Right To Property: ఒక వ్యక్తి తన జీవితం బాగుండాలని కష్డపడి డబ్బు సంపాదిస్తాడు. తన తరువాత కుమారులు కూడా సంతోషంగా ఉండాలని, ఇల్లు, ఇతర స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. మరోవ్యక్తి జీవితాంతం కష్టపడి సొంత ఇల్లు కొనుగోలు చేసి అందులో సంతోషంగా జీవించానుకుంటాడు. కానీ వయసు రీత్యా కాలం చేసిన తరువాత అందులో ఉండలేడు. అయితే ఇలా సంపాదించిన ఆస్తిని కొందరు బతికుండగా ఎలాంటి వాటాలు కేటాయించరు. కనీసం వీలునామా కూడా రాయరు. ఇలా వాటాలు పంచకముందే సదరు వ్యక్తి కాలం చేస్తే.. వాటా పంపకాల్లో సమస్యలు వస్తాయి. వారసుల్లో బేధాభిప్రాయాలు వచ్చి వాటాల కోసం గోడవలు అయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఏంచేయాలి? వాటాలను ఎలా పంచుకోవాలి? దీనిని అమ్మేయవచ్చా?
కొందరు న్యాయ నిపుణులు తెలుపుతన్న ప్రకారం.. కొందరు జీవితాంతం కష్టపడి ఖరీదైన ఇల్లును కొనుగోలు చేస్తారు.కానీ అందులో సుఖంగా జీవించలేరు. అయితే ఈ ఆస్తి తన కుమారులకే దక్కాలి అని ప్రత్యేకంగా ఎవరూ వీలునామా రాయరు. ఆయన సొంత కుమారులు కనుక ఈ ఆస్తి వారికే చెల్లుకుంది. అయితే ఒకరు కంటే ఎక్కువ వారసులు ఉంటే వీటిని పంచుకోవడంలో ఇబ్బందులు వస్తాయి. ఇద్దరు వారసుల్లో ఒకరు ఆస్తిని పంచుకుందామంటే.. మరొకరు అమ్మేద్దాం అని అంటారు. ఇలాంటి చిక్కులు కోకోల్లలు.
అయితే ఇలాంటి సందర్భాల్లో ఒక ఆస్తిని తండ్రి బతికి ఉన్నప్పుడే వాటాను పంచితే వారు నిరభ్యంతరంగా తమ వాటా అమ్ముకోవచ్చు. కానీ వాటాల పంపకం జరగనప్పుడు వారసులు ఐకమత్యమై ఇతరులకు విక్రయించవచ్చు. అయితే ఇద్దరిలో ఎవరో ఒకరు వినకపోతే న్యాయనిపుడిని సంప్రదించాలి. అప్పుడు కౌన్సిలింగ్ లేదా ఇతర మార్గాల ద్వారా సయోద్య కుదిర్చి వాటాలను విక్రయిస్తారు.
ఒక ఇంట్లో ముగ్గురు వారసులు ఉంటే ఆస్తిపై ఎక్కువ హక్కు పెద్ద కుమారుడికే ఉంటుంది. అయితే ఆ ఇంట్లో మిగతా వారసులు నివసించినట్లయితే ఆ ఆస్తిని ఇతరులకు అమ్మేయడానికి ఆస్కారం లేదు. మిగతా వారసులను ఒప్పించిన తరువాత విక్రయానికి సిద్ధపడాలి. ఇక వాటాను అమ్మడానికి రెడీ అయినప్పుడు మిగతా వారికి అనుమతిని కోరుతూ నోటీసులు ఇవ్వాల్సి ఉంటుంది. పూర్వీకుల ఆస్తి తమ వారసులందరికీ ఉంటుంది. కానీ వీరిలో ఏ ఒక్క వ్యక్తి అయినా తనకు వచ్చే వాటాను విక్రయించుకోవాలనుకుంటున్నాను అని నోటీసులో తెలపాలి. అప్పుడు మిగతా వారు చర్చించుకుకి వారిలో ఒకరు లేదా ఇతరులకు విక్రయంపై నిర్ణయం తీసుకోవాలి.