OG Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం లో రూపొందుతున్న హై వోల్టేజ్ గ్యాంగ్ స్టర్ డ్రామా ఓజీ. ఈ చిత్రం కి సంబందించిన ఫస్ట్ గ్లింప్స్ వీడియో ను ఈ మధ్యనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్ విడుదల చేశారు. ఈ వీడియో ఆడియెన్స్ ను, ఫ్యాన్స్ ను విశేషం గా ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ చిన్ని వీడియో సోషల్ మీడియా లో సెన్సేషన్ క్రియేట్ చేసింది.
ఇప్పటికీ ఈ టీజర్ గురించి నెట్టింట్లో చర్చలు జరుగుతునే ఉన్నాయి. ఈ టీజర్ కి సంబంధించిన అనేక విషయాల గురించి ఫ్యాన్స్ చర్చిస్తున్నారు. అయితే ఈ టీజర్ లో పవన్ కళ్యాణ్ మాత్రమే కాకుండా మరో ఇద్దరు సినీ స్టార్స్ కూడా కనిపించారు. వారిద్దరిని చూసి ప్రేక్షకులు అలానే పవన్ అభిమానులు చాలా ఆనందించారు. ఇంతకీ ఆ ఇద్దరు ఎవరు అంటే.. వారిలో ఒకరు బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మి కాగా మరొకరు ప్రముఖ నటి శ్రియ రెడ్డి.
ఇమ్రాన్ హస్మి ఈ మూవీలో విలన్ గా చేస్తున్నట్టు తెలుస్తోంది. మరొకరు కోలీవుడ్ నటి శ్రియారెడ్డి ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం. బాలీవుడ్ లో ఇమ్రాన్ హస్మికి రొమాంటిక్ హీరోగా మంచి పేరు ఉంది. ఇక శ్రియా రెడ్డి ఆల్రెడీ మనకు విశాల్ పొగరు సినిమాతో పరిచయస్తురాలే. అలాంటి వీరిద్దరూ పవన్ కళ్యాణ్ సినిమాలో కనిపించడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు.
మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం లో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, ఇమ్రాన్ హష్మీ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ కానున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.