spot_img
Homeలైఫ్ స్టైల్Summer pillow cover cleaning tips: ఎండాకాలం దిండ్ల కవర్లు ఎన్ని రోజులకు మార్చాలి..

Summer pillow cover cleaning tips: ఎండాకాలం దిండ్ల కవర్లు ఎన్ని రోజులకు మార్చాలి..

Summer pillow cover cleaning tips: మిగతా కాలాలతో పోల్చి చూస్తే.. ఎండాకాలం కాస్త భిన్నమైనది. ఎందుకంటే ఎండాకాలంలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి. గాలిలో తేమశాతం తక్కువగా ఉంటుంది. ఇలాంటి వాతావరణంలో ఉండాలంటే ఇబ్బందిగా ఉంటుంది. అందువల్లే చల్లదనాన్ని ఆస్వాదించాలని అందరికీ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎండాకాలంలో సాధ్యమైనంతవరకు కాటన్ దుస్తులను వాడుతుంటారు. చివరికి దిండ్ల కవర్లు కూడా కాటన్ వి వాడతారు.

సాధారణంగానే దిండ్ల కవర్లను కాటన్ వస్త్రాలతో రూపొందించిన వాటిని వాడుతుంటారు. ఎండాకాలంలో రాత్రి నిద్ర కూడా చెమట విపరీతంగా పడుతూ ఉంటుంది. ఏసీలో ఉన్నప్పటికీ కూడా ఒక రకమైన జిడ్డు దిండ్ల కవర్లకు అంటుకుంటుంది. ఆ జిడ్డు వాసన ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఫ్యాన్ల కింద, కూలర్ల కింద పడుకున్న వాళ్లకు కూడా చెమట వస్తూ ఉంటుంది. ఆ చెమట దిండ్ల కవర్లకు అంటుకుంటుంది. ఫలితంగా వాసన వస్తూ ఉంటుంది. మనిషి చెమటలో అనేక రకాలైన వ్యర్ధాలు ఉంటాయి. ఆ వ్యర్ధాలు రకరకాల వాసనలు కలిగి ఉంటాయి. ఆ చెమట పట్టిన కవర్లను శుభ్రం చేయకుండా ఉంటే రకరకాల ఇన్ఫెక్షన్లు సోకుతుంటాయి.

వైద్యుల సూచన ప్రకారం దిండ్ల కవర్లను ప్రతి రెండు మూడు రోజులకు ఒకసారి శుభ్రం చేస్తూ ఉండాలట. వాటిని రిటర్జెంట్ పౌడర్ వేసిన నీటిలో నానబెట్టి.. సబ్బుతో శుభ్రం చేయాలట. ఒకవేళ వాషింగ్ మిషన్ కనుక ఉంటే.. అందులో వేసి వాష్ చేయాలట. ఆ తర్వాత సువాసన కోసం కంఫర్ట్ లాంటి ద్రవం వేసి.. నీటిలో ముంచి తీయాలట.. ఆ తర్వాత వాటిని ఎండలో ఆరేయాలి. పూర్తిగా ఆరిన తర్వాత దిండు కవర్లను తీయాలి. ఇలా చేయడం వల్ల బ్యాక్టీరియా వృద్ధి కాదని వైద్యులు చెబుతున్నారు.

ఒకవేళ దిండ్ల కవర్లను మార్చకపోతే బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఫలితంగా మొటిమలు, రకరకాల చర్మ సమస్యలు రావడానికి ఆస్కారం ఉంటుంది. చెమట వల్ల దిండ్లపై ధూళి కణాలు పేరుకు పోతాయి. వీటివల్ల శ్వాస కోశ సమస్యలు వస్తాయి. చెమట, జుట్టుకు పెట్టుకున్న నూనె వల్ల పిల్లో నుంచి దుర్వాసన వస్తుంది. కవర్లను మాత్రమే కాదు , దిండ్లను కూడా ప్రతి రెండు నుంచి మూడు నెలలకు ఒకసారి ఉతికి ఆరేయాలి. ఆ తర్వాత వాటిని వాడాలని వైద్యులు చెబుతున్నారు.

పడకగదిలో దుప్పట్లను కూడా ఎప్పటికప్పుడు ఉతుకుతూ ఉండాలి. వారానికి ఒకసారి వాటిని ఉతకడం వల్ల.. శుభ్రంగా ఉంటాయి. చెమట, ధూళికణాలు, వ్యర్ధాలు నశించిపోతాయి. ఫలితంగా చర్మ సమస్యలు రావు. దురద వంటి ఇబ్బందులు చుట్టుముట్టవు. సాధ్యమైనంతవరకు పడకగదిలో వాడే దుప్పట్లను ఎంత శుభ్రంగా ఉంచుకుంటే అంత మంచిదని వైద్యులు చెబుతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ మొదటి వారం వరల్డ్ వైడ్ వసూళ్లు.. అవతార్ రికార్డ్స్...

The Odyssey Box Office : భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి సెన్సేషన్ ని సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం. నిన్నగాక...
Oktelugu Epaper
Exit mobile version