Ticket controversy in AP: ఏపీ ప్రభుత్వం టికెట్ రేట్స్ తగ్గించిన విషయం తెలిసిందే.. అప్పటి నుండి ఈ వివాదం కొనసాగుతూనే ఉంది. టికెట్ రేట్స్ తగ్గించడం పై చాలా మంది సినీ పెద్దలు అసంతృప్తి వ్యక్తం చేసారు. దీంతో అప్పటి నుండి ఏపీ ప్రభుత్వానికి థియేటర్ యాజమాన్యానికి మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది. ఎపి ప్రభుత్వం టికెట్ రేట్లను పెంచేందుకు అనుమంతి ఇవ్వలేదని థియేటర్ యాజమాన్యాలు కోర్టుకు వెళ్లిన విషయం కూడా తెలిసిందే.
థియేటర్ యాజమాన్యాలు కోర్టుకు వెళ్లి మరి టికెట్ రేట్ పెంచుకునే అవకాశం సంపాదించింది. అయినా కూడా ఈ వివాదాన్ని ఎటు తేల్చకుండా జగన్ ప్రభుత్వం అలాగే ఉంది. దీని వల్ల టాలీవుడ్ ఇండస్ట్రీకి చాలా నష్టం వాటిల్లుతుంది. ఇదంతా చూసి కూడా ఏపీ ప్రభుత్వం అస్సలు నోరు మెదపడం లేదు. సంక్రాంతి సీజన్ అంటే మన టాలీవుడ్ లో అతి పెద్ద సీజన్ అనే చెప్పాలి.
అలంటి సీజన్ ముందు కూడా టికెట్ రేట్స్ విషయంలో ఏపీ ప్రభుత్వం ఎలాంటి విషయం తేల్చకుండా అలాగే మొండి పట్టు పట్టుకుని కూర్చుంది. సోమవారం హైకోర్టులో జరిగిన విచారణలో అఫిడవిట్ దాఖలుకు సమయం కావాలని ప్రభుత్వ తరపు న్యాయవాది హైకోర్టు కు తెలిపారు. దీంతో హైకోర్టు విచారణను ఫిబ్రవరి పదవ తేదీకి వాయిదా పడింది.
Also Read: తగ్గేదే లే.. సినిమా టికెట్ రేట్ల విషయంలో జగన్ డిసైడ్?
టికెట్ ధరలను నిర్దేశిస్తూ జారీ చేసిన జీవో ను హైకోర్టు సింగిల్ బెంచ్ రద్దు చేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ జగన్ సర్కారు పిటిషన్ వేసిన విషయం తెలిసిందే.. ఈ పిటిషన్ విచారణలో భాగంగా కమిటీ వేసి ధరలను ఖరారు చేయాలనీ హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు సూచనల మేరకు టాలీవుడ్ ప్రతినిధులతో అధికారుల సూచనల మేరకు నియమించారు.
ఈ కమిటీ ఇప్పటికే ఒకసారి సమావేశం అయ్యింది. మరొకసారి ఈ వారంలో జరగనుంది. ఈ కమిటీ ఇచ్చే నివేదికను బట్టి ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇంకా చర్చలు పూర్తి కాలేదు కాబట్టి అఫిడవిట్ దాఖలుకు ఇంకా సమయం తీసుకుంటున్నట్టు కనిపిస్తుంది. టికెట్ ధరలు చాలా తక్కువుగా ఉండడంతో భారీ బడ్జెట్ సినిమాలు విడుదలను నిలిపి వేస్తున్నాయి. మరి చూడాలి ఈ వివాదం ఎప్పటికి సర్దుమణుగుతుందో..