Horoscope Today: వజ్ర యోగం కారణంగా ఈ రాశి వారికి అన్ని విజయాలే..

కుటుంబ సభ్యులను తొందరపడి మాటలను అనొద్దు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. విద్యార్థులకు ఆటంకాలు తొలగిపోతాయి. ఆర్థికంగా పుంజుకుంటారు. భవిష్యత్ కు సంబంధించి కొత్త ప్రణాళికలు వేస్తారు. కొన్ని విషయాల్లో చాలా ఓపిక అవసరం. పెండింగు పనులు పూర్తి చేస్తారు.

Written By: Srinivas, Updated On : July 8, 2024 8:09 am

Horoscope Today

Follow us on

Horoscope Today: 2024 జూలై 8 సోమవారం రోజున ద్వాదశ రాశులపై పుష్య నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు సింహ రాశిలో సంచారం చేయనున్నాడు. సోమవారం వజ్ర యోగం కారణంగా కొన్ని రాశుల వారికి అన్నిటా విజయమే వరిస్తుంది. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల వాతావరణం ఉంటుంది.

మేష రాశి:
ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామితో ఎక్కువగా వాదనలు చేయొద్దు. ఉద్యోగులు మానసికంగా ఆందోలనతో ఉంటారు. తోటివారితో సంయమనం పాటించాలి.

వృషభ రాశి:
కొన్ని పనుల నిమిత్తం బిజీగా ఉంటారు. వ్యాపారులు శుభవార్తలు వింటారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి.

మిథున రాశి:
వ్యాపారులు బిజీగా ఉంటారు. ఆర్థిక పరిస్థితి గురించి ఆందోళన చెందతారు. విలువైన వస్తువులను జాగ్రత్తగా ఉంచుకోవాలి.అనవసర ఖర్చులకు దూరంగా ఉండాలి.

కర్కాటక రాశి:
కుటుంబ సభ్యులను తొందరపడి మాటలను అనొద్దు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. విద్యార్థులకు ఆటంకాలు తొలగిపోతాయి.

సింహారాశి:
ఆరోగ్యం విషయంలో కేర్ తీసుకోవాలి. నాణ్యమైన ఆహారం తీసుకోవాలి. మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారులకు కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది.

కన్య రాశి:
కొన్ని శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధన లాభం ఉంటుంది. సాయంత్రం స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. కొన్ని పరిస్థితులతో ప్రతికూల వాతావరణం ఉంటుంది.

తుల రాశి:
వ్యాపారులు కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. జీవిత భాగస్వామి నుంచి ప్రత్యేక మద్దతు ఉంటుంది. సాయంత్రం ఉల్లాసంగా ఉంటారు.

వృశ్చిక రాశి:
ఆర్థికంగా పుంజుకుంటారు. భవిష్యత్ కు సంబంధించి కొత్త ప్రణాళికలు వేస్తారు. కొన్ని విషయాల్లో చాలా ఓపిక అవసరం. పెండింగు పనులు పూర్తి చేస్తారు.

ధనస్సు రాశి:
అదనపు ఖర్చులు ఉంటాయి. లావాదేవీలపై జాగ్రత్తగా ఉండాలి. కోర్టు కేసు ఉంటే ఈరోజుతో ముగుస్తుంది. ఇంటి వస్తువుల కోసం డబ్బు ఖర్చు చేస్తారు.

మకర రాశి:
విహార యాత్రలకు వెళ్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధమైతే వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. వివాహానికి సంబంధించిన శుభవార్త వింటారు.

కుంభరాశి:
జీవిత భాగస్వామి ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఆర్థిక వ్యవహారాల్లో ఇతరుల సలహాలు తీసుకోవాలి. కొత్త పెట్టుబుడులు పెడుతారు. పెద్దలతో సమయం గడుపుతారు.

మీనరాశి:
మానసికంగా ధృఢంగా ఉంటారు. తల్లిదండ్రులకు సహాయంగా ఉంటారు. వ్యాపారులకు అనుకోని లాభాలు ఉంటాయి. అనుకోని ప్రయాణాలు ఉంటాయి.