Lic Kanyadan Policy: 2022 సంవత్సరం మొదలైంది. కొత్త ఏడాదిలో సక్సెస్ కావాలనే ఉద్దేశంతో చాలామంది ఇప్పటికే ఆర్థిక ప్రణాళికలను సిద్ధం చేసుకున్నారు. చాలామంది ముఖ్యంగా పిల్లల కోసం, ఆడపిల్లల పెళ్లి కోసం ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారు. ఆడపిల్ల ఉన్న ప్రతిఒక్కరూ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని జాగ్రత్త పడితే మంచిదని చెప్పవచ్చు. ఎల్‌ఐసీ ఆఫర్ చేసే కన్యాదాన్ పాలసీలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మంచి లాభాలను సొంతం చేసుకోవచ్చు.
రోజుకు కేవలం 130 రూపాయలు పొదుపు చేయడం ద్వారా నెలకు సులభంగా 3,900 రూపాయలు పొదుపు చేసే అవకాశం ఉంటుంది. ఇలా పొదుపు చేసిన డబ్బులో 27 లక్షల రూపాయల వరకు డిపాజిట్ ను పొందే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఈ పాలసీలో ఇన్వెస్ట్ చేసిన మొత్తానికి ఆదాయపు పన్ను మినహాయింపు ప్రయోజనాలను పొందవచ్చు. లక్షన్నర రూపాయల పన్ను మినహాయింపు బెనిఫిట్స్ లభిస్తాయి.
ఆధార్ కార్డు, ఆదాయపు సర్టిఫికేట్, గుర్తింపు కార్డు, అడ్రస్ ప్రూఫ్, పాస్ పోర్టు సైజు ఫోటో సహాయంతో ఈ పాలసీని తీసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. మొదటి ప్రీమియం చెక్, ఆడపిల్ల బర్త్ సర్టిఫికేట్, సిగ్నేచర్ తో ఉన్న అప్లికేషన్ ఫామ్ ను సమర్పించడం ద్వారా ఈ పాలసీ బెనిఫిట్స్ ను పొందవచ్చు. 22 సంవత్సరాలకు ప్రీమియం చెల్లిస్తే 25 సంవత్సరాలకు ఈ పాలసీ మెచ్యూరిటీ అవుతుంది.
ఈ పాలసీ తీసుకున్న వాళ్లకు 25 సంవత్సరాల తర్వాత ఏకంగా 27 లక్షల రూపాయలు లభిస్తాయి. ప్రమాదంలో తండ్రి లేదా గార్డియన్ చనిపోతే నామినీ 10 లక్షల రూపాయలు ఒకే మొత్తంలో పొందవచ్చు. పాలసీలో గరిష్టంగా సంవత్సరానికి లక్షన్నర చొప్పున ఇన్వెస్ట్ చేయవచ్చు. ఆడపిల్ల వయస్సును బట్టి పాలసీ టైమ్ లిమిట్, చెల్లించే ప్రీమియం మారుతుందని చెప్పవచ్చు.