Women Health: హిమోగ్లోబిన్ అనేది ఎవరికైనా అవసరమే. శరీరంలో అన్ని భాగాలు ఆరోగ్యంగా ఉండాలంటే ఆక్సిజన్ అవసరం. శరీరంలోని అన్ని భాగాలకు ఆక్సిజన్‌ను అందించడానికి హిమోగ్లోబిన్ బాగా పనిచేస్తుంది. అయితే చాలా మంది హిమోగ్లోబిన్ సమస్యతో బాధపడుతుంటారు. ఇది పురుషుల్లో కంటే మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. మహిళల్లో రక్తం ఎక్కువగానే ఉండాలి. లేకపోతే ఎన్నో అనారోగ్య సమస్యలతో పాటు రక్తహీనత వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. రక్తం తక్కువైతే ప్లేట్‌లెట్స్ తగ్గడంతో పాటు ఆరోగ్యం క్షీణిస్తుంది. శరీరంలో హిమోగ్లోబిన్ లేకపోతే కొన్నిసార్లు ప్రాణం పోయే ప్రమాదం కూడా ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి మహిళల్లో ఎంత హిమోగ్లోబిన్ ఉండాలి? తక్కువగా ఉంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మహిళల శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయి డెసిలీటర్‌కు 12 నుంచి 16 గ్రాముల మధ్య ఉండాలి. అయితే వయస్సు, జీవనశైలి, శారీరక ఆరోగ్యాన్ని బట్టి మహిళల్లో హిమోగ్లోబిన్ స్థాయిలో కాస్త మార్పులు ఉంటాయి. డెసిలీటర్‌కు 12 గ్రాముల కంటే తక్కువగా మహిళల్లో హిమోగ్లోబిన్ స్థాయిలు ఉంటే.. శరీరానికి తగినంత ఆక్సిజన్ సరఫరా జరగదు. దీనివల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. దీనివల్ల రక్తహీనత వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అయితే మహిళలు నెలసరి అయ్యేటప్పుడు బ్లీడింగ్ అధికం అయిన కూడా కొన్నిసార్లు రక్తహీనత వస్తుంది. ఎందుకంటే శరీరంలో రక్తం లేనప్పుడు, పీరియడ్స్ సమయంలో ఇంకా ప్రమాదాన్ని పెంచుతుంది. మహిళలు రక్తహీనతకు గురి కాకుండా ఉండాలంటే ఐరన్, విటమిన్లు, ఫోలిక్ యాసిడ్, రక్తం ఎక్కువగా బాడీకి ఎక్కే పండ్లు, పదార్థాలు తీసుకోవాలి. అలాగే పీరియడ్స్‌లో ఎక్కువగా బ్లీడింగ్ అవుతున్నట్లయితే వెంటనే డాక్టర్‌ను సంప్రదించి చికిత్స తీసుకోవాలి. ఎక్కువగా రక్తస్రావం కావడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు.
హిమోగ్లోబిన్ తక్కువ అయ్యిందని తెలియాలంటే బాడీలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. బలహీనత, విపరీతమైన అలసట, మైకం, తలనొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, చర్మం పసుపు రంగులోకి మారడం వంటి లక్షణాలన్ని కనిపిస్తాయి. ఈ లక్షణాలు మీ శరీరంలో కనిపించిన వెంటనే వైద్యుని సంప్రదించి చికిత్స తీసుకోవాలి. లేకపోతే అనారోగ్య సమస్యలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా గర్భిణులు చాలా జాగ్రత్తగా ఉండాలి. రక్తం ఎంత ఎక్కువగా ఉంటే ఆరోగ్యానికి మంచిది. తక్కువ అయితే డెలివరీ సమయంలో ఇబ్బందులు ఎదుర్కొవలసి వస్తుంది. కాబట్టి మహళలు డైలీ డైట్‌లో కొన్ని ఆహార పదార్థాలను తప్పకుండా చేర్చుకోవాలి. ముఖ్యంగా ఆకుకూరలు, పప్పులు, తాజా పండ్లు, చికెన్, ఫిష్ వంటివి చేర్చుకోవాలి. వీటితో పాటు తినే పదార్థాల్లో ఐరన్ ఉండే వాటిని ఎంచుకోవాలి. నారింజ, అవకాడో, తృణధాన్యాలు, గుడ్లు, పాలు ఉండేటట్లు చూసుకోవాలి. అలాగే వేరుశెనగ చక్కీలు, నువ్వులు, బెల్లం వంటి వాటిలో ఎక్కువగా ఐరన్ ఉంటుంది. వీటిని తింటే తొందరగా శరీరానికి బ్లడ్ ఎక్కుతుంది. కాబట్టి డైలీ వీటిని తీసుకోవడం అలవాటు చేసుకోండి.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Read MoreWeb Title: How much hemoglobin should women have if not are there any problems
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com