https://oktelugu.com/

Credit Score: క్రెడిట్ స్కోరు ఎలా దెబ్బతింటుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

చేతిలో డబ్బులు లేకున్నా క్రెడిట్ కార్డుపై వస్తువులను కొనుగోలు చేయవచ్చు. వీటికి సంబంధించిన బిల్ జనరేట్ అయిన తరువాత 20 రోజుల్లో చెల్లించాలి.

Written By:
  • Srinivas
  • , Updated On : September 6, 2023 6:14 pm
    Credit Score

    Credit Score

    Follow us on

    Credit Score: ఒకప్పుడు Credit Card కొంత మంది వద్ద మాత్రమే కనిపించేది. భారీగా నగదు వ్యవహారాలు నడిపే వారికి మాత్రమే క్రెడిట్ కార్డులు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు సామాన్యులు సైతం క్రెడిట్ కార్డులు కలిగి ఉంటున్నారు. అవసరానికి వడ్డీ లేకుండా అప్పుఇచ్చే విధంగా క్రెడిట్ కార్డులు ఎంతో ఉపయోగపడుతున్నారు. వస్తువుల కొనుగోలుకు ఇది మంచి అప్షన్ అని చాలా మంది ఒకటికి మించి క్రెడిట్ కార్డులు తీసుకుంటున్నారు. అయితే బ్యాంకులు క్రెడిట్ కార్డును ఇచ్చేముందు వారి నగదు వ్యవహారాలు ఎలా ఉన్నాయిని చూస్తారు. అంతేకాకుండా కార్డు జారీ చేసిన తరువాత కూడా సక్రమంగా వినియోగస్తున్నారా? లేదా? అని పరిశీలిస్తున్నారు. వీటి వాడకంలో నిర్లక్ష్యం చేస్తే క్రెడిట్ స్కోరు దెబ్బతింటుంది. దీంతో బ్యాంకు నుంచి వచ్చే ఆఫర్లు పరమితం కాగా.. భారీగా వడ్డీని విధించే అవకాశం ఉంది. మరి క్రెడిట్ స్కోర్ దెబ్బతినకుండా ఉండాలంటే ఏం చేయాలి?

    చేతిలో డబ్బులు లేకున్నా క్రెడిట్ కార్డుపై వస్తువులను కొనుగోలు చేయవచ్చు. వీటికి సంబంధించిన బిల్ జనరేట్ అయిన తరువాత 20 రోజుల్లో చెల్లించాలి. ఈ సమయంలో బిల్లు చెల్లించేందుకు డబ్బును ఏర్పాటు చేసుకోవాలి. కానీ కొందరు నిర్ణీత గడువు వచ్చే దాకా వెయిట్ చేస్తారు. చివరి నిమిషంలో డబ్బు దొరకకపోవడంతో గడువులోగా చెల్లించలేకపోతారు. ఇలా చెల్లించలేకపోవడంతో భారీగా ఫైన్ తో పాటు వడ్డీ పడుతుంది. అంతేకాకుండా సిబిల్ స్కోరు తగ్గుతుంది. రెగ్యులర్ గా క్రెడిట్ కార్డు బిల్లును సక్రమంగా చెల్లిస్తున్నారా? లేదా? అని బ్యాంకులు పసిగట్టి క్రెడిట్ స్కోరును నిర్ణయిస్తాయి.

    కొందరు బిల్లు రాగానే కనీస మొత్తాన్ని చెల్లించాలనుకుంటారు. కానీ మిగిలిని మొత్తాన్ని గడువులోగా చెల్లించాలి. అలా మరిచిపోతే రెండు రకాలుగా వడ్డీని విధిస్తారు. క్రెడిట్ కార్డు ద్వారా ఈ మధ్య చాలా మందికి రుణాలు ఇస్తున్నారు. వీటికి సంబంధించిన ఈఎంఐలు సక్రమంగా చెల్లించాలి. ఒక్క నెల చెల్లించకపోయినా వీటి ప్రభావం క్రెడిట్ స్కోరుపై పడుతుంది. రెగ్యులర్ గా ఈఎంఐలు చెల్లించడం ద్వారా క్రెడిట్ స్కోరు మరింతగా పెరిగి మరో లోన్ కు ఎల్జిబుల్ అవుతారు.

    క్రెడిట్ కార్డుపై 30 శాతం మాత్రమే వినియోగించుకోవాలన్న నిబంధన ఉంటుంది. కానీ ఒక్కోసారి 90 శాతం వినియోగిస్తారు. అయితే ఇది పదే పదే అయితే మాత్రం క్రెడిట్ స్కోరు తగ్గే అవకాశం ఉంది. ఇలా డబ్బు ఎక్కువగా అవసరం ఉన్నప్పుడు లిమిట్ పెంచాలని బ్యాంకును లేదా కస్టమర్ కేర్ ను సంప్రదించాలి. అయితే మరో క్రెడిట్ కార్డును పొంది రెండు కార్డుల ద్వారా 30 శాతం లోపు మాత్రమే వినియోంచుకోవడం శ్రేయస్కరం.