Mukesh Ambani House Electricity Bill
Mukesh Ambani : ప్రపంచంలోని అత్యంత ధనవంతులలో ఒకరైన ముఖేష్ అంబానీ గురించి ఎవరికి తెలియదు. కానీ ముఖేష్ అంబానీ గురించి మాట్లాడినప్పుడల్లా.. ఆయన ఇల్లు యాంటిలియా గురించి ఖచ్చితంగా చర్చకు వస్తుంది. ఎందుకంటే యాంటిలియా చూడటానికి అందంగా ఉండటమే కాకుండా, అనేక సౌకర్యాలతో కూడి ఉంది. కానీ ప్రశ్న ఏమిటంటే.. ముఖేష్ అంబానీ నివసించే యాంటిలియాలో ప్రతి నెలా ఎంత విద్యుత్ వినియోగిస్తారు. ఈ రోజు దాని గురించి వివరంగా తెలుసుకుందాం.
ఆసియాలోనే అత్యంత ధనవంతుడు ముఖేష్ అంబానీ
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ భారతదేశంలో అత్యంత ధనవంతుడు. జనవరి 4, 2025న విడుదలైన ఫోర్బ్స్ నివేదిక ప్రకారం.. ముఖేష్ అంబానీ మొత్తం సంపద 96.6 బిలియన్ డాలర్లు. దీనితో అతను ప్రపంచంలోని 18వ ధనవంతుడు అయ్యాడు.
ముఖేష్ అంబానీ ఇల్లు యాంటిలియా
ముఖేష్ అంబానీ ఇల్లు యాంటిలియా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇళ్లలో ఒకటి. కానీ ఈ ఇంట్లో ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయో తెలుసా. ఈ 27 అంతస్తుల యాంటిలియా భవనంలో జిమ్, స్పా, థియేటర్, టెర్రస్ గార్డెన్, స్విమ్మింగ్ పూల్ నుండి ఆలయం, ఆరోగ్య సంరక్షణ వరకు ప్రతిదీ ఉంది. ఇది కాకుండా.. 150 కంటే ఎక్కువ కార్లను పార్కింగ్ చేయడానికి స్థలం కూడా ఉంది. ఇది కాకుండా ఒక టెర్రస్ గార్డెన్, 3 హెలిప్యాడ్‌లు ఉన్నాయి. పై 6 అంతస్తులు అంబానీ కుటుంబం నివసించే ప్రైవేట్ నివాస భవనాలు.
అంబానీ కుటుంబం ఈ పనిని 2006 సంవత్సరంలో 1.120 ఎకరాల విస్తీర్ణంలో ప్రారంభించి 2010 లో పూర్తయింది. దీని నిర్మాణానికి దాదాపు 6000 కోట్లు ఖర్చు చేశారు. ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదిక ప్రకారం.. ఈ భూమిని ముఖేష్ అంబానీకి చెందిన యాంటిలియా కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్ 2002లో 2.5 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది.
కరెంటు బిల్లు ఎంత?
అంత ఖరీదైన భవనం కూడా చాలా విద్యుత్తును వినియోగిస్తుందని అనుకోవచ్చు. అవును, ఈ భవనం ప్రతి నెలా చాలా విద్యుత్తును వినియోగిస్తుంది. డీఎన్ఏ వెబ్ టీం నివేదికల ప్రకారం.. ముఖేష్ అంబానీ ఇంట్లో ప్రతి నెలా దాదాపు 6,37,240 యూనిట్ల విద్యుత్ వినియోగిస్తారు. వారి సగటు విద్యుత్ బిల్లు దాదాపు రూ. 70 లక్షలు. అయితే, ఈ సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇంత డబ్బు పెట్టి మంచి లగ్జరీ కారు కొనుక్కోవచ్చని ఆలోచిస్తున్నారు కదూ.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: How many units of electricity does mukesh ambanis house consume every month
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com