Gold storage rules: బంగారం ధర రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో కొనుగోలుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే భవిష్యత్తులో బంగారం ధర 2 లక్షల పైగా చేరే అవకాశం ఉందని కొందరు అంటున్నారు. దీంతో కొంతమంది ఇప్పుడే బంగారం కొనుగోలు చేసి ఇంట్లో నిల్వ చేసుకుంటున్నారు. మరికొందరు బంగారం ధర పెరుగుతున్న నేపథ్యంలో దీనిపై పెట్టుబడుల కోసం బంగారం కొనుగోలు చేసి స్టోర్ చేసుకుంటున్నారు. అయితే అవసరానికి మించి ఇంట్లో బంగారం ఉంటే ఆదాయపు పన్ను శాఖ వారు వచ్చి సీజ్ చేసే అవకాశం ఉంటుంది. ఇలాంటి అప్పుడు ఇంట్లో ఎంతవరకు బంగారం ఉండాలి? ఎక్కువ ఉంటే ఏమవుతుంది?
ఆదాయపు పన్ను శాఖ ప్రకారం ఇంట్లో యువతులపై 250 గ్రాముల బంగారం ఉండాలి. మహిళల కోసం 500 గ్రాముల బంగారం ఉండాలి. పురుషుల కోసం 100 గ్రాముల బంగారం ఉండాలి. అయితే అంతకుమించిన బంగారం ఉండొద్దని ఎవరూ చెప్పరు. కానీ ఇంతకు మించిన బంగారం ఉంటే దానికి సంబంధించిన రసీదు తప్పనిసరిగా ఉండాలి. ఆ బంగారం ఎక్కడినుంచి వచ్చింది? ఎప్పుడు కొనుగోలు చేశారు? ఎవరికోసం కొనుగోలు చేశారు? అనే రసీదులు తప్పనిసరిగా ఉండాలి. అలా లేకుంటే బంగారంను సీజ్ చేసే అవకాశం ఉంటుంది.
చట్టపరంగా కాకుండా అని భద్రతాపరంగా కూడా బంగారం ఇంట్లో ఎక్కువగా ఉండడం అంత మంచిది కాదు. ఎందుకంటే నేటి కాలంలో దొంగల భయం ఎక్కువగా ఉంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో బంగారం దోచుకెళ్లే అవకాశం ఉంది. అందువల్ల బంగారంను పరిమితంగా ఇంట్లో ఉంచుకోవడం మంచిది. మిగతా బంగారం బ్యాంకులో లాకర్లలో లేదా బంగారంపై బీమా చేయించుకోవడం మంచిది. ప్రస్తుతం బంగారం ధర విపరీతంగా పెరుగుతుండడంతో భవిష్యత్తులో బంగారం అవసరమయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే భవిష్యత్తులో ధర విపరీతంగా ఉంటే కొనలేని పరిస్థితి ఉంటుంది. అందువల్ల చాలామంది ఇప్పుడు బంగారం కొనుగోలు చేస్తున్నారు. అయితే బంగారం కొనుగోలు చేసినప్పుడు దానికి సంబంధించిన రసీదును తప్పనిసరిగా ఉంచుకోవాలి.
ఇక చాలామంది బంగారంపై పెట్టుబడులు పెడుతున్నారు. బంగారం అవసరం ఉంటేనే కొనుగోలు చేయాలి. కేవలం పెట్టుబడుల కోసం బంగారం కొనుగోలు చేయడం ఎంత మాత్రం మంచిది కాదు అని కొందరు నిపుణులు అంటున్నారు. ఎందుకంటే బంగారం కొనుగోలు చేసేటప్పుడు జీఎస్టీ, మేకింగ్ ఛార్జ్, తరుగు వంటివి ఉంటాయి. ఒకవేళ కొనుగోలు చేసిన బంగారంను వెంటనే విక్రయించాలి అనుకుంటే వీటిని కట్ చేసుకొని మిగతా డబ్బులు ఇస్తారు. అప్పుడు వీటిపై విచించిన డబ్బుకు వడ్డీ రానట్లే. అందువల్ల ఇంట్లో అవసరం ఉంటేనే బంగారం కొనుగోలు చేయాలని నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా బంగారం కొనుగోలు చేసే సమయంలో అనేక మోసాలు జరిగే అవకాశం ఉంది. బంగారం ప్యూరిటీ ఉందా? లేదా? అని చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది.