Chanakya Niti: జీవితంలో పెళ్లి ఓ మధురానుభూతి. ఈ అవకాశం రావాలంటే అదృష్టం ఉండాలంటారు. కొందరు ఎన్ని పూజలు, వ్రతాలు, నోములు నోచినా వివాహం కాదు. ముదురుబెండకాయలా తయారవుతారు. ఆడపిల్లల జనాభా తగ్గడంతో ఇప్పుడు పురుష పుంగవులకు సరిగ్గా పెళ్లిళ్లు కావడం లేదు. ఇప్పుడు ఇంట్లో యువకుడికి వివాహం చేసుకోబోయే అవకాశం వస్తే దాన్ని ఒక అదృష్టంగా భావించాలని పెద్దలు చెబుతూ ఉంటారు. పెళ్లి చేసుకునే అమ్మాయిలు, అబ్బాయిలూ అప్పటి వరకు వివాహం గురించి ఏవేవో కలలు కంటుంటారు. ముఖ్యంగా అబ్బాయిలైతే తన జీవితంలో కోరుకున్న అమ్మాయి రావాలని అనుకుంటారు. కానీ చాలా మందికి అనుకున్న అమ్మాయి దొరకదు. అయితే పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని చూసేందుకు వెళ్లినప్పుడు మాత్రం చాణక్య నీతి ప్రకారం కొన్ని విషయాలను గ్రహించాలంటున్నారు. తాను చేసుకోబోయే అమ్మాయితో జీవితాంతం సంతోషంగా ఉండాలంటే కొన్ని విషయాలు కచ్చితంగా తెలుసుకోవాలని సూచిస్తున్నారు.

అందం విషయంలో ఆడవాళ్లకు పోటీ ఎవరూ ఉండరు. ప్రతి స్త్రీకి జీవితం రెండు భాగాలు. ఒకటి పెళ్లికి ముందు.. పెళ్లయిన తరువాత.. పెళ్లి కి ముందు ఆడవాళ్లు అందంగా ఉండేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే పైపై అందం కన్నా మనసు అందంగా ఉండే అమ్మాయి దొరికితే తనను చేసుకోబోయే వ్యక్తి జీవితాంతం సంతోషంగా ఉండగలుగుతాడట. అందువల్ల పెళ్లి చూపులకు వెళ్లినప్పుడు పైకి అందంగా ఉందని అనుకోకుండా మనసు ఎంత అందంగా ఉందో తెలుసుకొనగలిగాలి. ఆడవారి మనసు ఎంత అందంగా ఉంటే ఇల్లు అంత అందమైనదిగా కనిపిస్తుంది.
Also Read: AP Employees: సీపీఎస్ ఉద్యోగుల దగ్గర కుప్పిగంతులు కష్టమే?
మధురమైన గొంతు ఆడవారికి మాత్రమే ఉంటుంది. ఆడవాళ్లు ఎంత సరళంగా మాట్లాడితే ఎదుటివారి మనసు అంత ప్రశాంతంగా ఉంటుంది. ఇక చేసుకోబోయే అమ్మాయి వాయిస్ మధురంగా ఉంటే భవిష్యత్తులో మనసు ప్రశాంతంగా ఉండి జీవితం ఆనందమయంగా మారుతుంది. అంతేకాకుండా చాలా కటువుగా మాట్లాడేవారితో నిత్యం పోరు ఉంటుంది. అందువల్ల పెళ్లి చేసుకోబోయే అమ్మాయి మధురంగా మాట్లాడుతుందా..? లేదా..? అనే విషయాన్ని గ్రహించండి.
అమ్మాయికి సాంప్రదాయాలపై ఆసక్తి ఉందా..? లేదా..? అనే విషయాన్ని గ్రహించాలి. మతపరమైన ఆచారాలతో పాటు సంస్కృతి విలువ తెలిస్తే ముందు ముందు ఇల్లు కళకళలాడుతోంది. పండుగలు, శుభకార్యాలల్లో ఆమె సంస్కకృతికి విలువ ఇస్తే ఇల్లు సంతోషంగా ఉంటుంది. ఈ క్రమంలో పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి మతపరమైన ఆచారాలపై అభిమానం ఉందా..? లేదా..? తెలుసుకోవాలి.

మెట్టినింట్లో అడుగుపెట్టే అమ్మాయిలకు కలుపుగోలుతనం తెలిసి ఉండాలంటారు. అంతే ఎదుటివారి ఇష్టాన్ని గ్రహించాలి. ముఖ్యంగా భర్త ఇష్టాలను సందర్భానుసారం ఇష్టపడితే భార్యపై నమ్మకం ఏర్పడుతుంది. అంతేకాకుండా భర్త కూడా భార్య ఇష్టాలను గౌరవిస్తాడు. అయితే తన ఇష్టానుసారం ఉంటూ భర్త ఇష్టాలను గౌరవించకపోతే మనస్పర్థలు వస్తాయి. ఫలితంగా ఇద్దరి మధ్య గొడవలకు దారితీస్తాయి.
పెళ్లి చేసుకోబోయే అమ్మాయి తనను ఇష్టపడుతుందా..? లేదా..? అనే విషయాన్ని గుర్తించాలి. కొన్ని పెళ్లిళ్లు ఒత్తిడితో చేయడం వల్ల ఎక్కువ కాలం నిలబడవు. అందువల్ల పెళ్లి చూపులకు వెళ్లిన అబ్బాయిలు అమ్మాయి తనను ఇష్టపడుతున్న విషయాన్ని అవసరమైతే నేరుగా అడిగి ఆమె మనసులోని మాటను తెలుకోవాలి.
ఇలా చాణక్య నీతి ప్రకారం కొన్ని సూత్రాలు పాటిస్తే అబ్బాయిలు తాము చేసుకోబోయే అమ్మాయిలతో కలకాలం సంతోషంగా జీవించగలుగుతారు.
Also Read:F3 Movie: ‘బ్లాస్టింగ్’ అట.. ఇంతకీ ఏమిటి ఆ బ్లాస్టింగ్ ?