Lord Venkateswara name Govinda: మనిషిగా జన్మించినందుకు తిరుమల తిరుపతి దేవస్థాన స్వామి వారిని ఒక్కసారైనా దర్శించుకోవాలని చాలామంది భక్తులు అనుకుంటారు. అందుకే దేశ, విదేశాల నుంచి శ్రీవారి దర్శనం కోసం తరలి వస్తుంటారు. కలియుగ దైవంగా పేరు ఉన్న శ్రీ వెంకటేశ్వరుడికి ఎన్నో నామాలు ఉన్నాయి. తిరుమలేశుడు, శ్రీనివాసుడు, ఏడుకొండలవాడు.. అంటూ ఇలా రకరకాల పేర్లతో పిలుస్తూ భక్తులు తిరుమల సన్నిధికి చేరుతూ ఉంటారు. అయితే తిరుమల సన్నిధికి చేరే క్రమంలో భక్తుల నోటివంట వచ్చే ఒకే ఒక్క పదం గోవిందా.. గోవిందా.. ఈ జపం చేస్తూ భక్తులు తిరుమలకు వెళ్తే స్వామివారి అనుగ్రహం ఉండి తొందరగా దర్శనం అవుతుందని కొందరు భక్తులు పేర్కొంటారు. అసలు ఈ గోవిందా అనే పదం ఎప్పుడు పుట్టింది? శ్రీనివాసుడిని గోవిందుడు అని ఎందుకు అంటారు?
శ్రీనివాసుడిని గోవిందుడు అనడానికి ఒక పురాణ కథ ఉంది. పూర్వకాలంలో అగస్త్య ముని వద్దకు శ్రీనివాసుడు వెళ్తాడు. మునీశ్వరుడి దగ్గర ఉన్న ఆవులను చూసి ముచ్చటిస్తుంది. దీంతో తనకు ఒక ఆవు కావాలని శ్రీనివాసుడు అడుగుతాడు. అయితే అప్పుడు ఆగస్టు ముని ఇలా అంటాడు.. తాను ఏదైనా దానం ఇవ్వాలనుకుంటే దంపతులుగా రావాలని చెబుతాడు. అప్పుడు శ్రీనివాసుడు తిరిగి వెళ్లి పద్మావతి తో కలిసి మళ్ళీ అగస్యముని ఆశ్రమానికి వెళ్తాడు. అయితే ఈ సమయంలో అక్కడ మునీశ్వరుడు ఉండక అతని శిష్యులు ఉంటారు. దీంతో తనకు గతంలో ఆవు ఇస్తానని అగస్యముని చెప్పాడు.. తను సతీసమేతంగా రావాలని చెప్పాడు. ఇప్పుడు నేను పద్మావతి తో వచ్చాను అని.. అగస్యముని శిష్యులతో అంటాడు..
అప్పుడు శిష్యులు తమ గురువు ఆజ్ఞలు లేనిది ఏ ఆవు ఇవ్వలేము అని అంటాడు. దీంతో శ్రీనివాసుడికి కోపం వచ్చి తిరిగి వెళ్తాడు. ఆ తర్వాత అగస్త్య ముని ఆశ్రమానికి చేరుకున్న తర్వాత శిష్యులు జరిగినదంతా చెబుతాడు. దీంతో ఆందోళన చెందిన అగస్యముని ఒక ఆవును పట్టుకొని ఇలా పిలుస్తాడు.. శ్రీనివాసుడా.. గోవు ఇందా.. అంటే ఆవును తీసుకోండి.. అని పిలుచుకుంటూ వెళ్తాడు. అప్పుడు శ్రీనివాసుడు కరుణించి తనను గోవిందా అని పిలిచినందుకు అగస్త్య మునిని మెచ్చుకుంటాడు. అలా శ్రీనివాసుడికి గోవిందా అని పేరు వచ్చింది.
ఇప్పటికీ తిరుపతి కొండలు ఎక్కేవారు గోవిందా.. గోవిందా.. అనుకుంటూ వెళ్తారు. ఇలా అనడం వల్ల శరీరంలో అనుకోకుండానే ఎనర్జీ వస్తుంది. ఇతర ఆలోచనలు రావు. కేవలం భగవాన్ నామ స్మరణమే ఉంటుంది. ఫలితంగా స్వామివారి దర్శనం తొందరగా అవుతుంది అని అంటారు. అంతేకాకుండా గోవిందా అని పిలిస్తే శ్రీనివాసుడికి వినిపిస్తుందని కొందరు భక్తులు నమ్ముతారు. ఇలా వెంకటేశ్వరుడికి గోవిందా అనే పేరు వచ్చింది.