https://oktelugu.com/

Telangana TDP: టీడీపీ తెలంగాణలో పోటీ చేయకపోవటం అతని కోసమేనా?

టీపీసీసీ పగ్గాలు అప్పగించిన సమయంలో కాంగ్రెస్‌ కుదుపునకు లోనైంది. చాలా మంది సీనియర్లు అలకబూనారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి లాంటి నేతలు పార్టీని వీడారు. కొంతమంది సపరేట్‌ గ్రూప్‌ ఏర్పాటు చేసుకున్నారు.

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : October 31, 2023 / 11:53 AM IST

    Telangana TDP

    Follow us on

    Telangana TDP: టీపీసీసీ చీఫ్, చంద్రబాబు నాయకుడు ప్రియ శిష్యుడు రేవంత్‌రెడ్డి. రాష్ట్ర విభజన తర్వాత టీడీపీ పరిస్థితి తెలంగాణలో రోజురోజుకూ దిగజారుతూ వచ్చింది. 2018 ఎన్నికల తర్వాత దాదాపు కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో టీడీపీలో ఉన్న రేవంత్‌ కాంగ్రెస్‌లో చేరారు. దీంతో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికలకుముందు ఎన్‌డీఏ నుంచి బయటకు వచ్చిన బాబు.. తెలంగాణ, ఏపీలో స్ట్రాంగ్‌గా ఉండేందుకు ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో రేవంత్‌ను కాంగ్రెస్‌లో చేర్పించారని అప్పట్లో ప్రచారం జరిగింది.

    అనూహ్యంగా టీపీసీసీ చీఫ్‌ పదవి..
    ఒకవైపు రేవంత్‌ కాంగ్రెస్‌లో చేరడానికి చంద్రబాబు నాయుడే కారణమని ప్రచారం జరుగుతుండగానే అనూహ్యంగా రేవంత్‌ను టీపీసీసీ పదవి వరించింది. నాడు కాంగ్రెస్‌ పరిస్థితి కూడా రోజురోజుకూ దిగజారుతుండడంతో కాంగ్రెస్‌ అధిష్టానం దూకుడుగా ఉండే నాయకుడు కావాలన్న ఉద్దేశంతో రేవంత్‌కు పగ్గాలు అప్పగించిందని కాంగ్రెస్‌ వర్గాలు వెల్లడించాయి. కానీ టీకాంగ్రెస్‌ నేతలు దీనిని వ్యతిరేకించారు. రేవంత్‌ డబ్బులు పెట్టి పదవి కొనుక్కున్నాడని కూడా తీవ్ర ఆరోపణలు చేశారు. మరోవైపు చంద్రబాబు లాబీయింగ్‌తోనే రేవంత్‌ టీపీసీసీ చీఫ్‌ అయ్యాడని కూడా విశ్లేషకులు కూడా భావించారు.

    టీకాంగ్రెస్‌పై రేవంత్‌ పట్టు..
    టీపీసీసీ పగ్గాలు అప్పగించిన సమయంలో కాంగ్రెస్‌ కుదుపునకు లోనైంది. చాలా మంది సీనియర్లు అలకబూనారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి లాంటి నేతలు పార్టీని వీడారు. కొంతమంది సపరేట్‌ గ్రూప్‌ ఏర్పాటు చేసుకున్నారు. ఈ క్రమంలో మాణిక్కం ఠాగూర్‌ కూడా రేవంత్‌కు వంతపాడుతున్నారని అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా రేవంత్‌ నిరాశ చెందకుండా పార్టీపై పట్టు సాధించారు. కీలక పదవుల్లో నత వర్గం నేతలను నియమించుకున్నారు. అధిష్టానం వద్ద కూడా బలం పెంచుకున్నారు.

    కర్ణాటక ఎన్నికల తర్వాత జోష్‌..
    కాంగ్రెస్‌లో చేరిన తర్వాత రేవంత్‌కు అన్నీ కలిసి వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆరు నెలల క్రితం జరిగిన కర్ణాటక ఎన్నికలు కూడా టీపీసీసీ చీఫ్‌కు మేలు చేశాయి. అక్కడ కాంగ్రెస్‌ అధికారంలోకి రావడంతో కాంగ్రెస్‌ అధిష్టానం తెలంగాణలో కూడా ఫోకస్‌ పెట్టింది. ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని టీపీసీసీ చీఫ్‌ రేంత్‌కు ఫ్రీ హ్యాండ్‌ ఇచ్చింది. దీంతో రేవంత్‌ తన మార్కు రాజకీయం మొదలు పెట్టారు. దూకుడు పెంచుతూ టికెట్ల కేటాయింపు, గ్యారంటీ హామీలు, అగ్రనేతలను తెలంగాణకు ఆహ్వానిస్తూ పార్టీ బలోపేతంపై దృష్టిపెట్టారు.

    తన వర్గం వారికి ఎక్కువ టికెట్లు..
    ఈ క్రమంలో ఎన్నికల షెడ్యూల్‌ రావడంతో రేవంత్‌ అధిష్టానం వద్ద లాబీయింగ్‌ చేసి తన వర్గం వారికి ఎక్కువ టిక్కెట్లు ఇప్పించుకున్నారు. కాంగ్రెస్‌ మెజారిటీ సీట్లు గెలిస్తే తాను ముఖ్యమంత్రి అయ్యేలా చక్రం తిప్పారు. దీంతో అధిష్టానం రేవంత్‌ అనుకూలులకు ఎక్కువ టిక్కెట్లు ఇచ్చింది. దీంతో అసంతృప్తులు పార్టీ వీడారు.

    మరోమారు బాబా మార్కు రాజకీయం..
    ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తన మార్కు రాజకీయానికి తెరతీశారు. తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తుండడంతో టీటీడీపీని ఎన్నికల బరి నుంచి తప్పించారు. ఈ నిర్ణయాన్ని అసలు ఎవరూ ఊహించలేదు. జైల్లో ఉన్న కారణంగానే ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ఆ పార్టీ నేతలు చెబుతున్నా దీని వెనుక అసలు కారనం వేరే ఉందంటున్నారు విశ్లేషకులు. రేవంత్‌కు, కాంగ్రెస్‌ పార్టీకి ఎలాంటి ఇబ్బంది కలుగకూడదని, ప్రభుత్వ వ్యతిరే ఓట్లు కాంగ్రెస్‌కు పడాలన్న ఉద్దేశంతోనే టీటీడీపీ ఎన్నికల రేసు నుంచి తప్పించారని పేర్కొంటున్నారు. రేవంత్‌సీఎం అయితే తెలంగాణలో తనకు అనుకూల ప్రభుత్వం ఉంటుందని, తర్వాత టీడీపీపీ బలోపేతం చేసుకోవచ్చన్న ఎత్తుగడంతో అసెంబ్లీ ఎన్నికల బరి నుంచి వైదొలిగినట్లు తెలుస్తోంది. మొత్తంగాతన శిష్యుడిని సీఎం చేయడానికి టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ను బలి చేశాడని విశ్లేషకులు పేర్కొంటున్నారు.