Daily Health Tips: పూర్వకాలం కంటే నేటి కాలంలో చాలామంది అనారోగ్యాలకు గురవుతున్నారు. ఒకప్పుడు ఎటువంటి అలవాట్లు ఉన్నా.. వారు చేసే శ్రమ ద్వారా ఎలాంటి అనారోగ్యానికి గురికాకుండా ఉండేవారు. కానీ ఇప్పుడు శారీరక శ్రమ తగ్గింది. ఇదే సమయంలో ఆహారం తినడం ఎక్కువగా మారింది. ఫలితంగా కొత్త కొత్త రోగాల బారిన పడుతున్నారు. అయితే అందరూ ఒకే వ్యాధిలో కాకుండా రకరకాల డిసీజ్ ను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇవి రావడానికి కలుషిత వాతావరణమో.. ఇంకేదో కాదు.. కేవలం మన అలవాట్లు మాత్రమే. కొన్ని అలవాట్ల ద్వారానే బిపి, షుగర్, అల్సర్ వంటి వ్యాధులు వస్తున్నాయి. అయితే ఇవి రాకుండా ఉండాలంటే కొన్ని రకాల ఆహార పదార్థాలకు దూరంగా ఉండడమే మంచిది. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం..
ప్రస్తుత కాలంలో చాలామంది బ్లడ్ ప్రెషర్ బారిన పడుతున్నారు. చిన్న చిన్న విషయాలకే కోపం తెచ్చుకుంటున్నారు. చిన్నవారిలో సైతం ఈ సమస్య ఉంటుంది. బిపి రావడానికి ప్రధాన కారణం ఉప్పు ఎక్కువగా తీసుకోవడమే. కొందరు టేస్టీ లేదా ఇతర కారణాలతో ఉప్పు ఎక్కువగా తీసుకుంటారు. మరికొందరు ఆహార పదార్థాల్లో ఉప్పు తక్కువగా ఉందని అదనంగా పచ్చి ఉప్పును వేసుకుంటారు. ఇలా చేయడం వల్ల తొందరగా బ్లడ్ ప్రెషర్ కు గురయ్యే అవకాశం ఉంటుంది.
చాలామందిని వేధిస్తున్న వ్యాధి డయాబెటిక్. ఇది చక్కెర ఎక్కువగా తీసుకోవడం వల్ల వస్తుందని చాలామంది అనుకుంటారు. అయితే చక్కెర తీసుకోవడంతోపాటు ఆలస్యంగా ఆహారం తీసుకున్నా… కూడా మధుమేహం మారిన పడుతుంటారు. అయితే సరైన సమయానికి ఆహారం తీసుకోవడం వల్ల ఈ వ్యాధి రాకుండా చేసుకోవచ్చు.
వయసు తేడా లేకుండా అందరిలోనూ గుండె సమస్యలు ఉంటున్నాయి. అయితే గుండె సమస్యలు రావడానికి ప్రధాన కారణం శారీరక శ్రమ లేకపోవడమే అని తెలుస్తోంది. ఒకే చోట కూర్చొని పనిచేయడం.. రక్త ప్రసరణ సరఫరా లేకుండా ఉండడం వల్ల గుండె సమస్యలు వస్తుంటాయి. అయితే ఎప్పుడు ఒకే చోట కూర్చోకుండా రోజుకు కనీసం శారీరక వ్యాయామం చేయాల్సిన అవసరం ఉంది.
మైగ్రేన్ సమస్యతో కూడా చాలామంది కొట్టుమిట్టాడుతున్నారు. అయితే సమయానికి సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల కూడా ఈ సమస్యను ఎదుర్కొంటారు. ప్రతిరోజు సరైన సమయానికి ఆహారం తీసుకోవడమే కాకుండా.. ఎక్కువగా శబ్దం వినడం వంటివి చేయడం వల్ల ఈ సమస్య వస్తుంది.
కొంతమందిని చూస్తే ముందుకు వంగినట్లు కనిపిస్తారు. వీరి వెన్నెముక వంగిపోవడమే అందుకు కారణం. ఇలాంటి సమస్య రావడానికి సన్రైజ్ లేకపోవడమే కారణం. ప్రతిరోజు కనీసం గంట పాటు సూర్యరశ్మి తగలడం వల్ల ఈ సమస్య రాకుండా ఉంటుంది. ముఖ్యంగా పిల్లలు ఉదయం లేవగానే స్కూల్ కి వెళ్లి.. ఆ తర్వాత వెంటనే ఇంట్లోకి వస్తారు. వీరు సూర్యరశ్మిని చూసే అవకాశం ఉండదు. అందువల్ల ప్రతిరోజు కాసేపు ఎండలో కూర్చునే విధంగా ఏర్పాటు చేసుకోవాలి.
రకరకాల ఆహార పదార్థాలు తినడం వల్ల జీర్ణక్రియ సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. అయితే కొందరిలో అల్సర్ సమస్య కూడా ఉంటుంది. ఇది రావడానికి స్పీడుగా ఆహారం తీసుకోవడమే. ఇలా స్పీడ్ గా ఆహారం తీసుకోకుండా నెమ్మదిగా తీసుకునే ప్రయత్నం చేయాలి. అలా చేస్తే అల్సర్ రాకుండా కాపాడుకోవచ్చు.