Apple Benefits: మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. మనం తీసుకునే ఆహారమే మనకు రక్షగా నిలబడుతుంది. ప్రతి రోజు మనం తీసుకునే ఆహారంతోనే మనకు శక్తి కలుగుతుంది. ఈ రోజుల్లో మనం ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోకుండా ఉండటంతో రోగాలు చుట్టుముడుతున్నాయి. ఫలితంగా చిన్న వయసులోనే మధుమేహం, రక్తపోటు లాంటి రోగాలు దరిచేరుతున్నాయి. ఈ నేపథ్యంలో పండ్లు మనకు ఎన్నో రకాల విటమిన్లు, ప్రొటీన్లు, మినరల్స్ అందిస్తాయి. ఇందులో ఆపిల్ ప్రధానమైనది.

ఆపిల్ లో పోషకాలు ఎన్నో రకాల ప్రయోజనాలు కలిగిస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల శరీరం హెల్దీగా మారుతుంది. ఆపిల్ లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది. ఆపిల్ లో యాంటీ ఆక్సిడెంట్లు, పాలీపెనాల్స్ ఉన్నాయి. వీటిని బాగా కడిగి తొక్కతో తింటేనే లాభాలుంటాయి. చలికాలంలో ఆపిల్ పండ్లు తినడంతో ఎన్నో విధాలుగా ప్రయోజనాలు ఉన్నాయని తెలుసుకోవాలి. దీంతో ఆపిల్ తినడం వల్ల మన శరీరానికి పలు రకాల మేలు కలుగుతుది.
ఆపిల్ లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండటంతో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. దీంతో జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఫైబర్ తో పేగుల నుంచి నీటిని గ్రహిస్తుంది. జీర్ణక్రియ బాగుంటుంది. ఫలితంగా మలవిసర్జన సుఖంగా జరుగుతుంది. మలబద్ధకం సమస్య లేకుండా చేస్తుంది. ఆపిల్ లో ఉండే మాలిక్ యాసిడ్ తో మనం తిన్న ఆహారం త్వరగా అరుగుతుంది. ఆపిల్ లు తీసుకుని మన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుందని తెలుసుకోవాలి.

బరువు తగ్గేందుకు కూడా ఆపిల్ దోహదం చేస్తుంది. దీన్ని తరచుగా తినడం వల్ల కడుపు నిండుగా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. త్వరగా ఆకలి వేయదు. ఆరోగ్యానికి హాని చేసే జంక్ ఫుడ్స్ కు బదులు ఆపిల్ ను తీసుకుంటే మేలు కలుగుతుంది. ఆపిల్ లో ఉండే రసాయనాలతో కొవ్వును తగ్గిస్తుంది. బరువు తగ్గడానికి కారణమవుతుంది. మధుమేహాన్ని నియంత్రిస్తుంది. ఆపిల్ తినడం వల్ల డయాబెటిస్ అదుపులో ఉంటుంది. రక్త ప్రవాహంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తుంది. ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతుంది. గ్లూకోజ్ ను తగ్గిస్తుంది.
ఆపిల్ లో పాలీపెనాల్స్, పెక్టివ్ ఎక్కువ మొత్తంలో ుంటాయి. గుండె జబ్బుల ముప్పును కూడా తగ్గిస్తాయి. కణాల్లో లిపిడ్, ఆక్సీకరణను నివారించడానికి సాయపడతాయి రక్తపోటును తగ్గిస్తాయి. గుండె జబ్బులు రాకుండా నివారిస్తుంది. అందుకే రోజువారీ ఆహారంలో ఆపిల్ ను తీసుకోవడం ఉత్తమం.