Homeఆంధ్రప్రదేశ్‌AP Employees: సీపీఎస్ ఉద్యోగుల దగ్గర కుప్పిగంతులు కష్టమే?

AP Employees: సీపీఎస్ ఉద్యోగుల దగ్గర కుప్పిగంతులు కష్టమే?

AP Employees: ఆంధ్రప్రదేశ్ లో సీఎం జగన్ ఇచ్చిన హామీలు ఆయన మెడకు చుట్టుకుంటున్నాయి. దీంతో లాక్కోలేక పీక్కోలేక సతమతమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికలకు ముందు నిర్వహించిన పాదయాత్రలో ఇబ్బడిముబ్బడిగా హామీలిచ్చారు.కానీ అవి నెరవేర్చేందుకు సత్తా చాలడం లేదు. ఇందులో భాగంగానే ఇచ్చిన హామీల్లో సీపీఎస్ రద్దు ఒకటి. ఇప్పుడు అది ఏకు మేకై కూర్చుంది. సీపీఎస్ రద్దు చేయాల్సిందేనని ఉద్యోగులు పట్టుబడుతున్నారు. సర్కారుకు తలనొప్పిగా మారింది. ఉద్యోగులు మాత్రం తగ్గేదేలే అంటున్నారు.దీంతో ప్రభుత్వం డోలాయమానంలో పడింది. ఇస్తే ప్రభుత్వానికి తంటా ఇవ్వకపోతే ఉద్యోగులతో మంట ఏం చేయాలనే దానిపై తర్జనభర్జనలు పడుతున్నారు. సీపీఎస్ రద్దు వీలు కాదని సజ్జలతో చెప్పించినా వారు మాత్రం వినిపించుకోవడం లేదు.

AP Employees
AP Employees

సీపీఎస్ రద్దు కోసం ఉద్యోగులు చేస్తున్న ఆందోళన చూస్తుంటే వారిలో ఏ మాత్రం జోష్ తగ్గడం లేదు. దీంతో ఇక ప్రభుత్వం దిగిరాక తప్పదని తెలుస్తోంది. కానీ వారి కోరిక మేరకు సీపీఎస్ రద్దు చేస్తే ఉద్యోగులకు చెల్లించాల్సిన దానికే ఆదాయం సరిపోతుంది. ఇప్పుడు ఉద్యోగులతో ఎలా అనే ప్రశ్నలు వస్తున్నాయి. మొత్తానికిజగన్ కు పెద్ద చిక్కు వచ్చి పడింది. అసలే సర్కారు ఆదాయం అంతంత మాత్రం కావడంతో సీపీఎస్ రద్దుకు మొగ్గు చూపడం లేదు. గతంలో ఉద్యోగుల సమ్మెను చెదరగొట్టినట్లుగానే ఇప్పుడు కూడా ఏదో ఉపాయం ఆలోచించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read: Malla Reddy: మల్లారెడ్డి ఫ్లాష్ బ్యాక్.. ఫుల్లీ ఎమోషనల్

2003 తర్వాత ఉద్యోగంలో చేరిన వారికి పెన్షన్ రాదు. అంతకంటే ముందు చేరిన వారికే వస్తుంది. దీంతో ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. తమకు పెన్షన్ ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు. రాజస్థాన్ ప్రభుత్వం మాత్రం అక్కడ సీపీఎస్ రద్దుచేసి పెన్షన్ విధానాన్ని పునరుద్దరించారు. కానీ ఇక్కడ ఎందుకు సాధ్యం కావడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఉద్యోగులు నిన్నచేసిన ఆందోళన చూస్తుంటే వారిలో ఐక్యతారాగం ఎక్కువగానే ఉంది, ఇక సర్కారు దిగిరాక తప్పదని చెబుతున్నారు. జగన్ మాత్రం దీనిపై నిర్ణయం తీసుకోవడం లేదు. ఉద్యోగులు తమ నిరసనలో భాగంగా శిరోముండనం చేయించుకోవడం విశేషం.

ఏపీలో ఉద్యోగుల ఆందోళన రెట్టింపవుతోంది. తమ న్యాయమైన డిమాండ్ సీపీఎస్ రద్దు చేయాలని కోరుతున్నారు. దీనికి ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన మాత్రం రావడం లేదు. ఈ నేపథ్యంలో సీపీఎస్ రద్దుతోనే ఉద్యోగులకు మనుగడ ఉందని చెబుతున్నారు. సర్కారు ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడంతో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోవాలన్నాఆలోచించి తీసుకుంటోంది. ఇప్పుడు సీపీఎస్ రద్దు వ్యవహారం సర్కారుకు పెద్ద గుదిబండగా మారింది.

AP Employees
AP Employees

 

ఎన్నికల ముందు ఇచ్చిన హామీ నెరవేర్చకపోతే భవిష్యత్ లో తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. తమకు ఇచ్చిన హామీనే నెరవేర్చాలని అడుగుతున్నారు. దీంతో రాష్రప్రభుత్వం ఎటూ తేల్చుకోలేకపోతోంది. సీపీఎస్ రద్దు చేసే వరకు విశ్రమించేది లేదని ఉద్యోగులు చెబుతున్నారు. ఈ క్రమంలో సర్కారు ఏ నిర్ణయం తీసుకుంటుందో తెలియడం లేదు. మొత్తానికి జగన్ దీనిపై ఎలా స్పందిస్తారనేదానిపై భవితవ్యం ఆధారపడి ఉంది.

Also Read:Ukrainian real hero: 40 రష్యా యుద్ధ విమానాలను కూల్చిన ఒకే ఒక్క ఉక్రెయిన్ రియల్ హీరో కథ!

Recommended Videos

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

6 COMMENTS

  1. […] Prashant Kishor: దేశంలో విజయవంతమైన ఎన్నికల వ్యూహకర్తగా గుర్తింపు పొందిన బీహార్‌ వాసి ప్రశాంత్‌ కిశోర్‌ కొన్ని రోజులుగా తీసుకుంటున్న నిర్ణయాలు ఎవరికీ అర్థం కావడం లేదు. కనీసం ఆయనకైనా అర్థం అవుతున్నాయా.. లేదా అన్న అనుమానం కలుగుతోంది. ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు ఇప్పటికే రాజకీయాల్లోకి రావడానికి జేడీయూ, కాంగ్రెస్‌ పార్టీల చుట్టూ తిరిగిన ఆయన.. ఆ పార్టీలు తనకు సరిపోవు అన్నట్లు వ్యవహరించారు. తాజాగా కొత్త వ్యూహానికి తెరలేపాడు ఈ స్ట్రాటజిస్ట్‌. తానే సొంతంగా పార్టీ పెట్టాలని నిర్ణయించుకున్నాడు. ఈమేరకు సోమవారం ఓ ట్వీట్‌ చేశాడు. పార్టీ పేరు ‘జన్‌ సూరజ్‌’గా ప్రకటించారు. ఇది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో విస్తత చర్చకు దారితీసింది. […]

Comments are closed.

RELATED ARTICLES

Most Popular