Homeబిజినెస్UPI New Rules 2025: ఆగస్ట్ 1 నుంచి యూపీఐ కొత్త రూల్స్.. ఆ టైంలోనే...

UPI New Rules 2025: ఆగస్ట్ 1 నుంచి యూపీఐ కొత్త రూల్స్.. ఆ టైంలోనే చేయాలట

UPI New Rules 2025: ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక యూపీఐ యాప్ వాడుతూనే ఉన్నారు. పేటీఎం, ఫోన్ పే, జీ పే ఇతర యూపీఐ యాప్‌లు ప్రస్తుతం బాగా ప్రాచుర్యం పొందాయి. వచ్చే నెల ఆగస్టు 1, 2025 నుండి కొన్ని కొత్త యూపీఐ రూల్స్ అమలులోకి రాబోతున్నాయి. వీటిని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తీసుకొస్తోంది. దీని ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే, యూపీఐ సిస్టమ్‌పై ఒత్తిడిని తగ్గించి, పేమెంట్లు లేటవ్వడం, ఫెయిల్ అవ్వడం వంటి సమస్యలను తగ్గించడమే. డబ్బులు చెల్లించే విధానం మారకపోవచ్చు, కానీ ఇక మీదట బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం, పేమెంట్ స్టేటస్ చూడడం వంటి వాటిపై కొన్ని కొత్త లిమిట్స్ రాబోతున్నాయి. ఈ మార్పులతో యూపీఐ మరింత వేగంగా మారనుంది.

వచ్చే నెల నుండి, యూపీఐ వాడేవారు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆగస్ట్ 1 తర్వాత రోజుకు ఒకే యూపీఐ యాప్ నుండి 50 సార్లు మాత్రమే మీ అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేసుకోగలరు. మీరు వేర్వేరు యాప్‌లు వాడుతుంటే, ప్రతి యాప్‌లోనూ రోజుకు 50 సార్లు చెక్ చేసుకోవచ్చు. మీ ఫోన్ నంబర్‌కు లింక్ అయిన బ్యాంక్ అకౌంట్లను మీరు రోజుకు 25 సార్లు మాత్రమే చూడగలుగుతారు. ఈ లిమిట్స్ ఎందుకు పెడుతున్నారంటే చాలా మంది అనవసరంగా బ్యాలెన్స్ చెక్ చేయడం లేదా పేమెంట్ స్టేటస్‌ను పదేపదే చూసుకోవడం వల్ల సిస్టమ్‌పై లోడ్ పెరుగుతుంది. దీనివల్ల అప్పుడప్పుడు యూపీఐ నిలిచిపోతుంది. ఈ కొత్త రూల్స్ ఆ లోడ్‌ను తగ్గిస్తాయి.

Also Read: ఎయిర్ టెల్ యూజర్స్ కు ఇదో బంపర్ ఆఫర్

అలాగే యూపీఐ ఆటోపే ఫీచర్‌లో కొన్ని మార్పులు వస్తున్నాయి. ఇప్పుడు మీ ఆటోమేటిక్ పేమెంట్లు (నెలవారీ బిల్లులు, సబ్‌స్క్రిప్షన్లు, EMIలు) రోజంతా ఏ సమయంలో పడితే ఆ సమయంలో కాకుండా, నిర్దిష్ట సమయాల్లో మాత్రమే ప్రాసెస్ అవుతాయి. ఇది మీకు కనిపించని మార్పు అయినా, సిస్టమ్ రద్దీని తగ్గించి, సాధారణ సమయాల్లో పేమెంట్లు మరింత ఫాస్టుగా జరిగేలా చేస్తుంది. పీక్ అవర్స్ అంటే ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, సాయంత్రం 5 నుండి రాత్రి 9:30 వరకు ఆటోపే ట్రాన్సాక్షన్లు అమలు కావు. ఈ కొత్త రూల్స్ అందరి యూపీఐ వాడేవారికి వర్తిస్తాయి.

ఒకసారి పంపే గరిష్ట యూపీఐ పేమెంట్ లిమిట్ లో మాత్రం ఎటువంటి మార్పు లేదు. ఇదివరకటి లాగే, చాలా సందర్భాలలో ఒక ట్రాన్సాక్షన్‌కు రూ. లక్ష వరకు పంపవచ్చు. కొన్ని ప్రత్యేక విభాగాలకు, అంటే హాస్పిటల్స్, ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్, క్యాపిటల్ మార్కెట్స్, IPO అప్లికేషన్లు వంటి వాటికి రూ. 5 లక్షల వరకు పంపవచ్చు. బ్యాంకుల వారీగా, కొన్ని యాప్‌ల వారీగా రోజుకు చేసే మొత్తం ట్రాన్సాక్షన్ల సంఖ్యపై కూడా లిమిట్స్ ఉంటాయి.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version