https://oktelugu.com/

Hide The Onion Bags: ఉల్లిగడ్డ సంచులను దాచుకోండి.. మీరు కోటీశ్వరులు అయిపోతారిలా.. వైరల్ వీడియో

మగవాళ్లు సాధారణంగా షర్టుతో పాటు ప్యాంటు కూడా ధరిస్తుంటారు. కానీ అన్నీ ప్యాంట్లు ఒకేలా ఉండవు. ఈ ట్రూజర్ క్లాత్ లో తేడా ఉంటుంది. కొందరు జీన్స్ ధరిస్తారు. మరికొందరు సాధారణ క్లాత్ తో తయారు చేసిన ప్యాంట్ వేసుకుంటారు. యువకుల నుంచి బిగ్ షాట్ వరకు ఒకే మోడల్ లో ఉన్న ప్యాంట్ ధరించినా వీటి ధర ఇంచు మించు రూ.10 వేల వరకు ఉంటుంది.

Written By:
  • Srinivas
  • , Updated On : December 3, 2024 / 02:50 PM IST

    fabric pant wiral

    Follow us on

    Hide The Onion Bags: మగవాళ్లు సాధారణంగా షర్టుతో పాటు ప్యాంటు కూడా ధరిస్తుంటారు. కానీ అన్నీ ప్యాంట్లు ఒకేలా ఉండవు. ఈ ట్రూజర్ క్లాత్ లో తేడా ఉంటుంది. కొందరు జీన్స్ ధరిస్తారు. మరికొందరు సాధారణ క్లాత్ తో తయారు చేసిన ప్యాంట్ వేసుకుంటారు. యువకుల నుంచి బిగ్ షాట్ వరకు ఒకే మోడల్ లో ఉన్న ప్యాంట్ ధరించినా వీటి ధర ఇంచు మించు రూ.10 వేల వరకు ఉంటుంది. కానీ ఓ ప్యాంటు ధర రూ.60 వేల ధర పలుకుతుంది. అయితే ఈ ప్యాంట్ సాధారణ క్లాత్ తో తయారు చేసిందా? అంటే అలా కాదు. డిఫరెంట్ క్లాత్ తో తయారు చేశారు. ఇంతకీ ఈ ప్యాంట్ కు రూ.60 వేలు ఎందుకు పలుకుతోంది? దీనిని ఎటువంటి క్లాత్ తో తయారు చేశారో తెలిస్తే షాక్ అవుతారు.. ఆ వివరాల్లోకి వెళితే..

    ప్రపంచ వ్యాప్తంగా మగవాళ్లు ధరించే ప్యాంట్ పాలిస్టర్, జీన్స్, కాటన్ వంటి రకాలైన ప్యాంట్లు ఉంటాయి. కానీ గోనె సంచితో తయారు చేసిన ప్యాంట్ కూడా ఉంటుందని తెలుసా? సాధారణంగా మన దేశాల్లో గోనె సంచిని రకరకాలుగా ఉపయోగిస్తారు. కొందరు ధాన్యం నిల్వ చేయడానికి ఉపయోగిస్తారు. మరికొందరు ఆహార పదార్థాలను సరఫరా చేయడానికి వాడుతారు. గోనె సంచుల తయారీకి దేశంలో అనువైన జనుము కొన్ని ప్రాంతాల్లో పండుతుంది. దీంతో ఈ రకమైన సంచులు ఎక్కువగా వాడుతారు. గోనె సంచులు వాడడం వల్ల కొన్ని ఆహార పదార్థాలు చెడిపోకుండా ఉంటాయి. ఎందుకంటే ఈ సంచిలోకి గాలి ఈజీగా వెళ్తుంది.

    అలాగే గోనె సంచిలో ఉల్లిగడ్డలను సరఫరా చేస్తుంటారు. ఉల్లిగడ్డలు ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే గోనె సంచులను ఎక్కువగా వాడుతూ ఉంటారు. అదే గోనె సంచితో తయారు చేసిన ప్యాంట్ ఎవరైనా వేసుకుంటారా? అంటే ఎవరూ సమాధానం చెప్పరు. కానీ గోనె సంచులతో తయారు చేసిన ఓ ప్యాంట్ ను అమ్మకానికి పెట్టాడు. దానికి రూ.60,000 ధరను పెట్టాడు. ఇంత ధరను పెట్టడంతో అంతా షాక్ అవుతున్నారు. ఈ విషయాన్ని ఓ ఇన్ స్ట్రాగ్రామ్ ఖాతాదారుడు వీడియో రూపంలో ఉంచాడు.

    ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియో 2023 ఫిబ్రవరిలోనే ఈ వీడియో ‘స్వచ్కద్వాహై’ అనే ఇన్ స్ట్రాగ్రామ్ వీడియోలో బయటపెట్టారు. కొన్ని రోజుల పాటు ఈ వీడియో హల్ చల్ చేసింది. అయితే ఇటీవల ఇది మళ్లీ సోషల్ మీడియాను ఊపేస్తుంది. ఈసందర్భంగా కొందరు వీడియోను చూసి ‘ఉల్లిగడ్డ సంచులను దాచుకోండి.. మీరు కోటీశ్వరులు అయిపోతారిలా.. ’ అని కామెంట్ చేస్తున్నారు. ఈ కామెంట్ పై రకరకాలుగా చర్చలు జరుగుతున్నాయి. అయితే ప్రస్తుతం ప్లాస్టిక్ సంచుల వాడకం ఎక్కువైపోతుంది. వీటి స్థానంలో క్లాత్ సంచులు వాడానే ఉద్దేశంతోనే వైరల్ చేస్తున్నారని కొందరు అంటున్నారు. అలాగే గోనె సంచులతో తయారు చేసిన కొత్త రకమైన సంచులను ప్రాచుర్యంలోకి తీసుకురావాలని కోరుతున్నారు. పర్యావరణ సమతుల్యానికి ఇటువంటి సంచులే ఉపయోగపడుతాయని కొందరు కోరుతున్నారు.