https://oktelugu.com/

వైసీపీ ప్రభుత్వంపై ఫైట్ కు రెడీ అయిన పవన్ కళ్యాణ్

‘రిపబ్లిక్’ మూవీ ప్రీరిలీజ్ వేడుక సాక్షిగా అంటుకున్న మాటల మంటలు చల్లారడం లేదు. జనసేనాని పవన్ కళ్యాణ్ వర్సెస్ వైసీపీ సర్కార్ గా ఫైట్ యవ జోరుగా సాగుతోంది. ఇరు వర్గాలు ‘తగ్గేదేలే’ అన్నట్టుగా విమర్శలు చేసుకుంటున్నారు. ట్వీట్లు, ప్రెస్ మీట్లు పెట్టి విమర్శలతో కాకరేపుతున్నారు. పవన్ చేసిన విమర్శలపై ఏపీ మంత్రులు పేర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్, బొత్స సత్యనారాయణ, వెల్లంపల్లిలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇక నిన్న సినీ ఇండస్ట్రీకి చెందిన వైసీపీ […]

Written By:
  • NARESH
  • , Updated On : September 28, 2021 / 12:52 PM IST
    Follow us on

    ‘రిపబ్లిక్’ మూవీ ప్రీరిలీజ్ వేడుక సాక్షిగా అంటుకున్న మాటల మంటలు చల్లారడం లేదు. జనసేనాని పవన్ కళ్యాణ్ వర్సెస్ వైసీపీ సర్కార్ గా ఫైట్ యవ జోరుగా సాగుతోంది. ఇరు వర్గాలు ‘తగ్గేదేలే’ అన్నట్టుగా విమర్శలు చేసుకుంటున్నారు. ట్వీట్లు, ప్రెస్ మీట్లు పెట్టి విమర్శలతో కాకరేపుతున్నారు.

    పవన్ చేసిన విమర్శలపై ఏపీ మంత్రులు పేర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్, బొత్స సత్యనారాయణ, వెల్లంపల్లిలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇక నిన్న సినీ ఇండస్ట్రీకి చెందిన వైసీపీ సానుభూతి పరుడు నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి అయితే పవన్ ను వ్యక్తిగతం దూషించాడు. ఆయన పర్సనల్ విషయాలను ఎత్తిచూపాడు.

    దీనిపై పవన్ సైతం నిన్న రాత్రి ట్విట్టర్ లో గట్టిగా బదులిచ్చాడు. ‘మొరిగే కుక్కల’ వీడియోను పోస్టు చేసి ఒక కవితను షేర్ చేశాడు. వైసీపీ మద్దతు దారులను ‘మొరిగే కుక్కులు’గా పోల్చి గట్టి కౌంటర్ ఇచ్చాడు.‘‘‘హు లైక్ ద డాగ్ సౌండ్’ అనే పాపులర్ కుక్కలపై పాటను షేర్ చేశాడు. దీనికి ‘‘తుమ్మెదల ఝుంకారాలు.. నెమళ్ళ క్రేంకారాలు.. ఏనుగుల ఘీంకారాలు.. వైసీపీ గ్రామసింహాల గోంకారాలు.. సహజమే…’’ అంటూ క్యాప్షన్ పెట్టి వైసీపీ నేతల విమర్శలకు గట్టి కౌంటర్ ఇచ్చాడు.

    పవన్ కళ్యాణ్ ట్వీట్లకు తాజాగా మంత్రి పేర్ని నాని సైతం బదులిచ్చారు. పవన్ శైలిలోనే ఒక కవితను ట్వీట్ చేయడం గమనార్హం. ‘‘జనం ఛీత్కారాలు.. ఓటర్ల తిరస్కారాలు.. తమరి వైవాహిక సంస్కారాలు.. వరాహ సమానులకు న‘మస్కా’రాలు’ అని ట్వీట్ చేశారు. అనంతరం పవన్ కళ్యాణ్ పై ఓ ట్రోల్ వీడియోను పోస్ట్ చేశారు.

    వైసీపీ మద్దతుదారుల నుంచి విమర్శల వాన ఎక్కువ కావడంతో పవన్ కళ్యాణ్ ట్వీట్ల యుద్ధం మొదలుపెట్టారు. ‘వైసీపీది పాలసీ ఉగ్రవాదం.. దీంతో అన్ని రంగాలు నాశనమవుతాయి.. పాలసీ ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాల్సిన సమయం వచ్చింది’ అంటూ వైసీపీపై పోరుబాటకు పవన్ రెడీ అయ్యాడని తెలుస్తోంది. మరి వైసీపీపై ఫైట్ కు పవన్ ఎలా రెడీ అవుతాడు? ఏం చేస్తాడు? అన్నది ఆసక్తి రేపుతోంది.