Chanakya Niti: భార్య భర్తల అనుబంధం అనేది రెండు నావలపై ప్రయాణం వంటిది. ఏ ఒక్క పడవ ప్రయాణం సరిగా సాగక పోయిన మన జీవితం నడి సముద్రంలో మునిగి పోవాల్సిందే.
అలాగే భార్యాభర్తలు ఇద్దరి మధ్య సరైన సఖ్యత, అభిరుచులు లేకపోతే వారి సంసార జీవితం కూడా నాశనమవుతుందని చాణిక్యుడు తన నీతి గ్రంథం ద్వారా ఎంతో అద్భుతంగా వివరించారు. ముఖ్యంగా భార్యాభర్తల వైవాహిక జీవితాన్ని దెబ్బతీసే ముఖ్యమైన విషయాల గురించి తన నీతి గ్రంథంలో తెలిపారు. మరి ఆ విషయాలు ఏమిటి అనే విషయానికి వస్తే..
గోప్యత: భార్యాభర్తల వైవాహిక జీవితం సుఖంగా ఉండాలంటే వారి మధ్య ఉన్నటువంటి కొన్ని విషయాలను గోప్యంగా ఉంచుకోవాలి. వీరిద్దరి మధ్య లోకి మూడవ వ్యక్తి వచ్చినప్పుడు తప్పకుండా వీరి సంసారం బీటలు బారుతుంది.
అబద్ధం: భార్య భర్తల బంధం ఎంతో సున్నితమైనది కనుక వీరీ జీవితంలో అబద్ధాలకు తావివ్వకూడదు. ఇలా అబద్ధాలు చెబుతున్నారన్న విషయం బయటపడితే వారిపై వారికి ఉన్న నమ్మకం పోవటం వల్ల భార్య భర్తల బంధంలో సమస్యలు తలెత్తుతాయి.
ఖర్చులు: భార్యాభర్తలు ఖర్చుల విషయంలో ఎంతో పొదుపుగా ఉండాలి. ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకొని ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇద్దరిలో ఏ ఒక్కరి దుబారా ఖర్చులు చేసిన వీరి మధ్య సంబంధం చెడిపోతుంది.
పరిధి: ప్రతి ఒక్క బంధానికి ఒక పరిధి అనేది ఉంటుంది. ఎప్పుడైతే ఆ పరిధి దాటి ప్రవర్తిస్తారో వారితో ఉన్న సంబంధాన్ని పెంచుకుంటారు. అది భార్య భర్తల విషయంలో అయినా కూడా.
ఓర్పు: కొన్నిసార్లు వైవాహిక జీవితంలో ఎన్నో ప్రతికూల పరిస్థితులు తలెత్తుతాయి. అలాంటి ప్రతికూల పరిస్థితులు తలెత్తినప్పుడు ఓర్పుతో ఒకరికొకరు వారి సమస్యను పరిష్కరించుకోవాలి సహనం లేకుండా ప్రవర్తించడంతో చివరికి ఈ బంధం నుంచి వెళ్లి పోవాల్సి ఉంటుంది.