How To Sleep Fast: మనిషి ప్రశాంతంగా ఉన్నారు అని చెప్పవచ్చో మీకు తెలుసా? తనకు మంచి నిద్ర, తినే ఆహారం సరిగ్గా జీర్ణం అవడం, టెన్షన్ ఫ్రీగా ఉంటే చాలు జీవితానికి. కానీ మనిషి ఇవన్నీ వదిలి అనవసరమైన ఆనందాల వైపు పరుగులు పెడుతున్నాడు. సరే అది ఇప్పుడు చెప్పినా ఎవరు వినరు కదా. అయితే మీకు మంచి నిద్ర పడుతుందా? మంచి నిద్ర అంటే బెడ్ మీదికి వెళ్లగానే ఇట్టే నిద్ర వచ్చేయాలి. వెళ్లిన రెండు మూడు గంటల తర్వాత లేదా తెల్లవారు జామున నిద్రలోకి జారుకోవడం కాదు అంటున్నారు నిపుణులు. అందుకే ఇప్పుడు మనం పడుకోగానే నిద్ర రావాలంటే ఏం చేయాలో తెలుసుకుందామా?
సరైన నిద్ర లేక చాలా మంది నిద్రమాత్రలు కూడా వేసుకుంటున్నారు. అయితే, నిద్రపోయే ముందు ఫోన్, లాప్, కంప్యూటర్ వంటి వాటికి కాస్త దూరం మెయింటెన్ చేయండి. చదవడం, తేలికపాటి వ్యాయామాలు చేయడం అలవాటు చేసుకోండి. మీ మైండ్ ను ప్రశాంతంగా ఉంచుకోండి అంటున్నారు వైద్యులు. నిద్రలేమి సమస్య చాలా ఆందోళన కలిగిస్తుంది. తరువాత క్రమంగా అది ప్రమాదకరమైన రూపాన్ని అందుకుంటుంది. అప్పుడు మరింత సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. వేర్వేరు వ్యక్తులకు వేర్వేరు విషయాలు పనిచేస్తాయి. కాబట్టి ఏది పనిచేస్తుందో తెలుసుకోవడానికి కొంత సమయం కేటాయించండి. ఆ తర్వాత దాన్ని పాటించండి.
సరైన నిద్ర కోసం కొన్ని దశలు ఉంటాయి. వాటిని అనుసరించండి.
దినచర్యను ఏర్పరచుకోండి: ప్రతి వ్యక్తి తన రోజంతా ఒక దినచర్యను ఏర్పరచుకోవాలి. అంటే, ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోయి మేల్కొనాలి. ప్రతి పని చేయడానికి సరైన సమయాన్ని పాటించండి.
పడుకునే ముందు స్క్రీన్‌లు: నిద్రవేళకు కొన్ని గంటల ముందు ఫోన్‌లు లేదా టాబ్లెట్‌లు వంటి బ్లూ లైట్ స్క్రీన్‌లను ఉపయోగించకుండా ఉండండి. ఎందుకంటే ఇది మీ నిద్రకు భంగం కలిగించే అవకాశం ఉంది. మీ దినచర్యకు కూడా అంతరాయం కలిగించవచ్చు.
Also Read: Healthy sleep plan : సరైన నిద్ర పోవాలంటే ఎలాంటి ప్లాన్ వేసుకోవాలి?
రాత్రిపూట భారీ ఆహారం తినడం లేదా తాగడం: నిద్రపోయే ముందు భారీ ఆహారం, మద్యం, కెఫిన్, పొగాకు తినకుండా ఉండండి. ఇది మీ ఆరోగ్యానికి చాలా హానికరం. ఇలాంటి వాటికి దూరంగా ఉంటే మీకు మంచి నిద్ర వస్తుంది.
పడుకునే ముందు విశ్రాంతి: స్నానం చేయడం, పుస్తకం చదవడం లేదా సంగీతం వినడం ప్రయత్నించండి. వీటి వల్ల మీ మూడ్ చాలా మెరుగు అవుతుంది. అప్పుడు నిద్ర కూడా ఇట్టే వచ్చేస్తుంది.
మీ పడకగదిని సౌకర్యవంతంగా చేసుకోండి: మీ మంచం సౌకర్యవంతంగా, కూల్ గా ఉండేలా చూసుకోండి. మీ గది చీకటిగా, నిశ్శబ్దంగా ఉండేలా చూసుకోండి. అప్పుడే మరింత ప్రశాంతమైన నిద్రలోకి జారుకుంటారు.
రోజూ వ్యాయామం చేయండి: రోజంతా చురుగ్గా ఉండటానికి, రోజూ వ్యాయామం చేయండి.
తీసుకోవాల్సిన ఆహారం: పడుకునే ముందు పిస్తా, ఓట్ మీల్, హెర్బల్ టీ లను తీసుకోండి. వీటి వల్ల మంచి ఫలితం ఉంటుంది.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాము. దీన్ని Oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.