Sesame And Jaggery Benefits: నువ్వుల్లో ఎంతో బలం ఉంటుంది. ఇందులో కాల్షియం బాగుంటుంది. మాంసాహారాలతో పోలిస్తే నువ్వుల్లో బలం ఎక్కువ ఉంటుంది దీని వల్ల వీటిని తీసుకోవడం మంచిదే. నువ్వులు బెల్లం కలిపి ముద్దలుగా చేసుకుని తినడం వల్ల రక్తహీనత పోతుంది. ఇలా నువ్వులతో మనకు ఎన్నో లాభాలున్నాయి. ధాన్యాలలో నువ్వులు ఎంతో ప్రయోజనం కలిగిస్తాయి. నువ్వులు బెల్లంతో కలిపి ముద్దలుగా చేసుకుని తినడం వల్ల మలబద్ధకం సమస్య నుంచి కూడా దూరం చేసుకోవచ్చు.
నల్ల, తెల్ల నువ్వులు
నువ్వుల్ల రెండు రకాలు ఉంటాయి. నల్ల నువ్వులు, తెల్ల నువ్వులు ఉంటాయి. తెల్ల నువ్వులను మనం తినడానికి ఉపయోగించుకుంటాం. నల్ల నువ్వులను పూజల్లో వాడతారు. ఇలా తెల్ల నువ్వులతో మనం బెల్లం కలిపి ముద్దలు కట్టుకుని తినడం వల్ల మనకు ఎన్నో లాభాలు కలుగుతాయి. బెల్లంలో పొటాషియం, సోడియం, ఐరన్ లభిస్తాయి. నువ్వులు బెల్లం కలుపుకుని తింటే మన ఆరోగ్యానికి చాలా మంచిది.
గుండె జబ్బులకు..
నువ్వులు బెల్లం కలిపి తీసుకోవడం ద్వారా శరీరంలో వేడి పుట్టిస్తుంది. వేయించిన నువ్వులు, బెల్లం కలిపి తింటే గుండె ఆరోగ్యం బాగుంటుంది. నువ్వులు, బెల్లం కలయికలో మన ఆరోగ్యం మెరుగుపడేందుకు పరోక్షంగా కారణమవుతుంది. ఇలా రోజువారీ ఆహారంలో వీటిని చేర్చుకోవడం వల్ల లాభాలుంటాయి. ఈ నేపథ్యంలో వీటిని తినడం వల్ల మన రోగనిరోధక వ్యవస్థ బాగుంటుంది.
రక్తహీనత
రక్తహీనత ఉన్న వారికి కూడా ఇది మంచి ఆహారం. రోజు ఒక చెంచా నువ్వులు, బెల్లం కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో ఐరన్ లోపం తగ్గుతుంది. స్త్రీలలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. అందుకే వారు తప్పనిసరిగా ఇది తీసుకుంటే మేలు కలుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బరువు నియంత్రణలో ఉంచడంలో కూడా ఇది దోహదపడుతుంది.