కరోనా మహమ్మారి విజృంభణ వల్ల దేశంలో పరిస్థితులు ఊహించని విధంగా మారిపోయాయి. కరోనా వల్ల మరణ వీలునామాపై చాలామంది దృష్టి పెడుతున్నారు. తమపై ఆధారపడిన వాళ్లకు ఆస్తులను చట్టబద్ధంగా పంచడానికి వీలునామా ఎంతో అవసరం అనే సంగతి తెలిసిందే. ఆస్తులు, సంపదను చట్టబద్ధంగా బదిలీ చేయడానికి మరణానికి ముందు రాసే డాక్యుమెంట్ ను వీలునామా అంటారు.

వారసుల మధ్య ఎటువంటి వివాదాలు రాకుండా ఉండాలంటే టెస్టేటర్ వీలునామాను పక్కాగా రాసి ఉండాలి. డాక్యుమెంట్ లో ఆస్తికి సంబంధించిన అన్ని విషయాలను ఖచ్చితంగా ప్రస్తావించాల్సి ఉంటుంది. ఎవరైతే ఈ వీలునామాను రాస్తారో వారిని టెస్టేటర్ అని పిలుస్తారు. వీలునామా రాసే సమయంలో కొన్ని విషయాలను తప్పనిసరిగా గుర్తు పెట్టుకోవాలి. టెస్టేటర్ కు తెలిసిన భాషలోనే వీలునామాను రాయించాలి.
టెస్టేటర్ కు వీలునామా భాష అర్థం అయ్యే విధంగా ఉండాలి. వీలునామాలో టెస్టేటర్ ఇదే చివరి వీలునామా అనే విషయాన్ని తప్పనిసరిగా ప్రస్తావించాల్సి ఉంటుంది. తాజాగా రాసిన వీలునామాలో గత వీలునామాల గురించి కూడా తప్పనిసరిగా ప్రస్తావించాలి. టెస్టేటర్ తన కుటుంబ సభ్యులలో ఎవరికైనా వాటా ఇవ్వకూడదని అనుకుంటే వీలునామాలో ఆ వివరాలను సైతం తప్పనిసరిగా రాయాలి.
లబ్ధికారులు కాని వ్యక్తులు వీలునామాలో సాక్షి సంతకం చేయాల్సి ఉంటుంది. వీలునామాకు సంబంధించి సాక్షులకు ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. వీలునామాను అమలు చేయాలని అనుకుంటే లెటర్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ కొరకు కోర్టును ఆశ్రయించాల్సి ఉంటుంది.