Alcohol Consumption Health Risks: మద్యపానం హానికరమే అయినా.. ప్రతిరోజు మద్యం లేకుండా ఉండని వారు చాలా తక్కువ మందే ఉంటారు. రోజంతా అలసిపోయి రిలాక్స్ కావడానికి కాసింత మద్యం తీసుకుంటే హాయిగా ఉంటుందని కొందరు భావిస్తారు. అయితే మరికొందరు చెబుతున్న ప్రకారం మద్యపానం అలవాటు ఉండటం వల్ల ప్రాణానికి ప్రమాదం.. కానీ కొన్ని సంఘటనలు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఎలాంటి ఆల్కహాల్ అలవాటు లేని వారు.. కాలేయం, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారు. రోజు మద్యం సేవించేవారు ఆరోగ్యంగా ఉంటున్నారు అని కొందరు చెబుతూ ఉంటారు. వీరిలో తేడా ఎందుకు ఉంటుందని కొందరు ప్రశ్నించగా.. నిపుణులు ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. అదేంటంటే?
Also Read: జీవితం నాశనానికి ఇదే కారణం..
ప్రతిరోజు మితంగా మద్యం తీసుకుంటే ఎలాంటి ప్రమాదం లేదని కొందరు వైద్యులు చెప్పారు. కానీ ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం రోజుకు రెండు పెగ్గులు, మద్యం తీసుకున్నా.. హానికరమైనదే అని తేల్చింది. దీంతో చాలావరకు మద్యం కి దూరంగా ఉండటమే మంచిదని కొందరు ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే ప్రతిరోజు కాస్త మద్యం లేకపోతే మనసు ఆందోళనగా ఉండేవారు ఎంతోమంది ఉన్నారు. అంతేకాకుండా కొందరు మహిళలు సైతం ప్రతిరోజూ మద్యం తీసుకునేవారు లేకపోలేదు. ఇలాంటి వారు మాత్రం తప్పని పరిస్థితుల్లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం లిమిట్ లో ఆల్కహాల్ తీసుకుంటే ఎలాంటి ప్రమాదం ఉండదని అంటున్నారు.
అసలు లిమిట్ అంటే మద్యం ఎంత తీసుకోవాలి? ఏ విధంగా తీసుకోవాలి? తప్పనిసరిగా మద్యం కావాలని కోరుకునేవారు ప్రతిరోజు కేవలం రెండు పెగ్గులు.. అంటే ఒక పెగ్గు 45ml.. ఇలా మొత్తం 90 ఎంఎల్ మద్యం తీసుకుంటే ఎలాంటి ప్రమాదం ఉండదు. ఇక ఆడవారు కూడా తీసుకునే వారు ఉంటే వారు కేవలం 45 ఎంఎల్ మద్యం తీసుకోవడమే ఉత్తమం. అయితే సాధ్యమైనంతవరకు మద్యానికి దూరంగా ఉండడమే మంచిది. కానీ కొందరు ఇప్పటికే దీనికి బానిస అయిన వారు ఒక్కసారి మానుకోలేరు. అయితే దీని నుంచి బయటపడడానికి ఇలా క్రమ పద్ధతిలో రోజు కేవలం 90 ఎం.ఎల్ మద్యం తీసుకుంటే ఎలాంటి ప్రమాదం ఉండదు. అలాకాకుండా అతిగా తాగితే మాత్రం కచ్చితంగా కాలయ్య ప్రమాదం ఉండి ఉంటుంది.
Also Read: కొలెస్ట్రాల్ పెరగడానికి ఇలాంటి పనులే కారణం..
ఇక కొందరు మద్యం తీసుకోకుండా కూడా అనేక అనారోగ్యాల పాలవుతున్నారని ప్రశ్నిస్తున్నారు. అంటే మద్యం తీసుకుంటే వ్యాధులు రావని.. తీసుకోకుంటే వస్తాయని నిర్ధారణ ఎక్కడా లేదు. అయితే మద్యం తీసుకుంటే తాత్కాలికంగా ఉపశమనం పొందుతారు. కానీ దీర్ఘకాలికంగా మాత్రం అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందువల్ల ముందు నుంచే దీనిని కంట్రోల్ చేయడం వల్ల ఎన్నో రకాలుగా ఉపయోగాలు ఉన్నాయి. మరి ముఖ్యంగా మహిళలు మద్యం తీసుకోవాలని చూస్తే జాగ్రత్తలు తీసుకోవాలి. తక్కువ మొత్తంలో మద్యం తీసుకుంటే ఎలాంటి ప్రమాదం ఉండదు. కానీ ఎక్కువ మద్యం తీసుకుంటే మాత్రం అనారోగ్యాలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.