Home essentials replacement: ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. కానీ ఈ పదాన్ని చాలామంది చూస్తూ వెళుతుంటారు. పాటించేవారు మాత్రం చాలా తక్కువ మంది మాత్రమే. ఆరోగ్యం కోసం ప్రత్యేకంగా ఇటువంటి అలవాట్లు చేసుకోకపోయినా.. ప్రతిరోజు చేసే వాటిలోనే కొన్నిటిని సరి చేసుకోవడం వల్ల ఎన్నో రకాల అనారోగ్యాలకు దూరం అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా మనం రోజు వాడే కొన్ని వస్తువులను పరిమితి తేదీలను నియమించుకొని ఆ తర్వాత వాటి స్థానంలో కొత్త వస్తువులను తీసుకురావడం వల్ల ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. మరి ఎలాంటి వస్తువులను.. ఎన్ని రోజులకు ఒకసారి మార్చాలి? లేకపోతే ఏమవుతుంది?
మనం ఏదైనా వస్తువు కొనుగోలు చేసేటప్పుడు దానిపై ఎక్స్పైర్ డేట్ చూస్తాం. ఎక్స్ప్రెస్ డేట్ దాటితే ఆ వస్తువులు వాడకుండా ఉంటాం. అయితే కేవలం ఇతర ప్రదేశాల్లో కొనుగోలు చేసే వస్తువుల ఎక్స్పైర్ డేట్ మాత్రమే కాకుండా.. ఇంట్లో ప్రతిరోజు ఉపయోగించే కొన్ని వస్తువులకు కూడా మనకు మనమే గడువు తేదీని నియమించుకోవాలి. కొన్ని రోజులు దాటిన తర్వాత దానిని వాడడం మానేయాలి. అలాంటి వస్తువుల్లో ప్రధానంగా వీటి గురించి చెప్పుకోవచ్చు.
చీపురు:
ఇంట్లో ఉండే చెత్తాచెదారం అంతా క్లీన్ చేయడానికి చీపురు ఎంతో ఉపయోగపడుతుంది. అయితే ఈ చీపురును కొందరు ముందటి భాగం పాడైపోయిన తర్వాత కూడా వాడుతూ ఉంటారు. అలా వాడితే ఇల్లు క్లీన్ అయ్యే బాధలు ఎక్కువగా చెత్త పడే అవకాశం ఉంటుంది. దీనిపై ఎక్కడా ఎక్స్పైరీ డేట్ ఉండదు. కానీ మనమే మూడు నెలలుగా ఉపయోగించి ఆ తర్వాత కొత్త చీపురును కొనుగోలు చేయడం మంచిది.
టూత్ బ్రష్:
కొందరు బ్రష్ పై ఉండే ప్లాస్టిక్ ధ్వంసం అయ్యేదాకా వాడుతూ ఉంటారు. ఇలాంటి బ్రష్ ను వాడడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. ఈ బ్రష్ వాడడం వల్ల మరింత అనారోగ్యానికి గురవుతూ ఉంటారు. దీనిని కూడా మూడు నెలలకు ఒకసారి మారుస్తూ ఉండాలి. ఈ బ్రష్ పై ఉన్న ప్లాస్టిక్ పాడైపోకున్నా.. ఇందులో క్రిములు దాగి ఉండే అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ బ్రష్ ను మూడు నెలలకు ఒకసారి మార్చుకోవడం మంచిది.
స్క్రబ్బర్:
ప్రతిరోజు వంట పాత్రలను శుభ్రం చేయడానికి స్క్రబ్బర్ కచ్చితంగా ఉపయోగిస్తారు. స్పాంజి లా ఉండే ఇందులో ఎన్నో రకాల క్రిములు దాగి ఉండే అవకాశం ఉంది. ఈ స్పాంజి ని కొందరు నెలల తరబడి వాడుతూ ఉంటారు. ఆరు నెలలకు ఒకసారి దీనిని మార్చుకోవడం మంచిది. ఎందుకంటే ఇందులో ప్రమాదకరమైన క్రిములు ఉండే అవకాశం ఉంటుంది. కొన్ని రకాల క్రిములు పాత్రలపై అలాగే ఉండి వాటిని ఉపయోగించడం వల్ల శరీరంలోకి వెళ్లే అవకాశం ఉంది.
ఇవే కాకుండా లో దుస్తులు.. కొన్ని రకాల వంట పాత్రలను కూడా పరిమితికి మించి వాడకుండా ఉండాలి. అలా వాడడం వల్ల ఆరోగ్యానికి హానికరంగా ఉంటుంది.