Minister Balakrishna: తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు, లోకేష్ తర్వాత ఎవరూ అంటే.. తప్పకుండా బాలకృష్ణ అని సమాధానం వస్తుంది. ప్రస్తుతం నందమూరి కుటుంబం నుంచి రాజకీయంగా యాక్టివ్ గా ఉన్నది ఆయనే. ఒక విధంగా చెప్పాలంటే పదవులు ఆశించకుండా పార్టీలో ఉంటూ వస్తున్నారు బాలయ్య. నందమూరి కుటుంబాన్ని జనాలు గుర్తించుకునే విధంగా ఉండడం కోసమే ఆయన ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వరుసగా హిందూపురం నుంచి మూడుసార్లు గెలిచారు. 2019 జగన్ ప్రభంజనంలో సైతం గట్టిగానే నిలబడ్డారు బాలకృష్ణ. అందుకే 2024 ఎన్నికల్లో గెలిచేసరికి ఆయనకు మంత్రి పదవి దక్కుతుందని భావించారు. కానీ ఒకవైపు సీఎం గా చంద్రబాబు ఉండగా.. లోకేష్ మంత్రిగా ఉన్నారు. సమీకరణల దృష్ట్యా బాలకృష్ణకు చాన్స్ లేదు. అలాగని తనకు మంత్రి పదవి కావాలని బాలకృష్ణ ఎన్నడూ కోరలేదు. కనీసం ఒక్క పని కోసం గురించి కానీ.. పదవి కోసం కానీ పట్టుబట్టే గుణం కాదు నందమూరి బాలకృష్ణ ది. అయితే ఇటీవల జరిగిన పరిణామాల క్రమంలో నందమూరి బాలకృష్ణ మంత్రిగా చూడాలనుకుంటున్నారు అభిమానులు. అందుకే తమ మనసులో ఉన్న మాటను బయట పెడుతున్నారు. తాజాగా హిందూపురంలో సైతం అభిమానులు ఇదే డిమాండ్ చేశారు. కానీ బాలకృష్ణ మాత్రం సున్నితంగా స్పందించారు.
వరుసగా మూడుసార్లు..
2014లో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేశారు నందమూరి బాలకృష్ణ. అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. ఆ నియోజకవర్గంలో నందమూరి తారక రామారావు, అటు తరువాత నందమూరి హరికృష్ణ ప్రాతినిధ్యం వహించిన పరిస్థితి ఉంది. అక్కడ నందమూరి కుటుంబానికి ప్రత్యేక అభిమానులు ఉన్నారు. అందుకే బాలకృష్ణ ఆ నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. 2014లో నందమూరి బాలకృష్ణ గెలవడం.. టిడిపి అధికారంలోకి రావడంతో తప్పకుండా మంత్రి పదవి లభిస్తుందని అంచనా వేశారు. కానీ తనకు రాజకీయాల కంటే సినిమాలే మొదటి ప్రయారిటీ అన్నట్టు బాలకృష్ణ వ్యవహరించారు. పైగా నారా లోకేష్ అప్పుడే మంత్రి అయ్యారు. ఒకే కుటుంబంలో మూడు పదవులు సరికాదని భావించి బాలకృష్ణ కూడా మంత్రి పదవి కోసం డిమాండ్ చేయలేదు. ఒక విధంగా చెప్పాలంటే లోకేష్ రాజకీయ ఎదుగుదల కోసమే బాలకృష్ణ వెనక్కి తగ్గారన్న టాక్ అప్పట్లో ఉండేది. ఇప్పుడు కూడా బాలకృష్ణ పార్టీ కోసం ఉన్నారే తప్ప పదవుల కోసం కాదన్నట్టు ఉంటారు.
పార్టీ కోసం బాలయ్య..
సినీ పరిశ్రమలో మెగా కుటుంబం వర్సెస్ నందమూరి కుటుంబం అన్నట్టు ఉండేది. అభిమానుల మధ్య వైరుధ్యం ఉండేది. ఈ క్రమంలో 2024 ఎన్నికల్లో పవన్ నేతృత్వంలోని జనసేన కీలకపాత్ర పోషించింది. పవన్ టిడిపి తో కలిసి పని చేశారు. కష్టకాలంలో కూడా చంద్రబాబు కుటుంబానికి అండగా నిలిచారు. టిడిపి కూటమి అధికారంలోకి రావడంతో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు. అయితే పవన్ కళ్యాణ్ కంటే చిత్ర పరిశ్రమలో బాలకృష్ణ సీనియర్. రాజకీయంగా కూడా ఒకరకంగా సీనియర్. అయితే అదే సమయంలో పవన్ పట్ల గౌరవభావంతో ఉన్నారు బాలకృష్ణ. కానీ బాలకృష్ణ అభిమానులు మాత్రం ఆయనను మంత్రి పదవిలో చూడాలనుకుంటున్నారు. ఒక అడుగు ముందుకేసి పవన్ కళ్యాణ్ కు మంత్రి ఇచ్చారు.. తమ అభిమాన నాయకుడికి ఎందుకు ఇవ్వరన్న ప్రశ్న కూడా వినిపించింది. కానీ పదవి కోసం ఎన్నడు బాలకృష్ణ రియాక్ట్ కాలేదు. పార్టీ కోసం ఆయన పని చేస్తూ వచ్చారు. సింహభాగం సినిమాలకు కేటాయిస్తూ.. హిందూపురం శాసనసభ్యుడిగా కొనసాగుతున్నారు.
బాలకృష్ణ అడ్డగింత..
తాజాగా తన సొంత నియోజకవర్గం హిందూపురంలో పర్యటించారు నందమూరి బాలకృష్ణ. సోమవారం ఉదయం బాలయ్య స్థానికులతో ముచ్చటించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో ఓ పాఠశాలలో విద్యార్థులను కలిసేందుకు బాలయ్య కారులో వెళ్తుండగా కొంతమంది అభిమానులు రోడ్డుకు అడ్డంగా నిల్చున్నారు. బాలయ్యను మంత్రిగా చూడాలని ఉందంటూ ప్లకార్డులను ప్రదర్శించారు. వారిని చూసి కారు దిగిన బాలయ్య ఏది మాట్లాడకుండా నవ్వుతూ సముదాయించే ప్రయత్నం చేయబోయారు. దేనికైనా సమయం వస్తుందని కార్యకర్తలకు నచ్చజెప్పి అందరికీ. అనంతరం అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
హిందూపురం వచ్చిన ఎమ్మెల్యే బాలకృష్ణ కాన్వాయ్ ఎదుట బాలకృష్ణకు మంత్రి పదవి ఇవ్వాలని ప్లకార్డులతో అభిమానుల ఆందోళన
అభిమానుల డిమాండ్ విని నవ్వుతూ వెళ్లిపోయిన బాలకృష్ణ#NandamuriBalakrishna #Balakrishna #Hindupur #Balayya #Akhanda2Thaandavam #Tupaki pic.twitter.com/COSzWEvXu9
— Tupaki (@tupaki_official) October 13, 2025