Clouds: మేఘాలు ఎంత బరువు ఉంటాయి.. వాటిని ఎలా లెక్కిస్తారో తెలుసా?

Clouds: మనం ఆకాశం వైపు చూస్తే మేఘాలు ఎంతో చూడముచ్చటగా ఉంటాయి. కొన్నిసార్లు మేఘం ఒకచోట నుంచి మరొక చోటుకు తేలికగా కదులుతూ ఉంటుంది. అయితే చిన్నప్పుడు ప్రతి ఒక్కరికి ఒక సందేహం కలుగుతుంది మేఘాలు ఎలా ఏర్పడతాయి అనే సందేహం ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. ఈ క్రమంలోనే నీరు ఆవిరి రూపంలో పైకి వెళ్ళటం వల్ల మేఘాలు ఏర్పడతాయనే విషయం మనందరికీ తెలిసిందే. ఇలా నీటిని వాయురూపంలో మేఘాలు నిల్వ చేసుకుని ఉంటాయి. అయితే మీకెప్పుడైనా […]

Written By: Navya, Updated On : January 11, 2022 6:45 pm

Clouds

Follow us on

Clouds: మనం ఆకాశం వైపు చూస్తే మేఘాలు ఎంతో చూడముచ్చటగా ఉంటాయి. కొన్నిసార్లు మేఘం ఒకచోట నుంచి మరొక చోటుకు తేలికగా కదులుతూ ఉంటుంది. అయితే చిన్నప్పుడు ప్రతి ఒక్కరికి ఒక సందేహం కలుగుతుంది మేఘాలు ఎలా ఏర్పడతాయి అనే సందేహం ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. ఈ క్రమంలోనే నీరు ఆవిరి రూపంలో పైకి వెళ్ళటం వల్ల మేఘాలు ఏర్పడతాయనే విషయం మనందరికీ తెలిసిందే. ఇలా నీటిని వాయురూపంలో మేఘాలు నిల్వ చేసుకుని ఉంటాయి. అయితే మీకెప్పుడైనా మేఘాలు ఎందుకు కిందకు పడవు? మేఘాలు బరువుని ఎలా కొలుస్తారు అనే సందేహాలు ఎప్పుడైనా కలిగాయా? మరి మేఘాల బరువుని ఎలా కొలవవచ్చు అవి ఎందుకు కిందకు పడవు అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం…

మేఘాలు మనం చూసినప్పుడు ఒకచోట నుంచి మరొక చోటుకు తేలికగా ప్రయాణిస్తూ ఉండటం వల్ల మేఘాలకు బరువు ఉండదని మనం భావిస్తాము. కానీ మేఘాలు కూడా టన్నులకొద్దీ బరువు ఉంటాయి. ఒక మేఘం కొన్ని వేల కిలోల బరువు ఉంటుందని నిపుణులు తెలియజేస్తున్నారు. ఇక ఒక మేఘం బరువును కనుక్కోవాలంటే శాటిలైట్ టెక్నాలజీ ద్వారా మేఘాల బరువును తెలుసుకోవచ్చు. సాంద్రత ప్రకారం ఒక మేఘం బరువును అంచనా వేయడానికి ఉపగ్రహం రాడార్ పరికరాలు కొన్ని తరంగాలను మేఘాలలోకి పంపి ఆ మేఘం బరువును తెలుసుకోవచ్చు.

ఇక మేఘాలు ఎందుకు కిందకు పడవు అనే విషయానికి వస్తే… నీటి బిందువులు చాలా తక్కువ సాంద్రత కలిగి ఉంటాయి కనుక వేడి గాలులు ఆ నీటి బిందువులను ఎంతో సులభంగా పైకి పంపించగలవు.ఉదాహరణకు మనం ఏదైనా వేడి పదార్థాలపై ఒక ప్లేట్ మూసినప్పుడు అందులోనుంచి వెలువడే ఆవిరి బిందువుల రూపంలో ప్లేట్ పైభాగాన అతుక్కొని ఉంటుంది. చుక్కలు పెద్దవిగా లేనంత వరకు అవి పైననే అత్తుకొని వేలాడుతూ ఉంటాయి. అలాగే మేఘాలు కూడా తేలికపాటి సాంద్రత కలిగిన నీటి బిందువులు ఉన్నంతకాలం అవి పైన తేలియాడుతూ ఉంటాయి. ఎప్పుడైతే పెద్దగా ఉన్న బిందువులు వాటిని తాకుతాయో వెంటనే అందులో ఉన్నటువంటి నీరు వర్షం రూపంలో కిందకి వచ్చి ఆ మేఘం కరిగిపోతుంది.