Relationship : అందమైన జీవితం ఉండాలని ఎవరైనా కోరుకుంటారు. కానీ ఏం చేస్తే జీవితం బాగుంటుందో చాలా మందికి అవగాహన ఉండదు. ముఖ్యంగా పెళ్లయిన తరువాత జీవిత భాగస్వామితో కలిసి అందమైన ప్రయాణం చేయాలని అనుకుంటారు. కానీ ఇగో ప్రాబ్లమ్స్ తో పాటు కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఒకరి మనసును ఒకరు అర్థం చేసుకోలేరు. దీంతో చిన్న చిన్న విషయాలకే మనస్పర్థలు ఏర్పడి బంధాలను దూరం చేసుకుంటారు. భాగస్వాములు ఇద్దరు దగ్గరగా ఉన్న సమయంలో ఇగో ప్రాబ్లమ్స్ తో ఒకరినొకరు గొడవపడుతారు. ఆ తరువాత విడిపోయి బాధపడుతారు. అయితే వీరి మధ్య అన్యోన్యం దూరం కాకుండా ఉండాలంటే కొన్ని టిప్స్ పాటించాలి. ఇవి పాటించడం వల్ల వీరి మధ్య బంధం శాశ్వతంగా ఆనందంగా ఉంటుంది. అవేంటో తెలుసుకోవాలంటే కిందికి వెళ్లండి…
కొత్త వస్తువులు..
కొంత మందికి కొత్త వస్తువులు కొనుగోలు చేయాలని ఆసక్తి ఉంటుంది. పార్ట్ నర్స్ లో ఇద్దరిలో ఒకరికి మాత్రమే ఈ హాబిట్ ఉండే అవకాశం ఉంది. అయితే వారు ఎందుకు కొత్త వస్తువును కొనుగోలు చేయాలని అనుకుంటున్నారో అర్థం చేసుకోవాలి. ఆ వస్తువు ఉపయోగంగా ఉంటే ఎంకరేజ్ చేయాలి. ఒకవేళ సరదాగాకు వస్తువులు కొనుగోలు చేయాలని అనుకున్నా.. ఒక్కోసారి అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే ఆ వస్తువు కొనుగోలు చేయడం వల్ల వారి మనసు ఉల్లాసంగా మారుతుంది. దీంతో ఆ వస్తువు కొనుగోలు చేసుకునేందుకు అవకాశం ఇచ్చిన పార్ట్ నర్ పై నమ్మకం ఏర్పడుతుంది. అందువల్ల ఈ విషయంలో ఎవరో ఒకరు సర్దుకోవాలి.
పడకగదిలో..
పడకగది విషయానికొచ్చేసరికి మగవాళ్లే కాస్త దూకుడుగా ఉంటారు.ఈ విషయంలో చాలా మంది లేడీస్ ఉత్సాహం చూపించకపోవచ్చు. కానీ వారిపై వికృతంగా ప్రవర్తించకుండా ప్రేమగా దారిలోకి తీసుకొచ్చుకునే ప్రయత్నం చేయాలి. వారితో ప్రేమగా మాట్లాడడంతో పాటు సందర్భాన్ని బట్టి బహుమతులు ఇస్తూ ఉండాలి. ఒక్కోసారి వారికి నచ్చిన విధంగానే ప్రవర్తించడం వల్ల ఎదుటి వ్యక్తిపై ప్రేమ పడుతుంది. దీంతో చాలా విషయాల్లో అనుగుణంగా ఉంటారు.
విహారయాత్రలకు..
ఎక్కువ శాతం మంది ఆడవాళ్లు ఇంటికే పరిమితమై ఉంటారు. దీంతో వారికి వీకెండ్ లో బయటకు వెళ్లాలనే కోరిక ఉంటుంది. ఈ విషయాన్ని వారు అడగకముందే విహార యాత్రలకు తీసుకెళ్లడం ద్వారా వారిలో ఉత్సాహం పెరుగుతుంది. దీంతో పార్ట్ నర్ పై ప్రేమ పుడుతుంది. ఇలా వారు విహార యాత్రలకు వెళ్లడం ద్వారా ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకోగలుగుతారు. ఆ తరువాత వారికి అనుగుణంగా ఉంటారు.
సర్దుకోవడం..
నేటి కాలంలో వయసు దగ్గరిగా ఉన్న వారు ఒకటిగా కలిసి ప్రయాణం చేస్తున్నారు. దీంతో ఇద్దరి మధ్యా పెత్తనం చెలాయించే సమస్యలు వస్తుంటాయి. అయితే ఈ సమయంలో ఎవరో ఒకరు అర్థం చేసుకునే మనస్తత్వం ఉండాలి. అలా లేకుండా చీటికి మాటికి గొడవ పడడం వల్ల ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది. ఫలితంగా అనోన్య జీవితం దెబ్బతింటుంది.
ఇద్దరూ సమానమే..
కొందరు మగవాళ్లు ఫీల్డ్ వర్క్ చేయడం వల్ల తాము ఎక్కువగా కష్టపడిపోయామనే భావనలో ఉంటారు. వాస్తవానికి ఆడవారు ఇంట్లో ఉన్నా.. అంతే కష్టంతో ఉంటారు. కానీ వారు చేసే పనికి ఆదాయం రాదు. ఈ క్రమంలో చీటికి మాటికి తామే గొప్ప అన్న భావన మగవాళ్లలో ఉంటుంది. అటువంటి మనస్తత్వం నుంచి బయటకు వచ్చి ఇద్దరూ సమానమే అన్నట్లుగా ప్రవర్తించాలి. దీంతో ఒక్కోసారి కార్యాలయ అవసరాల్లో జీవిత భాగస్వామి కూడా సాయం చేసే అవకాశం ఉంటుంది. ఫలితంగా ఒకరినొకరు అన్యోన్యంగా ఉండగలుగుతారు.