Investment Ideas: డబ్బు చుట్టూనే ప్రపంచం తిరుగుతుంది. ఐతే, తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు ఎవరో నూటికి కోటికి ఒకరు సంపాదిస్తారు. కొంతమంది సంపాదించామని చెప్పి మీ చేత పెట్టుబడి పెట్టిస్తారు, కానీ మీరు మోసపోతారు. సంవత్సరానికి ఈ కాలంలో 10_12 శాతము వస్తే మంచి రాబడి వచ్చినట్లే. మీరు ఎక్కడైనా మంచి ప్లాట్ లో గానీ మంచి షేర్ లలో గాని పెట్టుబడి పెడితే అంతకంటే మంచి రాబడి రావచ్చు లేదా మొత్తం సొమ్ము బ్లాక్ అవుతుంది.

ఎవరైనా మీకు 25 లేదా 50శాతం లాభము వస్తుందని చెబితే , వారిని మీరు నమ్మితే మీరు మోసపోవడం కూడా జరుగవచ్చు. అందుకే.. మీరు మంచి బ్యాంకులు లేదా మంచి mutual funds లో మాత్రమే పెట్టుబడి పెట్టండి.వచ్చిన దానితో సంతృప్తి పొందండి. సమాజసేవలో పాలు పంచుకోండి. మీరు ఎంతో గొప్ప సంపదలు పొందుతారు. ఆర్థికంగా కూడా వృద్ధి చెందుతారు.
Also Read: Niharika: మెగా డాటర్ నిహారికకు ఏమైంది? పెళ్లి తర్వాత సంచలన నిర్ణయం
స్వల్పకాలంలో మీరు చాలా ఎక్కువ లాభం పొందలేరు. కానీ, మీరు ఇప్పుడు ఏదో ఒక ప్లాట్ కొన్నారు. అక్కడ ప్రస్తుతం అభివృద్ధి ఎమీ లేదు. ఉంటే లక్ష రూపాయల కు ప్లాట్ రాదు గదా. కానీ కొన్నాళ్లకు ప్రభుత్వం వారు అక్కడ ఒక మంచి ప్రాజెక్ట్ పెడితే అప్పుడు మీ ప్లాట్ విలువ 10 రెట్లు కావచ్చు. ఉదాహరణకు రమేష్ అనే వ్యక్తి 1976 లో గుంటూరు లోని నాగార్జున విశ్వవిద్యాలయానికి దగ్గరలో ఒక 400 గజాల ప్లాట్ 4500 రూపాయలకు కొన్నాడు.

చాలా సంవత్సరాల పాటు వేచి ఉన్నాడు. అసలు ఏదో ఒక ధరకు అమ్ముడామంటే కొనే వాడు లేడు. ఒకవేళ ఉన్నా చాలా తక్కువకు అడిగే వారు. 2014 లో తెలంగాణ విడిపోయిన తర్వాత అక్కడ అమరావతి వచ్చింది.అప్పటి నుండి దాని ధర పెరుగుతూ వచ్చింది. చివరకు 2019 లో గజం 5000 రూపాయల చొప్పున అమ్మాడు. ఇలా సుదీర్ఘ కాలంలో మన అదృష్టం బాగుంటే మనకు మంచి లాభాలు రావచ్చు. కాబట్టి కరెక్ట్ గా ప్లాన్ చేయండి.