మధ్య ఎలాంటి అపోహలకు తావు లేకుండా చూసుకుంటే సరిపోతుంది. అంతే కానీ నేను అందంగా లేను. సంసారానికి పనికి రాను అని పరస్పర విరుద్ధ భావాలతో మనసులో ఏవో భావాలు ఉంచుకుంటే శృంగారం ఫలప్రదంగా సాగదు. దీనికి కావాల్సినదల్లా ఇద్దరి మధ్య అరమరికలు లేని అవినాభావ సంబంధం. ఇద్దరు కలిసి మనసు విప్పి మాట్లాడుకుంటే ఏ రకమైన సమసస్యలు ఉండవని తెలుస్తోంది.
Also Read:Early Elections In Telangana: ముందస్తు మంత్రాంగం.. త్వరలో తెలంగాణ అసెంబ్లీ రద్దు!